దీదీ కోటలో మోదీ పాగా
- DV RAMANA

- 1 day ago
- 4 min read
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం
కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’
అసోంలో కమలం హ్యాట్రిక్
పుదుచ్చేరిలో నా స్వామిరంగా
మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తింది. ఫలితంగా అసోం, పుదుచ్చేరిలలో తప్ప మూడు ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళంలలో అధికార పార్టీలను ఓటర్లు పూర్తిగా తిరస్కరించారు. పశ్చిమబెంగాల్‌లో టార్గెట్ దీదీ ఫలించి కమలం జెండా ఎగిరింది. తమిళనాడులో చాలా దశాబ్దాల తర్వాత ద్రవిడవాదం ఓడిపోతున్నది. సినీనటుడు విజjáYT పార్టీ టీవీకే విజయహాసం చేస్తోంది. కేరళంలో ఒక్కోసారి ఒక్కో కూటమికి అవకాశం అన్న సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో పక్కన పెట్టి వరుసగా రెండోసారి వామపక్ష కూటమిని అధికారంలో కొనసాగనిచ్చిన ఓటర్లు.. ఈసారి పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. ఫలితంగా వామపక్ష కూటమి(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం వెనుకబడి కాంగ్రెస్ కూటమి (యÖడీఎఫ్) విజయపథంలో పయనిస్తున్నది. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నది. అక్కడ కాంగ్రెస్‌కు మరోసారి నిరాశ తప్పడంలేదు. పుదుచ్చేరిలో ఎనఆర్‌సీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే దిశగా దూసుకుపోతున్నది. తుది సమాచారం అందే సమయానికి రాష్ట్రాలవారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
బెంగాల్లో బీజేపీ బావుటా
సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టాలని ఎప్పటినుంచో టార్గెట్ పెట్టుకున్న భారతీయ జనతాపార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకుపోతున్నది. 2021 ఎన్నికల్లోనే తృణమÖల్ కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఆమడదూరంలో నిలిచిపోయిన బీజేపీ ఈసారి మాత్రం అనుకున్నది సాధించింది. బీజేపీ దెబ్బకు హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించి నాలుగోసారి వరుసగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశించిన తృణమÖల్ కాంగ్రెస్ అధినేత్రి పూర్తిగా భంగపడ్డారు. పూర్తిస్థాయి ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ ప్రస్తుతం అందుతున్న లెక్కింపు సరళి ప్రకారం బీజేపీ కూటమి విజయం ఖాయమైంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫల్తా నియోజకవర్గం మొత్తం మీద ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించడంతో 293 స్థానాల్లోనే సోమవారం ఉదయం లెక్కింపు ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 148 సీట్ల సింపుల్ మెజారిటీ అవసరం కాగా.. బీజేపీ కూటమి 192 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నది. గత ఎన్నికల్లో 215 స్థానాలతో అపూర్వ విజయం సాధించిన మమత నేతృత్వంలోని తృణమÖల్ కాంగ్రెస్ ఈసారి మాత్రం చాలా స్థానాలను కోల్పోయి 79 సీట్లలో మాత్రమే అధిక్యంలో కొనసాగుతున్నది. భవానీపూర్‌లో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా మొదట్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారి కంటే వెనుకబడినా.. తర్వాత పుంజుకుని ఆధిక్యంలోకి వచ్చారు. అయితే ఆమె కేబినెట్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి బాటలో ఉన్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించిన సువేందు అధికారి ఈ ఎన్నికల్లోనూ అక్కడ పోటీ చేసి ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్‌లో మాత్రం వీరిద్దరి మధ్య ఆధిక్యతలు రౌండ్ రౌండుకూ మారుతూ దోబూచులాడుతున్నాయి. కాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చెరో చోట, ఇతరులు రెండుచోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
తమిళనాట సినీ ప్రభంజనం
తమిళనాడులో తొలిసారి ద్రవిడ పార్టీలకు పరాభవం ఎదురవుతున్నది. ఒకనాడు సినీ ఛరిష్మాను ఉపయోగించుకున్న ద్రవిడ పార్టీలు ఇప్పుడు అదే సినీప్రభంజనానికి చిత్తవుతున్నాయి. రెండేళ్ల క్రితం.. 