top of page

చిరు-158 కొంచెం లేటు!

  • Guest Writer
  • Jan 7
  • 2 min read

సినిమా సినిమాకీ కాస్త గ్యాప్‌ ఇచ్చే అలవాటు మానుకొంటున్నారు అగ్రహీరోలు. వీలైతే ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించడానికైనా సిద్ధమే. 2026లో మెగాస్టార్‌ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ వచ్చేస్తోంది. వేసవికి ‘విశ్వంభర’ సిద్ధం అవుతోంది. మరోవైపు కొత్త సినిమా కూడా మొదలెట్టేస్తున్నారు. ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సంక్రాంతి తర్వాత ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిద్దాం అనుకొన్నారు. 18న పూజా కార్యక్రమాలు చేసి, ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుపెడదామని ప్లాన్‌ చేశారు.

అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్‌ కాస్త మారింది. ఈ నెలలో చిరు కొత్త సినిమా మొదలవ్వడం లేదు. ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యే ఛాన్సుంది. చిరంజీవి ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకొన్నారు. దాంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిరది. అందుకే షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మరో అగ్ర కథనాయకుడు కూడా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పరభాషా నటుడే.. చిరుతో స్క్రీన్‌ పంచుకొంటారని టాక్‌. ఆ హీరో ఎవరో ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. చిరు - బాబీ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. దాంతో ఈ కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...



పవన్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌.. సీక్రెట్‌ ఏంటి?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటేనే ఒక ట్రెండ్‌ సెట్టర్‌. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ‘పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ ద్వారా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్‌ అప్డేట్స్‌ ఇస్తుంటారు. లేటెస్ట్‌గా ఈ బ్యానర్‌ నుంచి ఒక కాన్సెప్ట్‌ వీడియో రిలీజ్‌ అయ్యింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్‌గా వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.?ఈ వీడియో మొత్తం జపనీస్‌ కల్చర్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ థీమ్‌తో డిజైన్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ కు మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఆయన ౖరీర్‌ బిగినింగ్‌లో ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ లాంటి సినిమాల్లో తన మార్షల్‌ ఆర్ట్స్‌ స్కిల్స్‌ను అద్భుతంగా చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే స్టైల్‌లో, జపనీస్‌ కత్తి, మార్షల్‌ ఆర్ట్స్‌ సర్టిఫికేట్‌, బ్లాక్‌ బెల్ట్‌ లాంటి ఎలిమెంట్స్‌ తో ఈ వీడియోను కట్‌ చేయడం ఆసక్తిని రౖేత్తిస్తోంది.

ముఖ్యంగా వీడియో చివర్లో పవన్‌కళ్యాణ్‌ గాల్లోకి ఎగిరి కిక్‌ ఇస్తున్న పాత స్టిల్‌ను వాడటం ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఇది చూస్తుంటే పవన్‌కళ్యాణ్‌ తన బ్యానర్‌లో ఏదో ఒక భారీ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ప్లాన్‌ చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. లేకపోతే ఇది కేవలం బ్యానర్‌ రీ లాంచ్‌ వీడియోనా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ విజువల్స్‌ మాత్రం చాలా ఇంటెన్స్‌ గా, ఒక పర్ఫెక్ట్‌ యాక్షన్‌ మూడ్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి.

గతేడాది ‘ఓజీ’తో గ్యాంగ్‌స్టర్‌గా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన పవన్‌, ఇప్పుడు మళ్ళీ మార్షల్‌ ఆర్ట్స్‌ వైపు మొగ్గు చూపడం విశేషం. 2025లో ఓజీ’ సృష్టించిన రికార్డులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌ వీడియోతో ఆయన నెక్స్ట్‌ లెవెల్‌ ప్లానింగ్‌లో ఉన్నారని అర్థమవుతోంది. ఇది సినిమానా, వెబ్‌ సిరీసా లేక మరేదైనా డాక్యుమెంటరీనా అనేది తెలియాల్సి ఉంది.?పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, సినిమా రంగాన్ని పూర్తిగా వదలలేదు. ఒక పక్క ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాను 2026 సమ్మర్‌ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మరోపక్క తన బ్యానర్‌ ద్వారా ఇలాంటి క్రియేటివ్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ వీడియో ద్వారా ఆయన తన పాత రోజులను, ఆ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్యాషన్‌ను మరోసారి గుర్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ సర్‌ ప్రైజ్‌ వీడియోతో పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై అందరి దృష్టి పడిరది. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్‌ నుంచి ఇంకెన్ని అద్భుతాలు రాబోతున్నాయో అని ఫ్యాన్స్‌ ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్నారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page