top of page

టైటిల్స్‌ ఎప్పుడు చెబుతారు సార్‌..!

  • Guest Writer
  • Oct 10
  • 2 min read
ree

ఓ సినిమా జనంలోకి వెళ్లాలంటే ఓ మంచి టైటిల్‌ కావాల్సిందే. స్టార్‌ హీరోల సినిమాలకు టైటిల్స్‌ చాలా చాలా ముఖ్యం అయిపోయాయి. పైగా ఇప్పుడు పాన్‌ ఇండియా టైటిల్స్‌ పెట్టాలన్న కండీషన్‌ ఒకటి వుంది. ఒకే టైటిల్‌ తో దేశమంతా తమ సినిమా చాలామణీ అయిపోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ లో రూపుదిద్దుకొన్న చాలా సినిమాలకు టైటిల్స్‌ లేవు. ఎలాంటి టైటిల్‌ పెట్టాలా? అనే ఆలోచనలతో సతమతమవుతున్నాయి చిత్రబృందాలు. కొన్ని సినిమాలకు పేర్లు చెప్పకపోయినా.. ఏదోలా లీక్‌ అయిపోతున్నాయి.

మహేష్‌ బాబు - రాజమౌళి సినిమాకు టైటిల్‌ ఏమిటన్నది ఇప్పటి వరకూ తెలియలేదు. ‘వారణాసి’ అనే టైటిల్‌ పెట్టారని ఓ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. వారణాసి నేపథ్యంలో జరిగే కథ ఇది. అందుకే ఆ టైటిల్‌ పెట్టారన్నది ఓ ప్రచారం. కానీ.. రాజమౌళి టైటిల్‌ మరీ ఇంత సాఫ్ట్‌ గా ఉంటుందా? అనేది అనుమానమే. ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ సినిమా ‘డ్రాగన్‌’ అనే పేరుతోనే చలామణీ అవుతోంది. చిత్రబృందం అయితే ఇంకా ఖరారు చేయలేదు. ఈ టైటిల్‌ పాన్‌ ఇండియా రిలీజ్‌ కు యాప్ట్‌ గా ఉంది. పైగా పవర్‌ఫుల్‌ గానూ ఉంది. కాబట్టి ఇదే ఖాయం చేసే అవకాశం ఉంది. ప్రభాస్‌ - హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ‘ఫౌజీ’ అనేది ప్రచారంలో ఉన్న టైటిల్‌. చిత్రబృందం దీన్ని ఖండిరచడం లేదు. ఫ్యాన్స్‌ కూడా బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి.. ఇదే టైటిల్‌ ఖాయం అనుకోవొచ్చు. ‘డ్రాగన్‌’, ‘ఫౌజీ’ లాంటి పేర్లు బయటకు వచ్చేశాక కూడా చిత్రబృందాలు ఎందుకు ప్రకటించడం లేదో అర్థం కావడం లేదు. ప్రభాస్‌ %-% ప్రశాంత్‌ వర్మ కాంబోలో ఓ చిత్రం మొదలు కానుంది. దీనికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ పెట్టారని టాక్‌. కానీ ప్రశాంత్‌ వర్మ మాత్రం ఈ విషయమై ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు. ఈసినిమాకు చాలా సమయం ఉంది కాబట్టి, టైటిల్‌ విషయంలో అంత ఒత్తిడి లేదు.

వెంకటేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. టైటిల్‌ ఇంకా బయటకు రాలేదు. ‘అబ్బాయిగారు సిక్ట్సీ ప్లస్‌’ అనే సరదా టైటిల్‌ ప్రచారంలో ఉంది. దాంతో పాటు ‘ఆనంద నిలయం’ అనే ఫ్యామిలీ టచ్‌ ఉన్న టైటిల్‌ కూడా అనుకొంటున్నారు. త్రివిక్రమ్‌ కు ‘అ’ సెంటిమెంట్‌ ఉంది కాబట్టి రెండోదే ఖాయం అయ్యే సూచనలు ఉన్నాయి. కింగ్‌ 100వ సినిమాకు ఇటీవలే క్లాప్‌ కొట్టారు. దీనికి ‘లాటరీ కింగ్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. నాగార్జునని ఫ్యాన్స్‌ ‘కింగ్‌’ అని పిలుస్తుంటారు. కాబట్టి ఈ టైటిల్‌ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. రవితేజ %-% కిషోర్‌ తిరుమల ప్రాజెక్ట్‌ ఈ సంక్రాంతికి రానుంది. కానీ టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. ముందు ‘అనార్కలి’ అన్నారు. ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ బయటకు వచ్చింది. రెండోదే కాస్త ఫన్నీగా అనిపిస్తోంది. పూరి జగన్నాథ్‌-విజయ్‌ సేతుపతి సినిమాకు సైతం టైటిల్‌ లేదు. గతవారమే ఈ సినిమా టైటిల్‌ ప్రకటించాలి. కానీ కుదర్లేదు. దీపావళికి ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఈసారి ‘స్లమ్‌ డాగ్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారని టాక్‌.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..

థాంక్యూ శేష్‌!
ree

డిసెంబరు 25న డెకాయిట్‌ రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడిరది. ఈ విషయాన్ని రెండు నెలల ముందే ప్రకటించేశాడు శేష్‌. దాంతో డిసెంబరు 25న రావడానికి మిగిలిన సినిమాలకు కాస్త సమయాన్ని ఇవ్వగలిగాడు. ఎందుకంటే డిసెంబరు 25 మంచి డేట్‌. క్రిస్మస్‌ సెలవలు కలిసొస్తాయి. ఇలాంటి డేట్‌ ని నిర్మాతలు మిస్‌ చేసుకోరు. డెకాయిట్‌ ఎప్పుడైతే వాయిదా పడిరదో అప్పుడు ‘చాంపియన్‌’ సినిమాకు దారి దొరికినట్టైంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, స్వప్న సినిమాస్‌ రూపొందించిన ప్రాజెక్ట్‌ ఇది. డిసెంబరు 25న వస్తోంది. దాంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘టైసన్‌ నాయుడు’ చిత్రాన్నీ డిసెంబరు 25నే విడుదల చేయాలని భావిస్తున్నారు. వీటితోపాటు మరో రెండు సినిమాలు సైతం, ఈ సీజన్‌లో రావడానికి రెడీ అవుతున్నాయి.

ఈరోజుల్లో సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం కామన్‌. కాకపోతే.. ‘వాయిదా’ అనే విషయాన్ని ఆయా నిర్మాతలు, హీరోలు చాలా లేట్‌ గా చెబుతున్నారు. ఒక వారం ముందో, రెండు రోజుల ముందో ‘మేం అనుకొన్న సమయానికి రాలేకపోతున్నాం’ అని ఓ పోస్టరో, ట్వీటో వదులుతున్నారు. దాని వల్ల.. ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఆ స్లాట్‌ అలా ఖాళీగా ఉండిపోతోంది. మిగిలిన సినిమాలు రెడీ అయ్యే సమయం దక్కడం లేదు. కానీ శేష్‌ మాత్రం రెండు నెలల ముందే%ౌ% తన స్లాట్‌ ఖాళీగా ఉందని చెప్పేసుకొన్నాడు. దాంతో మిగిలిన సినిమాలు ఆ డేట్‌ ని క్యాష్‌ చేసుకోవడానికి తగిన సమయం దొరికినట్టైంది. మిగిలిన హీరోలు, నిర్మాతలూ రిలీజ్‌ డేట్‌ విషయంలో మిగిలిన నిర్మాతలకు ఇలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page