top of page

‘కన్నప్ప’.. అంతా రిస్కే!

  • Guest Writer
  • Jun 25
  • 2 min read
ree

'కన్నప్ప’ అనేది మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఈ సినిమా మొదలెట్టేముందు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. నమ్మకాల్లేవు. ‘ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాగా తీస్తున్నా’ అన్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా ఈ ప్రాజెక్ట్‌ లోకి ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. తనని ట్రోల్‌ కి గురి చేస్తున్నా, వెటకారంగా కామెంట్లు చేస్తున్నా విష్ణు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకొంటూ వెళ్లాడు. దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టి తీశాడు. ఇది విష్ణు కెరీర్‌కి పెద్ద రిస్క్‌. విష్ణుకి అంత మార్కెట్‌ లేదన్నది నిజం. ఈ సినిమా వర్కవుట్‌ అవ్వాలంటే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సాయం పట్టాలన్నది నిజం. ప్రభాస్‌ పాత్ర రెబల్‌ అభిమానులకు నచ్చితే పంట పండినట్టే. కాకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్మలేదు. ఆడియో రైట్స్‌ అమ్మలేదు. ఏరియాల వారీగా అమ్మలేదు. రూ.200కోట్లకు రూ.200కోట్లూ రిస్కే. సినిమా బాగుంటే, మంచి టాక్‌ వస్తే ప్రతీ పైసా తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఈ సినిమాని ఇంత రిస్క్‌ పెట్టి రిలీజ్‌ చేస్తున్నాడు విష్ణు. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశాడు. అయితే ప్రభాస్‌ ఒక్క ఈవెంట్‌ కు వచ్చినా బాగుండేది. ప్రభాస్‌తో ఓ కామన్‌ ఇంటర్వ్యూ చేసి బయటకు వదులుదాం అనుకొన్నారు. కానీ అది కూడా కుదర్లేదు. ఈ సినిమాలో ఇంతమంది స్టార్లు ఉన్నా.. తానొక్కడై మోశాడు విష్ణు. కన్నప్ప విడుదలకు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఈరోజు అడ్వాన్స్‌ బుకింగులు మొదలు కాబోతున్నాయి. ప్రీమియర్లు వేయాలని విష్ణు భావించినా, ఆ ఆలోచన ఇప్పుడు విరమించుకొన్నట్టు తెలుస్తోంది. అడ్వాన్స్‌ బుకింగులు, ట్రెండ్‌ని బట్టి అసలు కన్నప్ప చూడాలన్న ఆలోచన సినిమా ప్రేక్షకులకు ఉందా, లేదా? అనేది తేలిపోతుంది.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...


రష్మిక ప్లేస్‌కి ఎసరు పెడుతుందా?

ree

కన్నడ పరిశ్రమలో ఆరేళ్ల క్రితమే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రుక్మిణి వసంత్‌. హిందీలో అప్‌ స్టార్స్‌ అనే సినిమాలో ఎన్‌.జి.ఓ గర్ల్‌ గా కనిపించిన రుక్మిణి కన్నడలో బర్‌ బల్‌ ట్రియాలజీ కేస్‌ 1 ఫైండిరగ్‌ వజ్రముని సినిమాలో నటించింది. ఆ సినిమాలో రుక్మిణిని చూసి రక్షిత్‌ శెట్టి సప్త సాగరాలు దాటి సినిమాలో ఛాన్స్‌ పట్టేసింది. సప్త సాగరాలు దాటి రెండు భాగాల్లో రుక్మిణి వసంత్‌ యాక్టింగ్‌ అదరగొట్టేసింది. సినిమాలో ఆమెను చూసిన యూత్‌ ఆడియన్స్‌ అంతా ఆమెకు ఫిదా అయ్యారు.

సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్‌ సౌత్‌ ఆడియన్స్‌ కి హాలిలిట్‌ ఫేవరెట్‌ అయ్యింది. అమ్మడికి వరుసగా ఇతర భాషల నుంచి ఛాన్స్‌ లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్‌ లో విజయ్‌ సేతుపతితో ఏస్‌ సినిమా చేసిన రుక్మిణి వసంత్‌ శివ కార్తికేయన్‌ తో మదరాసి సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఇక తెలుగులో నిఖిల్‌ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో వచ్చినా ఆ సినిమా ఎవరు పట్టించుకోలేదు. లేటెస్ట్‌ గా అమ్మడు ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో సినిమాలో ఛాన్స్‌ అందుకుందని తెలుస్తుంది. నీల్‌ తో సినిమా అది కూడా ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ తో ఛాన్స్‌ అంటే అది మామూలు విషయం కాదు. తప్పకుండా రుక్మిణి సౌత్‌ సినిమాల్లో తన ఇంపాక్ట్‌ గట్టిగా చూపించేలా ఉందని అనిపిస్తుంది. తనకు యూత్‌ ఆడియన్స్‌ లో ఏర్పడిన క్రేజ్‌ చూస్తే సరిగ్గా ఒక్క బ్లాక్‌ బస్టర్‌ పడితే ఇక అమ్మడిని తీసుకెళ్లి టాప్‌ ప్లేస్‌ లో పెట్టేలా ఉన్నారు.

ఆల్రెడీ కన్నడ నుంచి వచ్చి రష్మిక టాలీవుడ్‌ ని మాత్రమే కాదు పాన్‌ ఇండియా లెవెల్‌ లో సూపర్‌ సెన్సేషన్‌ గా మారింది. ఇక ఇప్పుడు రష్మిక తర్వాత రుక్మిణి అదే రేంజ్‌ ఫాం కొనసాగించాలని చూస్తుంది. రష్మిక ప్లేస్‌ కి ఎసరు పెట్టే ప్లానింగ్‌ లో భాగంగానే రుక్మిణి స్టార్‌ ఛాన్స్‌ లు పట్టేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా తప్పకుండా రుక్మిణికి ఆ ఛాన్స్‌ ఉందనే అనిపిస్తుంది. రుక్మిణి వసంత్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ కొడితే మాత్రం అమ్మడికి ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ఇదే కాదు మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ కూడా లైన్‌ లో ఉన్నట్టు తెలుస్తుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


దిశా పటానీ చంపేస్తోంది

ree

బాలీవుడ్‌ స్టార్‌ దిశా పటానీ తన ఇటీవలి ఫోటోడంప్‌లో స్టైల్‌ను చంపేస్తోంది. ఈ కల్కి నటి తన స్టైల్‌తో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఇంతలో ఆమె ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఊహించని పరిస్థితిని ఎదుర్కొంది. తన గ్లామరస్‌ లుక్స్‌, ప్రముఖ చిత్రాలకు పేరుగాంచిన నటిని టెర్మినల్‌లోకి ప్రవేశించకుండా ఆపివేసి ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆమె త్వరలో అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి అనేక మందితో కలిసి ‘‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’’ అనే హాస్య చిత్రంలో కనిపించనుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page