జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ హీరోలకు ముందస్తు హెచ్చరిక?
- Guest Writer
- 2 hours ago
- 2 min read

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్నారు. అలాంటి ఈయన నుంచి వస్తున్న చిత్రం వారణాసి. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందులో భాగంగానే అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి గత ఏడాది రాజమౌళి గ్లోబ్ ట్రోటర్ అంటూ రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో టైటిల్ రివీల్‌తో పాటు హీరో క్యారెక్టర్రైజేషన్ గురించి కూడా రివీల్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
పైగా ఇందులో మహేష్ బాబు రాముడిగా, రుద్ర పాత్రతో పాటు మరో మూడు పాత్రలో కనిపించనున్నారు అని తెలిపిన విషయం తెలిసిందే.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక అందులో భాగంగానే 2027 సమ్మర్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ముందుగా ప్రకటించింది. ఈ విషయం అభిమానులను సంతోషపరిచినా.. నెటిజన్లు మాత్రం రిలీజ్ డేట్ పై పలు రకాల కామెంట్లు చేశారు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు అంటే చెప్పిన డేట్ కి ఏ రోజు రావు అవి, ఆలస్యం అవుతాయే తప్ప ముందుగా వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఈ డేట్స్ పై అనుమానాలు వ్యక్తం చేయగా స్వయంగా మరోసారి చిత్ర బృందం స్పందించి 2027 సమ్మర్ స్పెషల్‌గా సినిమా రాబోతోంది నేడు ప్రకటించారు
ఇక ఈ ప్రకటన చూసిన అభిమానులు, నెటిజన్స్ జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తన సినిమా విడుదల తేదీనీ ప్రకటించి ముందుగా ఆ హీరోలకు హెచ్చరిక చేస్తున్నాడు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే రాజమౌళి సినిమా వచ్చింది అంటే మినిమం వందల కోట్లు రాబడుతుందనే అంచనాలు అభిమానులలో ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయి కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా దెబ్బకి అన్ని రికార్డులు క్లోజ్ అయిపోతాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అంచనాకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల సమయంలో మరో సినిమా విడుదలయితే అందులో కంటెంట్ బాగున్నప్పటికీ డిజాస్టర్ మూటకట్టుకోవాల్సి వస్తుందని.. అందుకే ఇప్పుడు ముందుస్తు హెచ్చరికగా.. ఏడాదికి ముందే తన సినిమా విడుదల సమయాన్ని ప్రకటించారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది అదే సమ్మర్ టార్గెట్‌గా కే జి ఎఫ్, సలార్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమా విడుదల కాబోతోంది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న సినిమా స్పిరిట్. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన విడుదల కాబోతున్నట్లు సందీప్ రెడ్డి ముందుగానే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలింది అట్లీ అల్లు అర్జున్తో చేస్తున్న సినిమా.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కాబోతోంది. మరి ఇంతమంది బడా డైరెక్టర్లు 2027 సమ్మర్‌ను టార్గెట్‌గా చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నారు. మరి ఏ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
విశ్వంభర పరిస్థితి ఏమిటి?
ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకొన్నారు. చిరు కెరీర్‌లో అతి పెద్ద హిట్ ఇది. సంక్రాంతి సీజన్ ఈ సినిమా వసూళ్లకు ఇంకా బాగా కలిసొచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ‘విశ్వంభర’పై పడింది. నిజానికి ‘మన శంకర వర ప్రసాద’ కంటే ముందే విడుదల కావాల్సిన సినిమా ఇది. సీజీ వర్క్‌లు పెండింగ్‌లో ఉండటం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 2025 చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు గట్టిగా కృషి చేశారు. కానీ కుదరలేదు. దాంతో ఈ ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.
‘మన శంకర వర ప్రసాద’ హిట్టవ్వడం.. ‘విశ్వంభర’కు కలిసొచ్చే అంశం. అందుకే.. ‘విశ్వంభర’ పనుల్ని స్పీడప్ చేసింది చిత్రబృందం. పండగ తరువాత ‘విశ్వంభర’ సీజీ వర్కులు పునః ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడెనిమిది స్టూడియోల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. అవుట్ పుట్ చూసుకొన్న తరువాత రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వస్తుంది. మెగాస్టార్ మాత్రం ఈ వేసవి బరిలో ఈ చిత్రాన్ని దించాలని చూస్తున్నారు. ‘విశ్వంభర’లో ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు మెచ్చుకొనే ఎపిసోడ్లు ఉన్నాయి. అందుకే వేసవి సీజన్ కరెక్ట్ అని చిరు భావిస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారానికి సీజీ వర్కులు పూర్తయి, తొలికాపీ చేతికి అందుతుందని తెలుస్తోంది. మరోవైపు ఓటీటీ డీల్స్ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో.. ఏప్రిల్ లేదా మే నెలల్లో ‘విశ్వంభర’ని వెండి తెరపై చూసేయొచ్చు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. త్రిష కథానాయిక. కీరవాణి సంగీతాన్ని అందించారు.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments