కమిషనర్ బదిలీ.. సిబ్బంది దీపావళి!
- NVS PRASAD

- 5 hours ago
- 2 min read
కూర్మారావు ‘స్వయంకృతం’ వెనుక అసలు కథ
‘సెల్ఫ్ డబ్బా’ సీన్ రివర్స్.. మెడకు చుట్టుకున్న కక్షసాధింపు

అధికారం చేతిలో ఉంది కదా అని కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తే, తోటి సిబ్బందిని పీడించి మానసిక హింసకు గురిచేస్తే, అంతిమంగా వచ్చే పతనం ఎలా ఉంటుందో చూపించే సంచలన కథనం ఇది. మూడు నెలల పాటు తన ‘సెల్ఫ్ డబ్బా’తో, అహంకారపూరిత నిర్ణయాలతో కార్పొరేషన్‌ను అస్తవ్యస్తం చేసిన కమిషనర్ కూర్మారావు బదిలీ ఉత్తర్వులు రాగానే సిబ్బంది దీపావళిలా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు కూర్మారావు బదిలీకి దారితీసిన పరిస్థితులేంటి? అవగాహన లేని కొందరి సలహాలు విని ఆయన చేసిన స్వయంకృతాపరాధాలు ఏమిటి? తన తప్పులను ఎండగట్టిన ‘సత్యం’ పత్రికపై ఆయన సాగించిన కక్షసాధింపు రాజకీయాలు ఎలా తిరగబడ్డాయి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో...

