top of page

గల్ఫ్‌ ఆశలను కూల్చిన యుద్ధం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 27
  • 3 min read

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. అమెరికా`ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల పుట్టి ముంచింది. ప్రస్తుతం సీజ్‌ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ రెండో విడత చర్చలు మొదలుకాకుండానే వాయిదా పడిపోవడంతో ఏ క్షణంలోనైనా యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ఎడారి దేశాలు కట్టుకున్న ఆశల సౌధాలు దాదాపు కుప్పకూలిపోయాయి. మÖడు దశాబ్దాలకు పైగా ఇటుక ఇటుక పేర్చి ఇసుక నేలల్లో సృష్టించిన నందనవనాలు, టూరిజం ప్రాజెక్టులు, ఆకాశ హార్మ్యాలు, కాసుల వర్షం కురిపించే చమురు క్షేత్రాలు నేలమట్టమయ్యాయి. ఎవరో చేస్తున్న యుద్ధానికి గల్ఫ్ బలైపోతున్నది. అయితే దీనికి కారణం లేకపోలేదు. అగ్రరాజ్యం అమెరికాకు తమ భూభాగాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునిచ్చిన పాపమే గల్ఫ్‌ను ముంచేసింది. ఈ దేశాల ఆర్థిక మÖలాలు దెబ్బతిన్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయని, ఆ దేశానికి సహకరిస్తున్నాయన్న కారణంతో దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యÖఏఈ లాంటి దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఫలితంగా.. అమెరికాకు ఎంత నష్టం జరిగింది, ఎంత ఒత్తిడి పెరిగిందన్నది పక్కన పెడితే.. ఆయిల్ క్షేత్రాలు దెబ్బతిని, వ్యాపారాలు స్తంభించిపోయి గల్ఫ్ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. నలభై యాభై ఏళ్ల క్రితం మిడిల్ ఈస్ట్(మధ్య ప్రాచ్యం) లేదా గల్ఫ్ ప్రాంతం అత్యంత అస్థిరమైన ప్రాంతం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ ఆ తర్వాత బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, యÖఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు స్థిరత్వాన్ని తీసుకొచ్చాయ్. ఆయిల్ ఆదాయంతో ఆర్థిక సౌధాలు నిర్మించుకొచ్చాయి. ఫలితంగా ఆ దేశాలు ప్రపంచలోనే సంపన్న దేశాలుగా, చాలా ఆసియా దేశాల ప్రజలకు ఉపాధి కేంద్రాలుగా తులతూగుతున్నాయి. కానీ యుద్ధంతో పరిస్థితి తారుమారైంది. గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు.. వాటి ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో అరబ్ ఆ దేశాలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలు, భవిష్యత్ ప్రణాళికలు కకావికలమయ్యాయి. ఈ లోతైన గాయం మానడానికి ఎంత టైమ్ పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. పూర్తి ఆర్థిక సమృద్ధి సాధించిన ఈ దేశాలు ఇప్పుడిప్పుడే ఇతర రంగాలపై ఫోకస్ పెట్టాయి. చమురు వనరులను మాత్రమే నమ్ముకోకుండా బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌసింగ్, గోల్డ్ బిజినెస్, ఎయిర్‌పోర్టులు.. ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలనే పట్టుదలతో పనిచేస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్‌గా, సేఫ్ హెవెన్‌గా ఎదిగే దిశగా కృషి చేస్తున్నాయి. దాంతో గల్ఫ్ కంట్రీస్ అంటే ఆయిల్ మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే సేఫ్ హెవెన్‌గా, బిజినెస్ సెంటర్లుగా మారాయి. అయితే ప్రస్తుత యుద్ధంతో వాటన్నింటిపైనా గట్టి దెబ్బ పడింది. పోర్టులు, ఎయిర్‌పోర్టులపై దాడులు జరగడంతో.. విదేశీ ఇన్వెస్టర్లు, టూరిస్టులు గల్ఫ్ దేశాల వైపు చూసేందుకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలు, ఖతార్‌లోని గ్యాస్ ప్లాంట్లు కూడా ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడుల్లో నాశనమయ్యాయి. మళ్లీ వీటిని నిర్మించాలంటే బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చవుతుంది.. కొన్నేళ్లు పడుతుంది. కొన్నాళ్లుగా గల్ఫ్ దేశాలు విజన్ 2030 లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆయిల్‌పైనే ఆధారపడటం తగ్గించి.. టూరిజం, టెక్నాలజీ, వినోద రంగాల్లో ప్రపంచ కేంద్రాలుగా ఎదగాలని కోట్లాది డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ యుద్ధం వల్ల విదేశీ పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారు. యుద్ధం కారణంగా ధ్వంసమైన రోడ్లు, ఎనర్జీ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్ల పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. యుద్ధం వల్ల సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా ఆయుధాల కొనుగోలుకు మళ్లించాల్సి వస్తుంది. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో విదేశీ నిపుణుల పాత్ర చాలా కీలకం. కానీ యుద్ధం వల్ల అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు వెళ్లిపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదముంది. ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా గల్ఫ్ దేశాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. కూలిన భవనాలు తిరిగి నిర్మిస్తే సరిపోదు. ప్రపంచానికి మళ్లీ మిడిలఈస్ట్‌పై నమ్మకం కలగాలి.. భద్రతపై భరోసా లభించాలి. అది జరగడానికి కనీసం పదేళ్లైనా పడుతుంది. యుద్ధం వల్ల సరఫరా చెయిన్ దెబ్బతినడంతో నిత్యవసరాల ధరలు పెరిగి, సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల కోలుకోవడం మరింత ఆలస్యమవుతుంది. తమ ప్రాంతాన్ని న్యూ యÖరప్‌లా మార్చాలని గల్ఫ్ దేశాలు కలలు కన్నాయి. కానీ ఇప్పుడు ఆ విజన్ మసకబారినట్లే. నిధుల కొరత, భద్రతా కారణాలతో.. భారీ ప్రాజెక్టులు మందగించే అవకాశం ఉంది. యువతకు ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు యుద్ధం వల్ల మÖతపడటం, ప్రారంభం కాకపోవడం వల్ల భవిష్యత్ తరం తీవ్ర నిరాశలో మునిగిపోయే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా ఘర్షణల్లో మధ్యప్రాచ్య దేశాలు బాధితులుగా మిగిలిపోతున్నాయి. యుద్ధం ఆ దేశాల మధ్య జరిగినా, దాని ప్రభావం గల్ఫ్ ఆర్థిక మÖలాలను దెబ్బతీస్తోంది. ఈ దేశాలు మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే.. కేవలం శాంతి స్థాపన మాత్రమే కాదు, ఇంధన రంగంపై కాకుండా ఇతర రంగాలపై తమ ఆర్థిక వ్యవస్థను బలంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అరబ్ దేశాలు కోలుకోవడానికి శాంతి ఒప్పందాలు మాత్రమే సరిపోవు. వ్యవస్థాగతమైన మార్పులు, ప్రపంచ దేశాల సహకారం, భారీ స్థాయిలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు అవసరం. యుద్ధం వల్ల కలిగిన నష్టం ఆ ప్రాంతం ఆత్మవిశ్వాసంపై పడిన దెబ్బగా కనిపిస్తోంది. ఆ నమ్మకాన్ని మళ్లీ నిర్మించడమనేదే ఇప్పుడు పెను సవాల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం సంధికాలం కొనసాగుతున్నది. భవిష్యత్తు కూడా సందిగ్ధంగానే ఉన్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page