top of page

జిల్లా పేకాట.. సుంకి బాట!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 days ago
  • 2 min read
  • దాడులకు గురవుతున్నా వెరవని జూదరులు

  • అలమండ డెన్‌లో గొడవలు, దాడులు, హత్యతో కలకలం

  • పర్లాకిమిడి, రాయగడ సరిహద్దుల నుంచి షిఫ్ట్

  • అద్దె కార్లు పెట్టి మరీ జిల్లా నుంచి తరలింపు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పేకాడకుండా వీరు ఉండలేరో లేక పేకాట శిబిరం నిర్వహించకుండా వారు ఉండలేకపోతున్నారో తెలియదుగానీ రాయగడ దగ్గర రౌడీషీటర్లు రావడం, దోచుకోవడం, ఆ తర్వాత పంచాయితీ, మర్డర్ వంటి విపరిణామాలు జరిగిన తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా జూదగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఒడిశా బోర్డర్‌కు వెళ్లి చతుర్ముఖ పారాయణం చేయడం మానలేదు. తాజాగా భారీ బందోబస్తు మధ్య పార్వతీపురం మన్యం జిల్లా ఆవల ఉన్న ఒడిశాలోని సుంకిలో సోమవారం పేకాట శిబిరం నిర్వహించారు. విచిత్రమేమిటంటే.. సుదూరంగా ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఎప్పటిలాగే చెయ్యిదురద ఉన్న పేకాటరాయుళ్లు హాజరయ్యారు. ఎవరొచ్చినా ఎదుర్కోడానికి వీలుగా అన్నిరకాల బందోబస్తు ఏర్పాటు చేశామని, రాయగడ సమీపంలోని అలమండ శిబిరంలో బంగారం పోగొట్టుకున్నవారికి మళ్లీ దాన్ని వెనక్కు ఇప్పించామంటే తమ సత్తా ఏమిటో ఈపాటికే తెలిసుండాలని, లేదంటే పేపర్లు చదవండంటూ ఓ సందేశం పంపి మరీ జూదగాళ్లను రప్పించి సుంకిలో పెద్ద ఎత్తున సోమవారం పేకాట శిబిరం నిర్వహించినట్లు తెలిసింది.

శిబిరాలకు ప్రైవేట్ బందోబస్తు

శ్రీకాకుళం జిల్లాలో పేకాట జరగకుండా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఉక్కుపాదం మోపడంతో గత కొన్నాళ్లుగా శిబిరాలన్నీ ఒడిశా బోర్డర్‌కు షిప్ట్ అయ్యాయి. కొన్నాళ్ల క్రితం పర్లాకిమిడిలో స్థానికులు ఓ శిబిరంపై దాడి చేసి సొమ్ములెత్తుకుపోయారు. శుక్రవారం ఏకంగా తుపాకులతో వచ్చి నగదు, బంగారం పట్టుకుపోయారు. దీంతో రాయగడ, పర్లాకిమిడి ప్రాంతాలు సేఫ్ కాదని ప్రచారం చేసిన నిర్వాహకులు గతంలో మాదిరిగానే మళ్లీ తమ డెన్‌ను సుంకికి మార్చారు. అయితే పేకాడేవారి వద్ద దగ్గర భారీగా డబ్బు ఉంటుందని, పేకాటలో డబ్బు కోల్పోతే కదువ పెట్టుకోడానికి బంగారం కూడా ఒంటిపై ఉంటుందని తెలిసిపోయిన తర్వాత ఇక దాడులు షరామామÖలేనని భావించిన నిర్వాహకులు ఇందుకోసం ఏకంగా బందోబస్తు బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని, దానికి అక్కడి పోలీసుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శిబిరం నడుస్తున్న సుంకి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు 23 కిలోమీటర్లు దూరంలో ఉంది. శిబిరాన్ని విశాఖ, విజయనగరానికి చెందినవారు నిర్వహించారు. ఇక్కడి నుంచి జూదరులు వచ్చేందుకు వీలుగా ఆంధ్రాలోని పాచిపెంట చెక్‌పోస్టు మీదుగా సుంకికి రూట్‌మ్యాప్ ఇస్తున్నట్టు భోగట్టా. ఒడిశాలోని గారబంద, రాణిపేట, విజయనగరం జిల్లా అలమండల్లో పేకాట శిబిరాలు మÖతపడడంతో జిల్లాకు చెందిన జూదరులు సుంకికి క్యూ కట్టారు. జిల్లా నుంచి నాలుగు కార్లలో వారు వెళ్లినట్టు తెలిసింది. అలమండలో దెబ్బలు తిన్నవారూ సుంకిలో పేకాడటానికి వెళ్లడం గమనార్హం. వాస్తవానికి అలమండ ఘటన తర్వాత ఒడిశాకు చెందినవారు ఆంధ్రా నుంచి వచ్చే జూదరులకు ఫోన్ చేసి వారం రోజుల వరకు ఒడిశా వైపు రావద్దని సూచించినట్టు తెలిసింది. అలమండలో పేకాట గొడవ నేపథ్యంలో రాయగడలో హత్య జరగడంతో కొరాపుట్ జిల్లా సరిహద్దులో పరిస్థితి సజావుగా లేదని, వ్యవహారం చక్కబడేంతవరకూ పేకాట శిబిరాలకు రావద్దని, నిర్వాహకులకు ఫోన్లు కూడా చేయవద్దని ఒడిశాలో పేకాట శిబిరాలకు రక్షణ కవచంగా నిలిచే వ్యక్తులు ఆంధ్ర జూదరులకు సూచించినట్టు తెలిసింది.

ట్రావెల్స్ నిర్వాహకులకు లింకు

సుంకిలో పేకాట శిబిరాన్ని విజయనగరానికి చెందిన పైడప్పడు, కేబుల్ శ్రీను, క్యాబ్ శ్రీను, బుగత నిర్వహించారని తెలిసింది. వీరిని విశాఖకు చెందిన వర్మ అనే వ్యక్తి వెనకుండి నడిపిస్తున్నాడని చెప్ప్పుకొంటున్నారు. ఈ శిబిరానికి నరసన్నపేట, శ్రీకాకుళంతో పాటు రాజాంకు చెందిన జూదరులు కార్లలో వెళ్లి వస్తుంటారు. ఈ కార్లకు నిర్వాహకులే ఏ రోజుకారోజే అద్దె చెల్లిస్తుండడంతో నగరంలో కొందరు ట్రావెల్స్ యజమానులు తమ కార్లను అద్దెకు ఇవ్వడానికి పోటీపడుతున్న పరిస్థితి ఉంది. కారు డ్రైవర్లే పేకాట శిబిరం నిర్వహకులకు ఏజెంట్లుగా వ్యవారించాల్సి ఉంటుంది. కారు ఏ ప్రాంతం నుంచి బయలుదేరుతుంది? ఎవరెవరిని పికప్ చేసుకోవాలో కారు డ్రైవరే చూసుకోవాలి. సామర్ధ్యానికి మించి వ్యక్తులు వస్తే నిర్వాహకులకు సమాచారం ఇచ్చి మరో వాహనాన్ని అద్దెకు ఏర్పాటు చేయించాలి. కారు సిద్ధం చేసిన తర్వాత జూదరులకు ఫోన్ చేసి ఫలానా పాయింట్లో కారు పార్కింగ్ చేసి ఉందని, సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా కారు డ్రైవర్‌దే. అలమండలో రెండు రోజుల క్రితం జరిగిన పేకాట శిబిరంపై రౌడిమÖకలు చేసిన దాడిలో నగరానికి చెందిన కారు డ్రైవర్ కం యజమాని నాని తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. గతంలో పాతపట్నం, ఇచ్ఛాపురం చెక్‌పోస్టుల వద్ద జిల్లా పోలీసులకు చిక్కడంతో కారు సీజ్ చేసిన ఘటనలు ఉన్నాయి. పేకాట శిబిరాలకు వెళుతూ రోడ్డు ప్రమాదాలకు గురవడం.. గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన సందర్భాÛలు ఉన్నాయి. అయినా పేకాట శిబిరాలకు వాహనాలను అద్దెకు ఇవ్వడం మానుకోలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page