ఘట్టమనేని లెగసీ కొనసాగిస్తుందా..?
- Guest Writer
- 12 hours ago
- 3 min read

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. దాదాపు పాతికేళ్లుగా మహేష్ ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా తో ప్రభంజనానికి రెడీ అవుతున్నాడు. ఐతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ సిస్టర్ మంజుల తన నటనా ప్రతిభ కనబరచాలని అనుకుంది. కథానాయికగా కాకుండా షో సినిమాతో నటనతో పాటు నిర్మాతగా అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంజుల అలా తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే.
మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని హీరోయిన్ గా.. ఐతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతుంది. తెర మీద అభినయంతో మెప్పించడానికి అన్ని విధాలుగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది జాన్వి ఘట్టమనేని. యాక్టింగ్, డాన్స్, లుక్ ఇలా కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటుంది. ఎలాగు మదర్ మంజుల గైడన్స్, మేన మామ స్పూర్తి ఉంటుంది కాబట్టి జాన్వి చాలా ఫోకస్ గా ఉంటుందని చెప్పొచ్చు.
10 ఏళ్ల వయసులోనే జాన్వి మంజుల డైరెక్షన్ సినిమాలో తెరంగేట్రం చేసింది. ఐతే ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా మెప్పించాలని చూస్తుంది. ఇప్పటికే వాణిజ్య ప్రకటనలో జాన్వి తన సత్తా చాటుతుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆమెతో యాడ్స్ చేసేందుకు వస్తున్నారు. జాన్వి తెరంగేట్రం ఎప్పుడు.. ఎవరితో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక బడా ప్రాజెక్ట్ తో సూపర్ లాంచింగ్ ఆమెకు ఉండబోతుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న యాక్టర్.. ప్రస్తుతం ఆడియన్స్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేలా తన ఫోటోలతో టచ్ లో ఉంటుంది జాన్వి ఘట్టమనేని. జాన్వి ఫోటోస్ చూస్తుంటే స్టార్ హీరోయిన్ కటౌట్ అనేలా ఉన్నాయి. కచ్చితంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న యాక్టర్ కాబట్టి ఆమెకు మంచి పుష్ ఉంటుంది. ఎలాగు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కాస్త టాలెంట్ చూపిస్తే మాత్రం జాన్వి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి జాన్వి ఎంట్రీ ఎప్పుడు.. సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా ఉంది అన్నది త్వరలో తెలుస్తుంది.
కాస్త వెనక్కి వెళ్తే.. మంజుల ఘట్టమనేని కూడా యాక్టింగ్ మీద ఆసక్తితోనే ఆమె సినిమాల్లోకి వచ్చారు. ఐతే ఆమె కూడా హీరోయిన్ గా చేయాలని కలలు కన్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అందుకు అంగీకరించలేదు. అంతేకాదు ఫ్యాన్స్ నుంచి కూడా రిక్వెస్ట్ లు రావడంతో మంజుల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఐతే అప్పుడు తనకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు తన కూతురికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మంజుల.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
ఫ్యాన్స్ బాధ అర్థమవుతోందా రాజా!!

