టాలీవుడ్ సీనియర్ స్టార్స్.. ఇది పరిస్థితి!
- Guest Writer
- May 12, 2025
- 2 min read

టాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున 2025లో భిన్నమైన వేగంతో దూసుకెళ్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణలు వరుసగా కొత్త సినిమాలను సైన్ చేస్తూ వేగంగా ముందుకు సాగుతుండగా, వెంకటేష్, నాగార్జున మాత్రం తమ తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో నిదానంగా ఆలోచిస్తున్నారు. ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్ వచ్చినా కూడా ఒకప్పుడు టాలీవుడ్ ను శాసించిన ఈ నలుగురు స్టార్స్ టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వారి 2025 ప్లాన్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాతో సమ్మర్ చివర్లో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఫాంటసీ డ్రామాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా, త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే చిరంజీవి శ్రీకాంత్ ఓదెలా, అనిల్ రావిపూడిలతో కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేశాడు. ఈ వేగం చూస్తుంటే చిరంజీవి తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది.
నందమూరి బాలకృష్ణ కూడా వేగంగా ముందుకు సాగుతున్నాడు. సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సెప్టెంబర్ 25న ‘అఖండ 2’ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే విక్టరీ వెంకటేష్, నాగార్జున మాత్రం తమ తదుపరి చిత్రాల విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఫస్ట్ టైమ్ 300 కోట్ల మార్క్ ను టచ్ చేసి భారీ విజయం సాధించాడు. అయితే, తన తదుపరి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నాగార్జున ‘కూలీ’, ‘కుబేర’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు, కానీ ఈ రెండు చిత్రాల్లో అతను హీరో కాదు.
ఈ సినిమాలు 2025లో విడుదల కానున్నాయి, కానీ నాగార్జున కొత్త హీరో రోల్ కోసం నిదానంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఓ తమిళ దర్శకుడు లైన్ లో ఉన్నప్పటికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. ఈ నలుగురు సీనియర్ స్టార్స్ విభిన్న వేగంతో 2025లో తమ సినిమాలను అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణలు వేగంగా ముందుకు సాగుతూ కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, వెంకటేష్, నాగార్జున మాత్రం తమ తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఇక ఈ సీనియర్ స్టార్స్ 2025లో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.
తుపాకి.కామ్ సౌజన్యంతో..
మడత పడిన నడుముతో దేవియాని

ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా యాక్టివిటీతో ఎప్పుడూ ఫోకస్‌లో ఉండే నార్త్ బ్యూటీ దేవియాని శర్మ తాజాగా షేర్ చేసిన గ్లామర్ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫాలోవర్లకు అందించిన ఈ లుక్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఎర్ర రంగు బ్లౌజ్, ఆకుపచ్చ చీరతో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన దేవియాని తన గ్లామర్ లుక్‌తో ఫోటోషూట్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చింది.
ఎక్స్‌ప్రెషన్స్, ఆ అటిట్యూడ్%ౌ% చూస్తుంటే అందరి ఫోకస్ ఆమెపై యూ టర్న్ తీసుకోకుండా ఉండదు. ఫొటోలు చూసిన నెటిజన్లు ‘ఫైర్’ కామెంట్లతో ఫుల్ ట్రెండ్‌లోకి తీసుకొస్తున్నారు. దేవియాని శర్మ మొదటగా యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతో వెలుగులోకి వచ్చారు. ‘సేవ్ ది టైగర్స్’, ‘షైతాన్’, వంటి వెబ్ కంటెంట్ ప్రాజెక్టుల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ముఖ్యంగా సైతాన్ సిరీస్‌లో ఆమె పోషించిన ఇంటెన్స్ క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవియాని ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నైపుణ్యం ఉండటంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్న దేవియాని త్వరలో టాలీవుడ్‌లో ఒక మంచి పాత్రతో రాబోతున్నట్లు సమాచారం.
తెలుగులో ఆమెకు పూర్తి స్థాయి గ్లామర్ రోల్స్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌ను హైలైట్ చేసే పాత్రలపై ఆసక్తి ఉంది. ఈ మధ్య వచ్చిన ఓ ఫోటోషూట్‌లో కూడా ఆమె స్టన్నింగ్‌గా కనిపించడం చూస్తే, స్టార్ ఇమేజ్ కోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నదో అర్థమవుతోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా చాలా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెస్ చెబుతుండగా, ఆమె పోస్ట్ చేసిన స్టైలిష్ లుక్స్‌కి హృదయాలే పెట్టేశారు. దేవియాని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బ్యూటీ. ఇన్‌స్టా రీల్స్, ట్రెండిరగ్ ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటూ కెరీర్ పరంగానూ ముందుకు సాగుతోంది.
తుపాకి.కామ్ సౌజన్యంతో..










Comments