top of page

దుర్యోధనుడి వేషం.. దుర్వాసన పర్వం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 22 hours ago
  • 1 min read
  • విచారణలో వెలుగుచూసిన డీడీ కళాతృష్ణ సబ్‌స్క్రైబ్ చేస్తేనే వినతులు వినేది

  • జారాణి పైనే బాధితుల ఆశలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

దాన వీర శూర కర్ణలో దుర్యోధనుడి గెటప్, బాబీ సినిమాలో రిషికపూర్‌లా గిటార్ పట్టుకున్న ఫోజు... సాక్షాత్తూ మన ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్‌వే.. మన సారు సకలా కళా ప్రియుడో.. వల్లభుడో తెలియదు గానీ శుక్రవారం ఆయన మీద జరిగిన విచారణ అధికారిణి ముందు ఈ ఫోటోలే ప్రత్యక్షమయ్యాయి. సొంతంగా ఒక యుట్యూబ్ ఛానెల్ నడుపుతున్న డీడీ రవికుమార్ తన వద్దకు పని మీద వచ్చిన వారిని ముందుగా తన ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసిన తరువాతే మాట్లాడతారని విచారణలో కొందరు ఫిర్యాదు చేశారు. దుర్యోధనుడు గెటప్‌లో ఉన్న రవికుమార్ ఆఫీసుకు వచ్చేసరికే దుర్వాసన వస్తుందని స్వయంగా ఏటీవోనే విచారణ అధికారి ముందు ఏకరువు పెట్టినట్లు భోగట్టా. ఎలాగూ ఆయన వైన్‌షాప్ దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చిన పేపర్ కటింగ్‌లు ఉన్నాయి కాబట్టి దానిని కూడా విచారణాధికారి ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఎలాగూ జిల్లా ట్రెజరీ కార్యాలయం రెండుగా చీలిపోయింది కాబట్టి కొందరు డీడీకి అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ విచారణాధికారి వనజారాణికి స్టేట్‌మెంట్లు ఇచ్చి ఉంటారు. అది వేరే విషయం. అక్రమంగా ఏడుగురు సస్పెండయ్యారని రాష్ట్ర, కేంద్ర మంత్రులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలంతా ట్రెజరీ శాఖ డైరెక్టర్‌కు తెలపడంతో ఈమె నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీరిని ఇక్కడే కొనసాగిస్తారా.. బదిలీ చేస్తారా అనేది మళ్లీ డీడీ విచక్షణాధికారం మీదే ఆధారపడి ఉంటుంది. విచారణాధికారి తనూజారాణికి సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుంది. కాబట్టి ఆమె మీద ఎవరి ప్రభావం ఉండదని బాధితులు భావిస్తున్నారు. మరోవైపు ఏటీఓ రమణారెడ్డి మీద ట్రెజరీ యునియన్ నాయకులు దాడికి వచ్చారన్న ఫిర్యాదుపైనా స్వయంగా ఏటీవోనే రెండురకాలుగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం వలన యÖనియన్ నాయకులను, ఏటీఓను ఒకేచోట కూర్చోబెట్టి వనజారాణి విచారించారు. ఆ నలుగురికి భయపడి మొదట్లో ఏమీ జరగలేదని చెప్పానని, వాస్తవానికి తనమీద దాడికే వచ్చారంటూ రమణారెడ్డి తనూజారాణికి చెప్పారని తెలుస్తోంది. ఏది ఏమైనా బుధవారం నాటికి నివేదిక మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page