top of page

కరోనా యోధుడు.. గిరిజనుల ఆప్తుడు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 12 hours ago
  • 2 min read
  • సీతంపేటలో భార్యాభర్త జుగల్‌బందీ

  • నెలకు 100కు పైగా నార్మల్ డెలివరీలతో రికార్డు

  • నిన్నటి కార్యాలయ బాధితుడు నేడు అదే శాఖకు బాస్

  • శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్న నరేష్

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

జిల్లా వైద్య ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయడం ఎవరి తరం కాకపోయినా కనీసం కొంతశాతమైనా సంస్కరిస్తారన్న ఆశాభావం కొత్త డీఎంహెచ్‌వో పట్ల వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన ప్రాథమిక దశ అంతా శ్రీకాకుళంలోనే నడిచింది. పీహెచ్‌సీ వైద్యాధికారిగా డీఎంహెచ్‌వో కార్యాలయానికి మామÖళ్లు సమర్పించుకున్న సగటు వేతన జీవి దగ్గర్నుంచి ఇప్ప్పుడు డీఎంహెచ్‌వోగా అదే కార్యాలయానికి రావడంతో కొంతమేరకు ఫలితాలను ఆశించడంలో తప్ప్పు లేదేమో!

డాక్టర్ ఇ.వి.నరేష్‌కుమార్.. ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో)గా శ్రీకాకుళానికి బదిలీపై రానున్నారు. కొత్త పదవిలోకి వస్తున్న నరేష్‌కుమార్ జిల్లా ప్రజలకు మాత్రం కొత్తవారు కాదు. గతంలో ఆయన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైద్యాధికారిగా పలు బాధ్యతలను నిర్వహించారు. అందుకే ఆయన డీఎంహెచ్‌వోగా వస్తున్నారని తెలియగానే జిల్లాకు చెందిన చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తొలుత భార్య.. ఆమె వెంట భర్త

డాక్టర్ నరేష్‌కుమార్ విశాఖ వాస్తవ్యులు. ఆయన సతీమణి భాను కూడా వైద్యురాలే. మొదట ఆమెకే పోస్టింగ్ వచ్చింది. గిరిజన ప్రాంతమైన పాతపట్నం మండలం బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) వైద్యాధికారిగా 2005 ప్రాంతంలో నియమితులయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి కావడంతో ఆమెకు తోడుగా నరేష్‌కుమార్ బైదలాపురానికి వచ్చేవారు. పూర్తిగా గిరిజన ప్రాంతమైన ఈ పీహెచ్‌సీ పరిధిలోని కొండలు, గుట్టల్లో ఉన్న గిరిజన గూడేలను సందర్శించడం గర్భిణిగా ఉన్న డాక్టర్ భానుకు కష్టంగా ఉండేది. అప్పటికి వైద్యవిద్య పూర్తి చేసిన భర్త డాక్టర్ నరేష్‌కుమార్ భార్యకు బదులు తనే పీహెచ్‌సీ సిబ్బందితో కలిసి గిరిజన ప్రాంతాýను సందర్శిస్తూ గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు పని చేశారు. వృత్తిని ప్రేమించే ఈయనకు ఇక్కడ ఉన్న సమయంలోనే పోస్టింగ్ లభించింది. కొత్తూరు మండలం కురిగాం పీహెచ్‌సీ వైద్యాధికారిగా నియమితుýయ్యారు. అక్కడ పని చేస్తుండగానే ఇన్‌సర్వీస్ కోటాలో జనరల్ సర్జరీలో పీజీ(పోస్టుగ్రాడ్యుయేషన్) సీటు వచ్చింది. రెండేళ్ల ఆ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ కేంద్రం ఉన్న సీతంపేట కమÖ్యనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) సర్జన్‌గా పోస్టింగ్ వచ్చింది.