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)ప్రతి ఫైల్‌కు కొర్రీ పెట్టడం, అందర్నీ అనుమానించడం, తనకు తప్ప మున్సిపాలిటీలో మరొకరికి పబ్లిసిటీ రాకూడదని సస్పెండ్లు, సరెండర్లు చేయడమే నిజాయితీగా చూపించి పబ్లిసిటీ పీక్స్‌లో చేయించుకొని తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఆత్మస్తుతి`పరనిందతో మÖడు నెలలు ఇక్కడ పని చేసిన కమిషనర్ హనుమంతు కూర్మారావుకు బదిలీ అయిందని తెలియగానే మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఇది మంచి సంప్రదాయమా? చెడు సంప్రదాయమా? పక్కన పెడితే దీపావళి జరుపుకోవడం ఎలాంటిదో, ఇదీ తమ పాలిట అలాంటిదేనని కొందరు సిబ్బంది చెప్ప్పుకొచ్చారు. మÖడు నెలలుగా ఎంత హింసను భరించివుంటే ఒక అధికారి బదిలీని పండగలా చేసుకుంటారు?! కూర్మారావు ఇక్కడి నుంచి బదిలీ కావడానికి కేవలం రాజకీయ కారణాలే లేవు. కర్ణుడి చావుకు ఉండాల్సినన్ని రీజన్లు ఉన్నాయి. ఇందులో 99 శాతం ఆయన స్వయంకృతం. శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ వంటి ఫోకల్ పాయింట్‌కు వచ్చిన తర్వాత ఆయనకు కన్నూమిన్నూ కనపడలేదు. ఆయనకు తప్ప మరొకరికి క్రెడిట్ దక్కాలని భావించలేదు. సరిగ్గా ఇలాంటి మనస్తత్వమే ఉన్న మరో మీడియా సలహాలు పాటించి ఆయన బదిలీకి గురయ్యారు. ఇప్ప్పుడు పోస్టింగ్ ఎక్కడో కూడా తెలియని పరిస్థితి తెచ్చుకున్నది అక్షరాలా ఆయనే. శ్రీకాకుళం కార్పొరేషన్ కోసం ఏమాత్రం అవగాహన లేని బచ్చాలు ఇచ్చిన సూచన మేరకు ఆయన సస్పెన్షన్లు, సరెండర్లు చేసుకుపోయారు. అందులో తన పరిధి ఏమిటో కూడా ఆయన చూసుకోలేదు. కూర్మారావు సస్పెండ్ అయిన తర్వాత ఆయన మళ్లీ ఇక్కడికే వస్తారని, రావాలని కథనాలు రాసిన పత్రికల్లో ‘సత్యం’ మొదటిది. అటువంటిది ఆయన పనితీరు మార్చుకోవాలని ఒక్క వార్త ప్రచురిస్తే, ఆయన ఏకంగా రాజకీయ నాయకుడిలా కక్షసాధింపులకు దిగారు. ‘సత్యం’ పత్రికతో అనుబంధం ఉన్నవారి వ్యాపారాలను మÖయించడానికి వేకువజామున నాలుగు గంటల నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అది కుదరదని తెలుసుకున్న తర్వాత రెండు రోజుల క్రితం ఆగమేఘాల మీద మున్సిపల్ మేనేజర్ నాగరాజును పిలిపించి ‘సత్యం’ మీద అవాకులు, చెవాకులు పేర్చి జిల్లా ఎస్పీకి మెయిల్ చేశారు. అక్కడికి 18 గంటలు గడిచేసరికి ఆయన బదిలీ ఉత్తర్వులు బయటకు వచ్చేశాయి. ఆయన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగినవారి మీద పోలీస్‌స్టేషన్‌లో కేసులున్నాయి. అలాగే ‘సత్యం’ పత్రిక మీద కూడా ఒక ఎఫఐఆర్ వేయించేస్తే కాళ్ల బేరానికి వస్తారని కూర్మారావుకు సలహా ఇవ్వడంతో రెండు చెవుల మధ్య ఉన్న మెదడును వాడని కూర్మారావు వారు చెప్పినట్టే అసత్యాలను అల్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన పరువుకు భంగం వాటిల్లిందనుకుంటే పరువునష్టం దావా వేయొచ్చు. అది ‘సత్యం’కు కొత్త కాదని సలహాలిచ్చినవారికి తెలుసు. అందుకే ఈసారి కొత్త వంటను వార్చాలని చూశారు. ఇలాంటివారి సలహాల వల్లే కూర్మారావు సొంతవూరిలో గౌరవం పోగొట్టుకున్నారు. ‘సత్యం’ వంటి అనేక పత్రికలు కూర్మారావు నిజాయితీపరుడని రాయడం వల్లే ఆయన కోసం బయటి ప్రపంచానికి తెలిసింది. మరీ ముఖ్యంగా ఆయన సస్పెన్షన్ సమయంలో. ఇప్ప్పుడు దాన్ని పట్టుకొని కొందరు పాపం తెగ బాధపడిపోతున్నారు. కూర్మారావు పనితీరుకు సాక్ష్యాలు చూపిస్తూ ‘సత్యం’ కథనాలు రాస్తే, కొన్ని పత్రికలు తమ మీదే రాసినట్లు బాధపడిపోతూ ఎందుకు వ్యక్తిగతంగా తీసుకున్నారో కనీసం వారి కురచబుద్ధికైనా అర్థమవుతుందో లేదో?! అసలు కూర్మారావు నిజంగా నిజాయితీపరుడేనా? డుమా పీడీగా పని చేసిన కాలంలో ఏం జరిగింది? మరికొద్ది రోజుల్లో స్వచ్ఛ శ్రీకాకుళం అవార్డు అందుకోవడం కోసం వచ్చిన టీమ్‌ను కూర్మారావు ఏం చేశారు? గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహం ఏర్పాటు కోసం దిమ్మలు కట్టడం, వాటి తొలగింపులో కట్ర కోణాలు, గుండెలు బాదేసుకుంటూ వండి వార్చిన కథనాలపైన తీరిగ్గా మట్లాడుకుందాం. అంతవరకు కమిషనర్ వెళ్లిపోయారన్న బాధలో కొందరికి, ఆనందంలో ఉన్న మరికొందరికి బ్రేక్ ఇద్దాం. బాణాసంచా కాల్చేవారంతా అవినీతిపరులని, కూర్మారావు దగ్గర వారి ఆటలు సాగకే పండగ చేసుకున్నారని సమర్ధించే బ్యాచ్ ఈ సాయంత్రం నుంచే మొదలవుతుంది. దానికి కూడా సమాధానం వస్తాది.. జస్ట్ వెయిట్.






Comments