top of page

టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పినట్టేనా..?

  • Guest Writer
  • Aug 12, 2025
  • 2 min read

కమల్‌ హాసన్‌ గారాల పట్టి శృతి హాసన్‌ టాలీవుడ్‌ కి దాదాపు గుడ్‌ బై చెప్పినట్టే అనిపిస్తుంది. ఆమె వ్యవహార శైలి చూస్తే అది నిజం అనేలా ఉంది. ఎందుకంటే అమ్మడు తెలుగులో సినిమాలు చేయాలన్న ఆసక్తి చూపించట్లేదు. ఒకటి అర సినిమాలు చేసినా వాటి మీద అంత ఆసక్తి చూపించట్లేదట. అడివి శేష్‌ తో డెకాయిట్‌ సినిమా ముందు శృతి హాసన్‌ తోనే చేయాలని అనుకున్నారు. ఆమెతో టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ ఏమైందో ఏమో సడెన్‌గా శృతి హాసన్‌ ప్లేస్‌లో మృణాల్‌ ఠాకూర్‌ వచ్చింది.

కెరీర్‌ పీక్స్‌ లో ఉన్న టైంలో కూడా..

టాలీవుడ్‌ లో శృతికి వచ్చేదే అర కొర అవకాశాలు వాటిని కూడా అమ్మడు చేజార్చుకుంటుంది. దీని వెనక రీజన్స్‌ ఏమై ఉండొచ్చు అని ఆడియన్స్‌ డిస్కషన్‌ చేస్తున్నారు. ఇప్పుడే కాదు కెరీర్‌ పీక్స్‌ లో ఉన్న టైంలో కూడా శృతి హాసన్‌ తెలుగు దర్శక నిర్మాతలను కాస్త ఇబ్బంది పెట్టేదని టాక్‌ ఉంది. సినిమా కమిట్‌ అవ్వడం వరకు ఓకే ఆ తర్వాత అమ్మడు డేట్స్‌ విషయంలో ఇబ్బందులు పెడుతుందని ఇన్నర్‌ టాక్‌. అందుకే అంతకుముందు కూడా శృతి హాసన్‌ చేయాల్సిన కొన్ని సినిమాలు వేరే హీరోయిన్స్‌ ని పెట్టి చేశారు.

అడివి శేష్‌ డెకాయిట్‌ సినిమాలో శృతి హాసన్‌ ఉంటే బాగుండేదని అనుకున్నారు. కానీ ఆమెకు ఛాన్స్‌ లేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే శృతి హాసన్‌ తెలుగు సినిమాలను దాదాపు దూరం పెట్టినట్టే ఉంది. ప్రభాస్‌ తో సలార్‌ లో నటించిన శృతి హాసన్‌ ఆ సినిమా సెకండ్‌ పార్ట్‌ లో కూడా నటించాల్సి ఉంది. అది ఎలాగు కమిట్‌ అయ్యింది కాబట్టి తప్పదు. కానీ ఇక మీదట తన పూర్తి ఫోకస్‌ అంతా కూడా కోలీవుడ్‌ మీదే పెట్టాలని చూస్తుంది అమ్మడు.

శృతి హాసన్‌ పర్సనల్‌ గా కూడా లైఫ్‌ ని సూపర్‌ గా ఎంజాయ్‌ చేస్తుంది. ఏ విషయం గురించి పెద్దగా సీరియస్‌ గా తీసుకోదు అమ్మడు. ఐతే సౌత్‌ లో క్రేజీ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్‌ కెరీర్‌ లో మొదటి హిట్‌ కొట్టింది మాత్రమే తెలుగు సినిమాతోనే. అది కూడా పవర్‌ స్టార్‌ తో చేసిన గబ్బర్‌ సింగ్‌ సినిమాతోనే ఆమె సూపర్‌ హిట్‌ అందుకున్నారు. అప్పటి నుంచి శృతి హాసన్‌ ఇక తిరిగి చూసుకోలేదు. ప్రజెంట్‌ శృతి హాసన్‌ సూపర్‌ స్టార్ర్‌ రజినీకాంత్‌ కూలీ సినిమాలో నటించింది. మరో రెండు రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న కూలీ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది శృతి హాసన్‌. ఈ మూవీ మీద శృతిహాసన్‌ చాలా హోప్స్‌ పెట్టుకుంది. మరి అమ్మడి పెట్టుకున్న ఈ హోప్స్‌ ఎంతవరకు నిజం అవుతానన్నది చూడాలి.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

రీఎంట్రీ సరే గానీ.. కుర్ర వేషాలొద్దు నవీనూ..!

