top of page

గాయత్రీ... హతవిధీ!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 4 hours ago
  • 3 min read
  • నెలల క్రితమే బయటపడ్డ మార్ఫింగ్ జాడ

  • విద్యార్థినులను భయపెట్టి తొక్కిపెట్టే కుట్ర

  • ‘సత్యం’ కథనం, పేరెంట్స్ ఒత్తిడితో ఫిర్యాదు

  • నాటి స్ఫూర్తికి భిన్నంగా నడుస్తుందన్న అనుమానాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

“స్వామినాయుడు, అంబటి రంగారావు, పులఖండం శ్రీనివాసరావు, విష్ణుమూర్తి వంటి విద్యావేత్తలు, ఉన్నత ఆలోచనాపరుల కనుసన్నల్లో నడిచిన విద్యాసంస్థ అది. మాలాంటి వారికి వారంతా ఒక దిక్సూచి లాంటివారు. గురజాడ సంస్థ జిల్లాకు ఒక బ్రాండ్. గాయత్రీ హÃమాలకు, యువజనోత్సవాలకు అదో వేదిక. కానీ ఈరోజు ఆ సంస్థ పేరు నలుగురు ఆకతాయి విద్యార్థుల మూలంగా ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. ఒక విద్యాసంస్థ చరిత్రను చెరిపేయడానికి ఇలాంటి నలుగురు పిల్లలు చాలు”

.. ఇది ‘సత్యం’ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన కథనం కింద వచ్చిన కామెంట్. ఇది అక్షరసత్యం. జిల్లాలో ఐఐటీలు, ఎంబీబీఎస్‌లంటూ నారాయణ, చైతన్య కాలేజీలకు పిల్లలు క్యూకడుతున్న రోజుల్లో కూడా పోటీని తట్టుకొని సంస్కారవంతమైన పద్ధతిలో కాలేజీ నడపడానికి స్వామినాయుడు లాంటి విద్యావేత్త ఇచ్చిన స్ఫూర్తి ఇప్ప్పుడేమైంది? చదువుల తల్లిని చెరబట్టడానికి ఎక్కడా చీడపురుగులుంటాయి. అటువంటివి సంస్థను తినేయకుండా, వ్యవస్థను మింగేయకుండా చూడటానికే కదా.. విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్పించేది. ఇంటి దగ్గర ఉంటే చదవరని, ఆన్‌లైన్ క్లాసులకు ముఖం చూపించరని లోకల్‌లో ఉండి కూడా హాస్టల్‌లో చేర్పించే తల్లిదండ్రులు కోకొల్లలు. అటువంటి చోట విద్యతో పాటు బుద్ధులు కూడా చెబుతారనే అంతా భావిస్తారు. కానీ గురజాడ విద్యాసంస్థల్లో జరిగిందేమిటి? అక్కడ విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తే.. ఆ వ్యవహారాన్ని నాన్చి, బాధితుల కుటుంబాల్ని భయపెట్టి, టీసీ అనే బ్రహ్మాస్త్రం వాడేశామని బయటకు చూపించి, తప్పించుకోవాలని చూశారు తప్ప, దీని మూలాలు ఇంకా క్యాంపస్‌లోనే ఉన్నాయని ఒప్ప్పుకోలేకపోతున్నారు. ‘సత్యం’ దీన్ని గురువారం సాయంత్రం ఫ్లాష్ చేసిన తర్వాత మహిళా అధ్యాపకులతో ఫోన్లు చేయించి.. ‘సత్యం’లో కథనం తొలగించాలని, లేదంటే డొమెస్టిక్ వయోలెన్స్ కేసులు పెడతామని భయపెట్టించడం తప్ప బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన మేనేజ్‌మెంట్‌కు రాకపోవడం శోచనీయం. నిజమే.. మహిళా అధ్యాపకుల మార్ఫింగ్ వీడియోలు లేకపోవచ్చు. లేదా ఉండొచ్చు.. ఎవరికి తెలుసు? నిన్నటి వరకు ఈ పంచాయితీ మేనేజ్‌మెంట్ పరిధిలోనే కదా జరిగింది. అధ్యాపకులకు జరిగితే ఒకటి, వారు పాఠాలు చెబుతున్న పిల్లలకు జరిగిదే మరొకటా? ఏదైనా మార్ఫింగే.

‘సత్యం’లో కథనం వచ్చేసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పెంచిన తర్వాత ప్రిన్సిపాల్ సత్యనారాయణతో తూతూ మంత్రంగా ఒక ఫిర్యాదు ఇప్పించారు. మార్ఫింగ్ ఫొటోల్లో మహిళా అధ్యాపకులు లేరని ‘సత్యం’కు ఫోన్‌లో బెదిరింపులు తప్ప, తమను నమ్ముకొని వచ్చిన పసిపిల్లల ఫొటోలు ఉన్నాయని ఒప్ప్పుకోడానికి అభిజాత్యం అడ్డొచ్చివుంటుంది. సాధారణంగా గురజాడలో తమ పిల్లలను చేర్పిస్తున్నారంటే.. అందుకు కారణం స్వామినాయుడు దైవభక్తి, సమాజం పట్ల ఆయనకున్న కన్సర్న్. దీనికి తోడు పులఖండం శ్రీనివాసరావు ప్రిన్సిపాల్‌గా ఉన్నందున తమ పిల్లలు గాడి తప్పరనే నమ్మకం. ఇప్ప్పుడు స్వామినాయుడు ఈ వ్యవహారాలు చూస్తున్నట్టు లేరు. పులఖండం శ్రీనివాసరావు ఆకస్మికంగా మతిచెందారు. అంతమాత్రాన గురజాడ అడుగుజాడలు మారిపోవడం శోచనీయం.

