గండరి ‘గంగడు’
- BAGADI NARAYANARAO

- Apr 30
- 2 min read
రాణిపేట శిబిరానికి అండదండ
ఏజెంట్ల నియామకంలో కీలకం
పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు
జూదరుల వీక్‌నెస్‌తో కోట్లు సంపాదన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాపారం ముసుగులో పేకాట శిబిరాన్ని లక్ష్మీనారాయణతో కలిసి రాణిపేటలో నిర్వహిస్తున్నాడు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో పేకాట శిబిరాన్ని నిర్వహించడంలో గంగడే కీలకమని ప్రచారం ఉంది. శిబిరానికి వచ్చే జూదర్లకు భరోసా కల్పించడానికి పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నానని బహిరంగంగా చెప్ప్పుకొని తిరుగుతుంటాడట. శ్రీకాకుళం వాహనాల ద్వారా పర్లాకిమిడి మీదుగా రాణిపేటకు వచ్చే జూదర్లకు ఒడిశా పోలీసులు నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాకుండా గంగడు చూసుకుంటాడని జూదర్లే చెబుతుంటారు. వ్యాపారం పేరుతో గంగడు శ్రీకాకుళం నగరానికి రాకపోకలు సాగిస్తుంటాడని తెలిసింది. శ్రీకాకుళం నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా రాణిపేటలో నిర్వహంచే శిబిరానికి జూదర్లను తీకువెళ్లడానికి నగరంలో కొందరు ఏజెంట్లను పెట్టుకున్నట్టు తెలిసింది. పేకాట శిబిరాల నిర్వాహకులు లక్ష్మీనారాయణ, గంగడుతో క్లోజ్‌గా మÖవ్ అయ్యేవారంతా రాణిపేట వెళ్లకుండానే శ్రీకాకుళం నుంచి వ్యవహారం నడిపిస్తున్నారని తెలిసింది. అద్దెకు వాహనం ఏర్పాటుచేసి, ఎక్కడ నుంచి, ఎంత సమయానికి బయలుదేరుతుందో సమాచారం చేరవేస్తారు. సమయానికి చేరిన వారిని వాహనాల్లో కూర్చోబెట్టి రాణిపేటకు పంపిస్తారు. ఆట ముగిసిన తర్వాత అక్కడ నుంచి తిరిగి శ్రీకాకుళం తీసుకువస్తారు.
శ్రీకాకుళం సరిహద్దుల్లో గతంలో గారబంద, సుంకి తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలను నిర్వహించేవారు. ఈ శిబిరాల్లో గంగడుకీ వాటాలు ఉండేవి. నిర్వాహకులతో తలెత్తిన విభేదాలతో సుంకి, గారబందలో పేకాట శిబిరాల నుంచి తప్ప్పుకొని రాణిపేటలో కొత్తగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద పాతపట్నం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి పేకాట శిబిరాలకు వెళ్లేవారిపై గత కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులను స్టేషన్‌కు తరలించి వ్యక్తిగత వివరాలు సేకరించి పంపిస్తున్నారు. దీంతో పర్లాకిమిడికి చెందిన లక్ష్మీనారాయణ, గంగడు గత కొంత కాలంగా జిల్లా సరిహద్దుల్లోకి రాకుండానే శ్రీకాకుళంలో ఉన్న తమ మనుషులతో వ్యవహారం నడిపిస్తున్నారని తెలిసింది. జిల్లాకు చెందినవారు ఒడిశాలో పేకాట శిబిరాలు మÖసేశారని సంబరపడే లోపే పర్లాకిమిడికి చెందిన లక్ష్మీనారాయణ, గంగడు పేకాటను జిల్లాలో ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి పర్లాకిమిడి పోలీసులు శిబిరంపై దాడి చేసిన తర్వాత పోలీస్‌స్టేషన్‌లోనే ఇప్పటికీ 16 వాహనాలు ఉన్నాయి. ఆంధ్రా పోలీసుల నుంచి పర్లాకిమిడి పోలీసులపై ఒత్తిడి ఉన్నా ఒడిశాలో నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు చేసి వదిలేస్తున్నారు. దీంతో రాణిపేట పేకాట శిబిరం యథేచ్ఛగా కొనసాగుతుంది.






Comments