top of page

టాలీవుడ్‌ ప్యూచర్‌ వీళ్లేనా?

  • Guest Writer
  • Nov 18, 2025
  • 2 min read

ఎంతమంది భామలు దిగుమతి అయినా? టాలీవుడ్‌ లో నిత్యం హీరోయిన్ల కొరత ఉండనే ఉంటుంది. దీంతో మేకర్స్‌ కు మరో ఆప్షన్‌ లేక పని చేసిన హీరోయిన్లతోనే పదే పదే పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. త్రిష, నయనతార, తమన్నా లాంటి వారు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారంటే కారణం ఆ రకమైన పరిస్థితే. అలాగే హిట్‌ ఆధారంగానూ చాలా మంది భామల్ని రిపీట్‌ చేయాల్సి వస్తోంది. నటీమణుల విషయంలో ఇలా రిపీట్‌ అయితే ప్రేక్షకులకు బోర్‌ ఫీల్‌ కాక తప్పదు. కొత్త భామల్ని తీసుకుంటే కలిసొస్తుందో? లేదో? అన్న భయంతోనూ కొంత మంది మేకర్స్‌ దైర్యం చేయలేరు.

తాజాగా లైన్‌ లో ఉన్న కొంత మంది భామలు సక్సెస్‌ అయితే గనుక కొంత వరకూ హీరోయిన్ల కొరత తగ్గుతుంది. రుక్మిణీ వసంత్‌, భాగ్య శ్రీ బోర్సే, ఇమ్మాన్వీ, ఆషీకా రంగనాధ్‌ లాంటి అందగత్తెలు సక్సెస్‌ అయితే హీరోలు సహా ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీల్‌ కలుగుతుంది. ‘కాంతార చాప్టర్‌ వన్‌’తో రుక్మిణీ వసంత్‌ ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడు కిట్టీలో ప్రెస్టీజీయస్‌ ప్రాజెక్ట్‌లు కొన్ని ఉన్నాయి. ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్‌’ చేస్తోంది. అలాగే ‘టాక్సిక్‌’ లోనూ యశ్‌తో రొమాన్స్‌ చేస్తోంది. ఈ రెండు గాక మణిరత్నం సినిమాలోనూ ఛాన్స్‌ అందుకుంది.

ఈ సినిమాలతో ఈ భామ సక్సెస్‌ అయితే గనుక టాలీవుడ్‌ హీరోలకు కొంత కాలం తిరుగుండదు. సీనియర్‌ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకూ అమ్మడు పర్పెక్ట్‌ ఛాయిస్‌ అవుతుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఆహార్యం అమ్మడి సొంతం. ముంబై బ్యూటీ భాగ్యశ్రీ అందగత్తె అయినా? సక్సెస్‌ కోసం పోరాటం చేస్తుంది. ఎలాంటి ఐడెంటిటీ లేకపోయినా? అవకాశాలు బాగానే అందుకుంటుంది. కానీ విజయం మాత్రం చెంత చేరడం లేదు. ప్రస్తుతం లైన్‌ లో ఉన్న చిత్రం ‘ఆంధ్రాకింగ్‌ తాలూకా’. ఈసినిమాతో సక్సెస్‌ అందుకుంటే? భాగ్యకు కొంతకాలం వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు.

గత పరాజయాలన్ని సక్సెస్‌ వేవ్‌లో కొట్టుకుపోతాయి. అలాగే ‘పౌజీ’ సినిమాతో పాకిస్తాన్‌ బ్యూటీ ఇమ్మాన్వీ ఇస్మైల్‌ పరిచయమవుతోంది. తొలి సినిమాలోనే ప్రభాస్‌తో రొమాన్స్‌ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ కు ముందే అమ్మడు కొత్త ప్రాజెక్ట్‌ లకు సంతకం చేస్తోంది అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇక సక్సెస్‌ అయితే సొగసరి వేగాన్ని ఆపడం అసాధ్యమే. మరో అందమైన నటి ఆషీకా రంగనాధ్‌. సీనియర్లు అయినా? జూనియర్లు అయినా? ఒకే అంటూ పని చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘విశ్వంభర’లో నటిస్తోంది. అంతకు ముందు నాగార్జున సరసన ‘నా సామి రంగ’లో నటించింది. బ్యాలెన్స్‌ వెంకటేష్‌, బాలయ్య చిత్రాల్లోనూ ఛాన్సులు కష్టం కాదు. టైర్‌ 2 హీరోలకు అమ్మడు మంచి ఆప్షన్‌ అవుతుంది. ఈ నలుగురు భామలు సక్సెస్‌ అయితే మరిన్ని అవకాశాలు అందుకుంటారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page