భార్యాభర్తల జుగల్‌బందీ

సీతంపేట సీహెచ్‌సీలో బాధ్యతలు చేపట్టే నాటికి ఆ ఆస్పత్రి పరిస్థితి నామమాత్రంగా ఉండేది. అక్కడి డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉన్న జూనియర్ అధికారిని మార్చడంతోపాటు బైదలాపురంలో పని చేస్తున్న నరేష్‌కుమార్ సతీమణి డాక్టర్ భానును కూడా ప్రభుత్వం సీతంపేట సీహెచ్‌సీకి బదిలీ చేసింది. దాంతో ఆ ఆస్పత్రి దశ మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ కలిసి సమష్టిగా గిరిజన ప్రాంతాలకు వైద్యసేవలు అందించారు. గిరిజన ప్రాంతాల్లో రెగ్యులర్‌గా పర్యటిస్తూ స్థానికులకు వైద్యపరీక్షలు చేసేవారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధలు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యల చేపట్టేవారు. గిరిజనులను అప్రమత్తం చేసేవారు. మÖఢాచారాలకు ప్రాధాన్యతనిచ్చే గిరిజనుల్లో చైతన్యం నింపి ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించారు. ఫలితంగా ఎన్నడూ లేనివిధంగా ప్రతినెలా వంద వరకు నార్మల్ డెలివరీలు(సాధారణ ప్రసవాలు) నిర్వహించేవారు. తోటి వైద్యసిబ్బందితో డాక్టర్ నరేష్‌కుమార్ కలుపుగోలుగా ఉంటూ మÖడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లు సేవలు అందించేవారు. దాంతో అటు గిరిజనుల్లోనూ, ఇటు ఆ శాఖ సిబ్బందిలోనూ ఆయనకు ఆదరాభిమానాలు పెరిగాయి. నరేష్‌కుమార్ నిబద్ధతను గుర్తించిన సీతంపేట ఐటీడీఏ అప్పటి పీవో ఆయనకు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌గా నియమించారు.

కరోనాలో అవిశ్రాంత సేవలు

అక్కడ పనిచేస్తున్న సమయంలోనే 2020లో కరోనా మహమ్మారి దాడి చేసింది. యుద్ధప్రాతిపదికన వైద్యసేవలు విస్తరించి, అందించాల్సి వచ్చింది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ రోగులకు నిరంతరాయంగా సేవలు అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ దానికి తగిన అధికారి గా డాక్టర్ నరేష్‌కుమార్‌ను గుర్తించి ఆయన్ను జిల్లా నోడల్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు చేపట్టిన నరేష్‌కుమార్ జిల్లా అంతటా పర్యటిస్తూ రోగులకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు కృషి చేయడం ద్వారా జిల్లాలో కరోనాను అదుపు చేయడంలో విశేషంగా శ్రమించారు. ఆ తర్వాత సాధారణ బదిలీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తునికి బదిలీపై వెళ్లిన ఆయన ఆ తర్వాత విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ప్రధాన వైద్యాధికారిగా వెళ్లారు. గతంలో సీతంపేట ఐటీడీఏ పీవోగా ఉన్నప్పుడు డాక్టర్ నరేష్‌కుమార్ నిబద్ధతను గుర్తించిన ఒక ఐఏఎస్ అధికారి తాను జీవీఎంసీకి కమిషనర్‌గా వెళ్లిన తర్వాత నరేష్‌కుమార్ సేవలు విశాఖ నగరానికి అవసరమని గుర్తించి ప్రభుత్వస్థాయిలో ప్రయత్నించి అక్కడికి తీసుకెళ్లారు. అప్పటినుంచీ అక్కడే కొనసాగుతున్న డాక్టర్ నరేష్‌కుమార్ ఇప్పుడు శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా రానున్నారు. ఈమేరకు గురువారం శ్రీకాకుళం వచ్చి డీఎంహెచ్‌వో బాధ్యతలు చేపడతారని సమాచారం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page