2024లో సినీనటుడు విజjáYT థళపతి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన టీవీకే పార్టీ ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను వెనక్కినెట్టి అధికారం దిశగా దూసుకుతున్నది. అంతటి మహానటులు కమలహాసన్, రజనీకాంత్‌లకే సాధ్యం కాని పనిని విజjáYT సాకారం చేసి చూపించి దేశంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించనున్న మÖడో నేతగా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచారు. కేరళం మాదిరిగా తమిళనాడులోనూ రెండు పార్టీలను మార్చి మార్చి అధికారం కట్టబెట్టే సంప్రదాయాన్ని ఓటర్లు పాటిస్తుంటారు. ఆ రెండూ కూడా ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలే. కానీ ఈసారి ఓటర్లు ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. రెండు పార్టీలను కాదని మÖడో పార్టీని అందలం ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. మార్పు కోరుకున్న వారి అభిమతానికి సినీ అభిమానం తోడై విజjáYT స్థాపించిన టీవీకే అధికారం దిశగా దూసుకుపోతున్నది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉంటే.. ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. తుది సమాచారం అందే సమయానికి టీవీకే పార్టీ 108 స్థానాల్లో అధిక్యంలో ఉంది. అంటే సాధారణ మెజారిటీకి మరో పది సీట్ల దూరంలో ఉంది. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి పూర్తి మెజారిటీ లభ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. పాలకపక్షమైన డీఎంకే రెండు, మÖడు స్థానాల్లో ఊగిసలాడుతున్నది. చివరి సమాచారం ప్రకారం ఏఐఏడీఎంకే కూటమి 58, డీఎంకే 69 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. కాగా ఇదే కూటమిలో భాగస్వామిగా 27 చోట్ల పోటీ చేసిన బీజేపీ రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీవీకే అధినేత విజjáYT రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు.
కేరళంలో UDF జయకేతనం
కేరళం రాష్ట్ర ఓటర్లు ఈసారి మళ్లీ సంప్రదాయానికి ఓటేశారు. ఈ రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యÖడీఎఫ్ కూటముల మధ్యే ప్రతి ఎన్నికలోనూ పోటీ ఉంటుంది. ప్రజలు కూడా ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి అధికారం అప్పగిస్తుంటారు. కానీ గత ఎన్నికల్లో దానికి భిన్నంగా పినరయి విజయన్ సారధ్యంలోని ఎల్‌డీఎఫ్‌ను వరుసగా రెండోసారి అక్కున చేర్చుకున్నారు. దానివల్ల ఆ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకేత పెరిగింది. అదే ప్రస్తుత ఫలితాల్లో ప్రభావం చూపింది. ఫలితంగా హ్యాట్రిక్ సాధించాలన్న ఎల్‌డీఎఫ్ ఆశలు ఆవిరి అయ్యాయి. కాంగ్రెస్ సారధ్యంలోని యÖడీఎఫ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నది. కేరళంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 140. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ 71 సీట్లు. ఇప్పటివరకు అందిన ఫలితాల సరళి ప్రకారం యÖడీఎఫ్ దాన్ని మించి సెంచురీ మార్కు టచ్ చేసింది. 102 సీట్లలో అధిక్యం కనబరుస్తోంది. అదే సమయంలో అధికార ఎల్‌డీఎఫ్ 36 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మడం నియోజకవర్గంలో మెజారిటీ దిశగా సాగుతున్నారు.
అసోంలో కమలం హ్యాట్రిక్
ఈ మÖడు రాష్ట్రాలకు విరుద్ధంగా మరో సరిహద్దు రాష్ట్రమైన అసోంలో పాలక పార్టీనే ఓటర్లు ఆదరించి వరుసగా మÖడోసారి విజయం కట్టబెట్టారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నది. గతం కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యతలో ఉండటం అక్కడ ప్రభుత్వ అనుకూల పరిస్థితులకు నిదర్శనం. అసోంలో మొదటిసారి సర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2021 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన ఆ కూటమి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించింది. రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 64 సీట్ల మెజారిటీ అవసరం. తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమి సెంచురీ దాటి 101 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ 23, ఏఐయÖడీఎఫ్ రెండు, ఇతరులు ఒకచోట ఆధిక్యంలో ఉన్నారు.
పుదుచ్చేరిలోనూ ఎన్డీయే హవా
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సిద్ధమవుతున్నది. గత ఎన్నికý సమయంలో ఎన్.రంగస్వామి కాంగ్రెస్ (ఎనఆర్‌సీ) పేరుతో సొంత పార్టీ పెట్టి ఎన్డీయేతో జతకట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రంగస్వామి తన కూటమిని రెండోసారి కూడా గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాల ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 16 సీట్లు అవసరం. ఫలితాల ట్రెండ్ ప్రకారం ఎనఆర్‌సీ కూటమి 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 7, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా తెలుగువారైన మల్లాడి కృష్ణారావు మరోసారి యానాం నియోజకవర్గం నుంచి ఎనఆర్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 4568 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.






Comments