రవితేజ హిట్టు కొట్టి ఎన్నాళ్లయ్యిందో? ధమాకా మినహాయిస్తే అంతకు ముందు, ఆ తరవాత కూడా ఫ్లాపులే. హిట్టు కొట్టకపోవడం అటుంచితే చేసినవన్నీ రొడ్డ కొట్టుడు సినిమాలే. వైవిధ్యం లేక బాక్సాఫీసు దగ్గర డీలా పడినవి చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఓ స్థాయి వరకే హీరోని మోస్తారు. ఆ తరవాత.. ‘‘ఎందకన్నా ఇలాంటి సినిమాలు తీస్తావ్’’ అని నిలదీస్తారు. సోషల్ మీడియాలో రవితేజ ఫ్యాన్స్ పరిస్థితి ప్రస్తుతం ఇలానే వుంది. ‘‘సినిమాలు ఆపేయ్ అన్నా..’’ అంటూ మొహమాటం లేకుండా కామెంట్లు చేసేస్తున్నారు. రవితేజ ఆ స్థాయిలో చిరాకు పెట్టాడు.
తన విషయంలో ఫ్యాన్స్ పడుతున్న బాధ మాస్ రాజా రవితేజకూ అర్థమైంది. అందుకే ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మొన్నటి వరకూ మిమ్మల్ని కాస్త చిరాకు పెట్టాను. ఇక మీదట అలాంటిది జరగదు. ఇది నా ప్రామిస్.. అంటూ ప్రమాణం చేసేశాడు. దాంతో మాస్ జాతర ఏమైనా బాగుండొచ్చేమో అన్న నమ్మకం కలిగింది ఫ్యాన్స్‌కు. నిజానికి ఈ సినిమాపై కూడా అభిమానులకు ఎలాంటి భరోసా లేదు. టీజర్, ట్రైలర్ వాళ్లని మెప్పించలేకపోయాయి. పాటలూ అంతంత మాత్రమే. ‘ఇదీ పోయినట్టే’ అన్న ఫస్ట్రేషన్‌లో ఉన్నారు అభిమానులు. రవితేజ చేసిన ప్రామిస్ తో వాళ్లు కాస్త తెరిపిన పడ్డారు. రవితేజ నుంచి అభిమానులు కొత్తగా కోరుకొనేది ఏమీ ఉండదు. ఆ అల్లరి, ఉత్సాహం తెరపై కనిపిస్తే చాలు. ఖుషీ అయిపోతారు. సరైన కథల్ని, తన ఎనర్జీని పర్‌ఫెక్ట్ గా తెరపైకి తీసుకొచ్చే దర్శకుడ్ని ఎంచుకొంటే రవితేజ హిట్టు బాట పట్టినట్టే. ‘మాస్ జాతర’తో అలాంటి విజయం లభిస్తుందేమో చూడాలి.
పిచ్చ క్లారిటీతో ఉన్న శ్రీలీల!!

టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కథానాయికల్లో శ్రీలీల పేరు తప్పకుండా చెప్పుకోవాల్సిందే. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయింది. వరుస ఆఫర్లు, భారీ ప్రాజెక్టులతో దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసేసింది. కాకపోతే.. అందులో హిట్లు తక్కువ. రొటీన్ పాత్రలు చేస్తోంది, మరీ పాటలకే పరిమితం అవుతోందన్న విమర్శల్ని గట్టిగా ఎదుర్కొంది. అన్నీ ఇలాంటి సినిమాలే చేసుకొంటూ పోతే, తన ఇమేజ్ దెబ్బ తింటుందని, తిరోగమనం తప్పదని సినీ పండితులు హెచ్చరించారు. కాకపోతే శ్రీలీల మాత్రం ఈ విషయంలో పిచ్చ క్లారిటీతో వుంది.
ప్రారంభంలో తనకు సినిమాల్ని ఎంచుకోవడం తెలిసేది కాదని, వచ్చిన ప్రతీ సినిమానీ ఒప్పుకొన్నానని చెప్పుకొచ్చింది శ్రీలీల. అయితే తన ఎంపిక పట్ల తనలో ఎలాంటి అసంతృప్తీ లేదంటోంది. ’’నా నుంచి అభిమానులు కొన్ని ఆశిస్తారు. అలాంటివన్నీ ఇస్తూనే నాకు నేను కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికిప్పుడు నా ఇమేజ్ మార్చుకోవాలని ఏం అనుకోవడం లేదు. కనీసం ఓ వర్గానికైనా నా పనితనం నచ్చుతుంది. అది నాకు సరిపోతుంది’’ అంటోంది.
రొటీన్ పాత్రలు వస్తున్నాయన్న మాట శ్రీలీల కూడా ఒప్పుకొంది. సినిమా కోసం, అందులోని పాత్ర కోసం శ్రీలీల హార్డ్ వర్క్ చేసి, మేకొవర్ మార్చుకొన్న సందర్భాలు కూడా లేవు. ఆ అవసరం కూడా రాలేదు. ఓవైపు చదువుకొంటూనే, మరోవైపు సినిమాలు చేయాలన్నది శ్రీలీల నిర్ణయం. రెండిరటికీ టైమ్ కేటాయించాలంటే, కమర్షియల్ సినిమాలే నయం. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. సెట్లో కూర్చుని చదువుకొన్న సందర్భాలూ ఉన్నాయి. కేవలం పాత్రపైనే ఫోకస్ చేయాలి, ముందస్తు ప్రిపరేషన్ తీసుకొనే సెట్ కి వెళ్లాలి అనుకొంటే.. తను పూర్తిగా చదువుని పక్కన పెట్టాలి. అందుకే శ్రీలీల అంత రిస్క్ తీసుకోలేదు.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments