కమిషనర్ ‘ఆచితూచి’ వేట.. టౌన్‌ప్లానింగ్‌కు ‘ఆటోమాటిక్’ ఊట
- NVS PRASAD

- 8 hours ago
- 3 min read
15 రోజుల నిబంధనను ఆదాయ మార్గంగా మార్చుకున్న టౌన్ ప్లానింగ్ ముఠా
లాగిన్‌లో బందీ... బయట భవనాలకు గ్రీన్ సిగ్నల్!
నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు అధికార ముద్ర
‘చూసి చెబుతా’... అంటుంటే ‘పాస్' అయిపోయింది!
ఫైల్ పరిశీలనలో కమిషనర్... ఫీల్డ్‌లో నిర్మాణాలు
నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు రెడ్ కార్పెట్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిని అరికట్టాలని, ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆచితూచి వ్యవహరించే కమిషనర్ కూర్మారావు శైలినే కొందరు అవినీతి అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మున్సిపల్ నిబంధనల్లోని ‘డీమ్డ్ టు బి అప్రూవ్డ’ (15 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే ఆటోమాటిక్‌గా ప్లాన్ ఆమోదం పొందడం) అనే లూప్‌హోల్‌ను అడ్డుపెట్టుకొని టౌన్ ప్లానింగ్ సిబ్బంది, కొందరు ప్రైవేట్ సర్వేయర్లు చేతులు కలిపి అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఒకవైపు ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) ఫైళ్లు కమిషనర్ వద్దే పెండింగ్‌లో ఉంటున్నా... మరోవైపు బిల్డింగ్ ప్లాన్‌లు ఎలా అప్రూవ్ అయిపోతున్నాయి? అసలు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో కమిషనర్‌కు తెలియకుండా తెరవెనుక జరుగుతున్న ఆ ‘కొత్త గేమ’ ఏంటో చూద్దాం.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో అయినదానికి, కానిదానికి సొమ్ములు వసూలు చేస్తున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దితే గాని ప్రజా సమస్యలు పరిష్కారం కావని భావించి క్షేత్రస్థాయిలో ఆచితూచి వ్యవహరిస్తున్న కమిషనర్ కూర్మారావు వ్యవహార శైలినే ఇప్ప్పుడు అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మట్టి నుంచి తైలం తీయడమంటే పుక్కిట పురాణం అనుకున్నాం గానీ, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం మేనేజ్‌మెంట్ పాఠం కంటే బాగా పెద్దదని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు నిరూపిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లో ప్లాన్ అప్‌లోడ్ చేసిన 15 రోజుల్లో దాన్ని అనుమతించడమో, లేదూ అంటే తిరస్కరించడమో చేయాలి. ఆ విషయం నిర్మాణదారుడికి చెప్పాలి. అలా కాకుండా ఆన్‌లైన్‌లోకి వెళ్లిన ప్లాన్ 15 రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల లాగిన్‌లోనే ఉండిపోతే ఆటోమాటిక్‌గా ప్లాన్ అప్రూవల్ కింద భావించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే లిటిగేషన్‌ను పట్టుకొని టౌన్‌ప్లానింగ్ అధికారులు కిందిస్థాయిలో ప్లానింగ్ సెక్రటరీలు, కొందరు లైసెన్స్‌డ్ సర్వేయర్లు తెలివిగా డీమ్డ్ టు బి ఎప్రూవ్డ్ కింద అనేక అక్రమ నిర్మాణాలకు అనుమతులు సంపాదించేశారు. కమిషనర్ కూర్మారావుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొత్త. ప్రతీది తాను చూస్తానని, ఆ తర్వాతే ఈ`ఆఫీస్ ద్వారా అప్రూవల్స్ ఇస్తానని ఆయన భావిస్తున్నారు. కానీ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల మేరకు 15 రోజుల్లోగా అప్లై చేసిన ఇంటి ప్లాన్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా కానప్ప్పుడు ఆటోమాటిక్‌గా అది అప్రూవల్ కిందకే వస్తుంది. కమిషనర్ ఫీల్డ్‌కు వచ్చి ప్లాన్‌లో పేర్కొన్న విధంగా స్థలం ఉందా? లేదా? అని చూసే అవకాశం ఇవ్వకుండా సచివాలయ స్థాయిలోనే సెక్రటరీలు కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. ఎలాగూ కమిషనర్ ఫీల్డ్‌కు వచ్చాకే అప్రూవల్ అంటారు కాబట్టి, ఆయన లాగిన్‌లోనే వీలైనంత వరకు ప్లాన్ మిగిలిపోయేట్టు చూసుకొని 15 రోజుల తర్వాత నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇల్లు నిర్మించాలంటే ముందుగా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సైట్‌లో ప్రీ డీసీఆర్‌ను అప్‌లోడ్ చేయాలి. దీన్ని పరిశీలించిన అమరావతి అధికారులు వీఎల్‌టీ ఉందా? లేదా? ఎన్ని చదరపు అడుగుల్లో కడుతున్నారు? దానికి ఎంత రుసుము చెల్లించాలి? సెట్‌బ్యాక్స్ ఎలా ఉండాలి? వంటివి నిర్ధారించి సంబంధిత పేమెంట్‌ను జనరేట్ చేసి ప్లానింగ్ సెక్రటరీ లాగిన్‌కు పంపుతుంది. అక్కడి నుంచి మÖడు రోజుల్లో ఓకే చేసి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపాలి. అక్కడ కూడా మÖడు రోజుల్లో ఏదో ఒకటి నిర్ణయించి అసిస్టెంట్ సిటీ ప్లానర్‌కు పంపించాలి. అక్కడ కూడా మÖడు రోజుల్లో ఓకే చేసి కమిషనర్ లాగిన్‌కు పంపుతారు. ఆరు రోజుల్లో కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఓకే చేసిన ప్లాన్‌ను ఓకే చేయాలి. ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓకే చేసినా, లేదూ ఆన్‌లైన్‌లో వచ్చిన కాగితాల మేరకు ఓకే చేసినా ఫర్వాలేదు కానీ నిర్ణయం మాత్రం ఆరు రోజుల లోపు తీసుకోవాలి. 15వ రోజు దాటితే అది అప్రూవల్ అయిపోయినట్టే లెక్క. అప్ప్పుడు తిరస్కరిస్తున్నామంటే కుదరదు. ఈ నిబంధన కమిషనర్ కూర్మారావుకు తెలియదు. ఎందుకంటే.. ఆయన మాతృసంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాదు. దీంతో ప్లాన్ ఆన్‌లైన్‌లో పెట్టిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, టీపీబీవోలు.. ఇలా అందరూ ఒక్కటైపోయి డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అసలు ఎంత చలానా తీయమంది? లేదా ఏం కొర్రీలు పెట్టింది? బయటపెట్టకుండానే కమిషనర్ లాగిన్‌కు పంపించేస్తున్నారు. అసలే సిబ్బంది మీద అపనమ్మకంతో ఉన్న కూర్మారావు వీటిని తీరిగ్గా పరిశీలించి ఓకే చేద్దామని భావిస్తున్నారు. కానీ ప్రతీ 15 రోజులకు ఆయన లాగిన్‌లో ఉన్న ప్లాన్‌లు ఆటోమాటిక్‌గా అప్రూవల్ అయిపోతున్నాయి. గత వారానికి 22 ప్లాన్‌లు ఈ విధంగానే డీమ్డ్ టు బి అప్రూవల్ అయిపోయినట్టు చెప్ప్పుకుంటున్నారు. ఈ వారంలో మరికొన్ని అయిపోయినా ఆశ్చర్యం లేదు.