గురజాడలో మార్ఫింగ్ వ్యవహారాన్ని ‘సత్యం’ వెలుగులోకి తీసుకురాకుంటే కాలేజీలో ఆందోళన చేసిన విద్యార్థినులను నయానో భయానో దారిలోకి తెచ్చి తొక్కిపెట్టాలని యాజమాన్యం ఆలోచించింది. కాలేజీలో జూనియర్, సీనియర్ డిగ్రీ విద్యార్ధినిలు కలిసి ఆందోళన చేయడం ప్రారంభం కావడంతో గురువారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ముందు సీనియర్ విద్యార్ధినిలందరికీ కాలేజీ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ ఇచ్చి భయపెట్టారని తెలిసింది. మార్ఫింగ్ వ్యవహారంపై కాలేజీలో ఏడు నెలలుగా రచ్చ సాగుతుందని భోగట్టా. కాలేజీ బయట ఈ వ్యవహారం జరిగిందని, దాంతో తమకు సంబంధం లేదన్న కోణంలోనే యాజమాన్యం నిన్నటి వరకు వ్యవహరించింది. వాస్తవానికి ఇది ఇంతకు ముందే క్యాంపస్‌లో బయటపడింది. స్వయంగా ప్రిన్సిపాలే ఎంతమంది ఫోటోలు మార్ఫింగ్ అయ్యాయి? ఎంత డేటా ఉందనేది ఓపెన్‌గానే క్యాంపస్‌లో బయటపెట్టారట. అప్ప్పుడు కూడా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్ ప్రస్టేజ్‌నే పరిగణలోకి తీసుకుంది తప్ప, విద్యార్థుల భవితవ్యం ఏమిటన్నది ఆలోచించలేదు.

వ్యవహారాన్ని చక్కదిద్దడానికి కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఐదుగురు విద్యార్ధులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపించినట్టు మీడియాకు వివరించారు. కానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం హర్షవర్థన్ అనే విద్యార్ధి మాత్రమే ఉన్నాడని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడితో కలిసి మద్యం సేవించినట్టు ఆధారాలు దొరకడంతో నలుగుర్ని కాలేజీ నుంచి పంపించినట్టు ప్రిన్సిపాల్ వివరించారు. నిందితుడు ఒక విద్యార్ధిని ఫోటోను మార్ఫింగ్ చేసి ఆ వీడియోను బాధితురాలికి చూపించి భయపెట్టడంతో ఆమె తన సోదరుడికి విషయం చెప్పిన తర్వాత తమ దష్టికి వచ్చినట్టు ప్రిన్సిపాల్ మీడియాతో చెప్పకొచ్చారు. సున్నితమైన అంశం కావడం, విద్యార్థినిలు భవిష్యత్తు, కాలేజీ ప్రతిష్ట భంగం కలగకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆలోచించామని తెలిపారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో వారి సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

కాలేజీలో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమానికి వచ్చిన విద్యార్థినులు ధరించిన దుస్తులపై ప్రిన్సిపాల్ కామెంట్ చేసినట్టు తెలిసింది. ఇలాంటి (లంగా, వోణీì) దుస్తులు ధరించడం వల్లనే ఘటనలు చోటుచేసుకున్నాయని కామెంట్ చేసినట్టు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంపైనా విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నెమోదు చేసి పోలీసులు ఇచ్చిన ఎఫఐఆర్ కాపీని చూపిస్తే తప్పా ఆందోళన విరమించమని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని గురువారం సాయంత్రం హెచ్చరించారు. అయితే కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై రూరల్ సీఐ మీడియాతో మాట్లాడుతూ ఒక్క విద్యార్థ్థిపైన మాత్రమే ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ముగ్గురు విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆశ్లీల వీడియోలు రూపొందించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. విద్యార్థినిలు, తల్లిదండ్రులు మాత్రం ప్రధాన నిందితుడైన విద్యార్థికి ఉత్తరాంధ్రలోని అనేక కాలేజీల్లో మార్ఫింగ్ వీడియోలు చేసి డేటాను విక్రయించే ముఠాలతో సంuంధం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మార్ఫింగ్ వీడియో కోసం నిందితుడి వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు మరిన్ని వీడియోలను గుర్తించడం వల్లనే ఇతర ప్రాంతాల్లో వ్యక్తులతో సంబంధం ఉందన్న విషయం బయటపడిందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్ఫింగ్ నిందితుడిపై ఏడు నెలలుగా ఆరోపణలు ఉన్నాయని గురువారం విద్యార్థినులు ఆందోళన చేస్తున్న సందర్భంగా కాలేజీ సిబ్బందే నోరు జారినట్టు చెబుతున్నారు. ఆ వ్యవహారం పదిరోజుల్లో సమసిపోతుందని, దీనిపై ఆందోళన అవసరం లేదని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరినా న్యాయం జరగదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే, కాలేజీలో నిందితుడికి ఎవరెవరు సహకరించారో వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రధాన నిందితుడితో పాటు ఒక సీనియర్ విద్యార్ధిని, నలుగురు జూనియర్ విద్యార్ధులు దోషులేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిని దోషిగా చూపి, మిగతా వారిని తప్పించే ప్రయత్నం యాజమాన్యం చేస్తుందని విద్యార్థినుల తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page