నిన్న ఈటీవీ ప్లస్‌లో రాత్రి చాలా బాగుంది అనే సినిమా వస్తోంది. వడ్డే నవీన్‌, శ్రీకాంత్‌ నటించారు. మాళవిక హీరోయిన్‌.. ఈవీవీ సినిమా.. పెద్దగా కథ అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా సినిమాలో ఎల్బీ శ్రీరాం పోషించిన గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర హైలైట్‌.. ఆ పాత్ర సంభాషణలు కూడా చాలా డిఫరెంట్‌..!

వడ్డే నవీన్‌ను చూస్తుంటే అనిపించింది. మాంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా సరే అది ఎంట్రీ వరకే తప్ప నిలదొక్కుకోవడానికి పనికిరాదు కదా అని..! తండ్రి వడ్డే రమేష్‌ నిర్మాత.. 1996 నుంచీ నవీన్‌ ఫీల్డులో ఉన్నాడు. కిందామీదా పడీపడీ 2006 దాకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు గానీ సక్సెస్‌ తన దరిదాపుల్లోకి కూడా రాలేదు.

పెళ్లి అనే ఒక్క సినిమా మాత్రం కాస్త పర్లేదు అనుకుంటా..! అదీ సుజాత, పృథ్విరాజ్‌ పోషించిన పాత్రలు, ఆ కథ, కొంతవరకూ కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ వల్లే..! 2006 తరువాత ఒకటీరెండు చిన్న చిన్న పాత్రలు వేశాడు. ఒకటోరెండో సినిమాల్ని తనే నిర్మించాడు. 2016లో ఎటాక్‌ అనే సినిమా.. అంతే ఇక..తను పూర్తిగా తెరమరుగే అనుకున్నారందరూ.. తాజాగా మళ్లీ తను హీరోగా, తనే ఓ సినిమా నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

చాలామంది కొత్తవాళ్లు, యువ హీరోలు వస్తున్నారు.. సినిమా నవీన్‌ను దాటేసి చాలా ముందుకు పోయింది. ఫస్ట్‌ ఇన్నింగ్సే ఒడిదొడుకులు.. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జనం యాక్సెప్టెన్స్‌ ఏమేరకు లభిస్తుందో చూడాల్సిందే..

ఎందుకంటే..? తన ఫేస్‌ కట్‌ మారిపోయింది. మరీ ఇప్పటి హీరోల టైపు మాస్‌ పాత్రలు, రొటీన్‌ కథలు గాకుండా, తనకు సూటయ్యే ఏదైనా లీడ్‌ రోల్‌ చేస్తే బెటర్‌.. అబ్బే, 60, 70 లు దాటినా సరే, అంతటి సీనియర్లు కుర్రవేషాలు వేస్తే చూడటం లేదా అంటారా..?

వాళ్లు వేరు.. వాళ్ల ఇమేజ్‌ వేరు.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరు.. వాళ్ల సినిమా కెరీర్‌లో గ్యాప్‌ లేదు. కంటిన్యూటీ ఉంది.. కానీ వడ్డే నవీన్‌ ఎవరో ఈ తరానికి అసలు తెలియదు. అంత గ్యాప్‌ వచ్చింది, దాదాపు పదేళ్లు.. అందుకే ఆడియెన్స్‌ యాక్సెప్టెన్సీ డౌట్‌ఫుల్‌..

అన్నట్టు.. నవీన్‌ నందమూరి ఇంటల్లుడు. ఎన్టీయార్‌ కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత శృతి కుదరలేదు, విడాకులు తీసుకున్నారు. ఆ విడాకుల తరువాతే ఇండస్ట్రీలో తనను పట్టించుకునేవాళ్లు లేక, అవకాశాల్లేక తెరమరుగు అయ్యాడంటారు మరి..!

- ముచ్చట సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page