మిగిలిన శాఖలకు, మున్సిపాలిటీలో పాలనకు మధ్య చాలా తేడాలుంటాయి. ఏదైనా ఈ`ఫైలింగ్ ద్వారానే తన వద్దకు రావాలని కమిషనర్ పట్టుపడుతున్నారు. ఇందులో తప్ప్పులేదు. ఎందుకంటే.. స్వయంగా రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడే ఆమధ్యన ఫైల్ క్లియరెన్స్‌లో రాష్ట్రంలో ఫస్ట్ వచ్చారు. అవన్నీ ఈ`ఫైలింగ్ ద్వారా జరిగినవే. కానీ మున్సిపాలిటీలో అలానే చేస్తామంటే కుదరకపోవచ్చు. 70 శాతం పనులు ముందుగా కాగితం మీద అంచనాలు వేసుకొని అప్రూవల్ తీసుకొని చేస్తారు. 30 శాతం పనులకు మాత్రం పని అయిన తర్వాత కాగితాల మీద పెడతారు. ఎందుకంటే.. ఇక్కడ వాటర్ వర్క్స్, ఎýక్ట్రికల్ వర్క్స్‌తో పాటు మిగిలిన ఎమర్జెన్సీ పనులుంటాయి. దీనికి ఈ`ఫైలింగ్ ద్వారా ప్రాపర్ ఛానల్‌లో రావాలి అంటే కుదరదు. దేశంలో ఏ మున్సిపాలిటీలోనైనా ఇది సాధారణం. అయితే 15 ఏళ్లకు పైబడి ఇక్కడ పాలకవర్గం లేకపోవడంతో సిబ్బంది పూర్తిగా గాలి పట్టేశారని, పాలనను గాడిలోకి తేవాలంటే, ముందు పరిపాýనా విధానం మార్చాలని కూర్మారావు భావిస్తున్నారు. అందులో భాగంగా అన్నీ తానే చూడాలని కోరుకుంటున్నారు. సరిగ్గా ఇదే ఇప్ప్పుడు టౌన్‌ప్లానింగ్‌లో కొందరికి ఆదాయ వనరుగా మారిపోయింది. గతనెల నుంచి ప్లాన్ అప్రూవల్ కోసం 2.0 విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం లైసెన్స్‌డ్ సర్వేయరే బాధ్యత వహిస్తూ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేయొచ్చు. కాకపోతే 300 చదరపు మీటర్ల లోపు భవన నిర్మాణం ఉండాలి. కానీ ఈ విధానానికి ముందే కమిషనర్ లాగిన్‌కు పంపిన ప్లాన్‌ను ఆటోమాటిక్‌గా అప్రూవల్ అయిపోయాయి. దీంట్లో చాలావాటికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ చెప్పిన విధంగా అనుసరించలేదని తెలుస్తుంది. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. వీటికి వేకెండ్ ల్యాండ్ టాక్స్ వేయాలి. ఇది గతంలో రొటీన్‌గా జరిగిపోయేది. వీఎల్‌టీ వేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ములు తీసుకుంటున్నారని కమిషనర్ దగ్గర ఫిర్యాదులు ఉండటంతో ఖాళీ స్థలాన్ని చూసిన తర్వాతే పన్ను వేస్తారని కమిషనర్ పట్టుపడుతున్నారు. దీంతో వందలకొద్దీ దరఖాస్తులు కమిషనర్ వద్దే పెండింగ్‌లో ఉండిపోయాయి. ఒకరి స్థలానికి మరొకరు వీఎల్‌టీ వేయించుకొని, అది తమదేనని భవిష్యత్తులో క్లెయిమ్ చేస్తారన్న ఉద్దేశం కమిషనర్‌దైతే, వీఎల్‌టీ ఉన్నంత మాత్రాన స్థలం మీద హక్కులు మున్సిపాలిటీ ఇచ్చినట్టు కాదని కోర్టులు చెబుతున్నాయి. అయితే కమిషనర్ కూర్మారావుకు ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో భూముల లిటిగేషన్‌పైన తాను కోర్టుకు హాజరు కాకూడదనే కారణంతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీఎల్‌టీ వేస్తేనే భవన నిర్మాణానికి అప్లై చేసుకోవాలి. అసలు మున్సిపాలిటీలో వీఎల్‌టీలే విధించనప్ప్పుడు ప్లాన్ అప్రూవల్ కావడం అసాధ్యం. అయినా ఆటోమాటిక్‌గా 15 రోజుల్లో అప్రూవ్ అవుతున్నాయంటే ఎలా తప్ప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.






Comments