top of page

డియర్‌ శేఖర్‌ కమ్ములా.. ‘‘నువ్వు నీలాగానే ఉండు!!’’

  • Guest Writer
  • Jun 17
  • 2 min read
ree

ఒక్క సినిమా హిట్‌ అయితే చాలు..నేను తురుము, నేను తోపు అని విర్రవీగే దర్శకులు ఉన్న ఈ రోజుల్లో 25 సంవత్సరాలుగా, ఏ నిర్మాతకూ నష్టాలు రాకుండా కేవలం తను తీసింది 10 సినిమాలే అంటే కొంచెం ఆశ్చర్యమే..

సక్సెస్‌ వెంటపడే టాలీవుడ్‌ జనాలు శేఖర్‌ ను పట్టించుకోలేదు అనే కంటే, కేవలం సక్సెస్‌ని చూసి డైరెక్టర్‌ వాల్యూ చూసే టాలీవుడ్‌ ధోరణినే శేఖర్‌ పట్టించుకోలేదు. ఎందుకంటే, తను స్వతహాగా మృదుస్వభావి, ఇగోలు, భేషజాలు, స్పెషల్‌ క్యాంపులు, సోషల్‌ మీడియా టీంలూ, పెద్ద పెద్ద హై ఎండ్‌ ప్రీమియిమ్‌ కార్లు, లక్సరీ ఆఫీసులు ఏవీ ఉండవు తనకి..

తనకి తెలిసింది కేవలం తన ఐడియాలజీ, తన ఆలోచనలకి తగ్గ సినిమాలు తీయడం మాత్రమే.., అలాగే ఏదయినా సినిమాలో తప్పు జరిగితే నిర్మొహమాటంగా ఒప్పుకొని క్షమించమని కోరటం కూడా తనకే చెల్లింది. అందుకే రాజమౌళి అంటాడు నిన్న కుబేర ఫంక్షన్‌లో..

పైకి అలా కనిపిస్తాడు గానీ శేఖర్‌ తన ఆలోచనలకు తగినట్టుగానే సినిమా తీయడంలో స్టబ్బరన్‌ అని.. ఒక్క ఇంచు కూడా పక్కకు జరగడు అని..ధనుష్‌, నాగార్జున కూడా ఈ సినిమాకు హీరోలం మేం కాము, శేఖర్‌ మాత్రమే అని నిజాయితీగా సర్టిఫికెట్‌ ఇచ్చారు.. నిజం కాబట్టి.. లోపాలు, వైఫల్యాల్ని కూడా నిజాయితీగా అంగకరిస్తాడు, ఉదాహరణకు, హ్యాపీ డేస్‌ సినిమాలో లెక్చరర్‌ పాత్ర కానీ, అనామిక సినిమా రీమేక్‌ కానీ!!

ఆయనలాగే అయన సినిమాలు చాలా సున్నితం. అయనలాగే అయన సినిమాలు నెమ్మదిగా ఉంటాయి.. ఎక్కడా పెద్దగా సినిమా ఫంక్షన్లకి పోడు కానీ చాలా కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్‌ గా వెళ్తూ వుంటాడు.. మీరు ఏ ఫంక్షన్లో ఎప్పుడైనా ఎక్కడైనా శేఖర్‌ ని ఈజీగా గుర్తుపట్టొచ్చు.. ఎందుకంటే, మీ ఇంటిలో కానీ పక్కింటిలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో తాను అలానే ఉంటాడు.

చిన్నగా పెరిగిన గడ్డం, ఒక ఫార్మల్‌ ప్యాంటూ, షర్ట్‌, చెప్పులు వేసుకొని మనందరిలానే మామూలుగా ఉంటాడు.. అతనికి సినిమా అంటే ఫ్యామిలీ.. అందుకే తన ప్రతి సినిమాని తన కుటుంబంలోని ఎవరితో ఒకరితో పోలుస్తూంటాడు..

నిన్నటి కుబేర సినిమా ఈవెంట్లో అందరికంటే ముందే వచ్చి, తన అసిస్టెంట్ల ఫ్యామిలీస్‌ని రమ్మని చెప్పి, అందరికీ దగ్గరుండి మరీ సీటింగ్‌ ఆరెంజ్‌ చేసేదాకా తను కూర్చోలేదు.. ఇవ్వాళారేపు ఏ దర్శకుడండీ, తన అసిస్టెంట్లను, వాళ్ళ ఫ్యామిలీలని పట్టించుకునేది..?

వాళ్ళు మనుషులే, వాళ్ళ ఎమోషన్స్‌ని గుర్తించి, వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఐడెంటిటీ ఇవ్వడమంటే చాలా గ్రేట్‌.. నార్మల్‌గా ఈవెంట్లలో, సినిమా ఈవెంట్లలో సెలబ్రిటీ గ్యాలరీ అని ఒకటి క్రియేట్‌ చేస్తుంటారు. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ జనాలను మాత్రమే కూర్చోపెడుతారు, ఆ గ్యాలరీ అంతా తారల తళుకు బెళుకులే కనిపిస్తాయి, కానీ నిన్న ఆ గ్యాలరీ అంతా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలే కనిపించాయి, దానికి కారణం శేఖర్‌ కమ్ముల..వాళ్ళందరిని సెలబ్రిటీ గ్యాలరీలో కూర్చోపెట్టిన ఘనత తనది!!

ఒక దర్శకుడు ఎంత గొప్పవాడో తెలియాలంటే తన అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఎంత మంది సక్సెస్‌ అయ్యారో చూస్తే చాలు.. సాధారణంగా సినిమా ఈవెంట్ల స్పీచ్‌ లలో చిన్నచిన్న హీరోలు లేదా టెక్నీషియన్స్‌ నుంచి మొదలుపెట్టి వాళ్ల వాళ్ల స్టారడమ్‌ ని బట్టి ఒక ఆర్డర్లో థాంక్స్‌ చెప్పడమో జరుగుతుంది!!

కానీ నిన్నటి ఈవెంట్లో కేవలం తన ఎమోషన్స్‌ ఆధారంగా ఒక నోట్‌ బుక్లో రాసుకొని వచ్చి అందరికీ నువ్వు థాంక్స్‌ చెప్పిన విధానానికి హేట్సాప్‌ శేఖర్‌.. అందుకే నీ సినిమాలూ, నువ్వూ ఎప్పటికీ ఇంతే స్వచ్చంగా, నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ..

- మీ అభిమాని

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page