top of page

నివేద కొత్త లుక్‌..ఊహించలేదే!!

  • Guest Writer
  • Aug 29, 2025
  • 2 min read

కొందరు ఎంతగా నియంత్రించాలనుకున్నా అధిక బరువు సమస్య నుంచి బయటపడలేరు. అదే జాబితాలో ఉంది నివేద థామస్‌. ఈ బ్యూటీ తనదైన అందం, ప్రతిభతో పాటు మంచి మాట తీరుతోను అందరి హృదయాలను కొల్లగొడుతుంది. నివేద థామస్‌ ఒక మలయాళీ అమ్మాయి అయినా కానీ, తెలుగులో అద్భుతంగా మాట్లాడి మనసుల్ని గెలుచుకుంటుంది. అందుకే ఈ బ్యూటీ రేసులో వెనకబడటాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు.

అయితే నివేద ఇటీవల అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం అధిక బరువు సమస్య అని చెబుతున్నారు. ఇటీవల కొంతకాలంగా నివేద అదుపు తప్పి బరువు పెరగడం తీవ్ర ఆందోళనలకు కారణమైంది. ఇదే తీరుగా బరువు పెరుగుతూ ఉంటే, మునుముందు మమ్మీ, ఆంటీ పాత్రలకు కూడా ఎంపికవ్వడం కష్టమని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

నివేద తిరిగి నిన్ను కోరి, బ్రోచేవారెవరురా లో కనిపించినట్టుగా హీరోయిన్‌ మెటీరియల్‌ లుక్‌తో కనిపించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కానీ నివేద మాత్రం దీనికోసం జిమ్‌ లో కసరత్తులు చేయకపోవడం, అదనంగా శ్రమించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే నివేద ఉన్నట్టుండి ఇటీవల కొత్త ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈసారి కొంత బరువు తగ్గి అందంగా కనిపించింది. లేటెస్ట్‌ ఫోటోషూట్‌ చూడగానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నివేద ఈజ్‌ బ్యాక్‌! అంటూ ఫ్యాన్స్‌ తమ ఫేవరెట్‌ నటికి వెల్‌ కం చెబుతున్నారు. 2025 గదర్‌ అవార్డుల్లో కనిపించిన రూపానికి ఇప్పటికి చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇప్పుడు బరువు తగ్గింది. ఇంకా మునుముందు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. నివేద ఇదే తీరుగా కసరత్తులతో మరింత స్లిమ్‌ గా మారాలని కోరుకుంటున్నారు. కెరీర్‌ మ్యాటర్‌ కి వస్తే ... ఇటీవల ‘35- చిన్న కథ కాదు’ అనే చిత్రంలో ఒక స్కూల్‌ పిల్లాడికి తల్లిగా నటించిన నివేద థామస్‌ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటనకు గాను గద్దర్‌ అవార్డ్స్‌ లో ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం బరువు తగ్గుతోంది. మునుముందు ఇంకా స్లిమ్‌ గా మారి టాలీవుడ్‌ లో మరిన్ని చిత్రాల్లో నటించేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

మళ్లీ హర్టయిన భాగ్యశ్రీ ఫ్యాన్స్‌

విజయ్‌ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి చిత్రం ‘కింగ్‌డమ్‌’ బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచింది. విడుదలకు ముందున్న అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. నిర్మాత నాగవంశీకి ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. బయ్యర్ల దీ అదే బాధ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో చూడనివాళ్లు ఓటీటీలో చూసి, ఆదరిస్తారని నిర్మాత నాగవంశీ నమ్మకం. అయితే.. ఓటీటీ వెర్షన్‌ చూసిన వాళ్లు మరింత డిజప్పాయింట్‌ అవుతున్నారు. కారణం.. ‘హృదయం లోపల’ అనే పాటని ఎడిట్‌ చేయడం.

విజయ్‌-భాగ్యశ్రీ బోర్సేలపై తెరకెక్కించిన ఈపాటకు మంచి ఆదరణ లభించింది. అయితే థియేటర్‌ వెర్షన్‌లో ఈ పాట లేదు. దాంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్‌ హర్టయ్యారు. ఈ పాట ఎందుకు తీసేశారు? అనే ప్రశ్నకు నిర్మాత నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. ‘కథ ఫ్లోకి అడ్డొచ్చింది. అందుకే ఈ పాటంటే ఎంత ఇష్టం ఉన్నా, తొలగించాల్సివచ్చింది’ అని చెప్పారు. ఈ పాటని కనీసం ఓటీటీ వెర్షన్‌ లో అయినా చూడొచ్చని ఫ్యాన్స్‌ భావించారు. కానీ ఇక్కడా నిరాశే ఎదురైంది. థియేట్రికల్‌ కట్‌ నే ఓటీటీకి పంపారు. కొన్నిసార్లు ఓటీటీ సంస్థలు చాలా స్పష్టంగా ఉంటాయి. ‘మాకు థియేటర్‌ కట్‌ కావాలి’ అని అడుగుతాయి. ఇంకొన్నిసార్లు ఎడిట్‌ చేసిన సీన్లు, పాటలు కూడా జోడిరచాలని షరతు పెడతాయి. నెట్‌ ఫ్లిక్స్‌ లో.. డైరెక్టర్‌ కట్‌ వెర్షన్లు ఎక్కువ వస్తాయి. ‘యానిమల్‌’, ‘పుష్ప’ సినిమాలు థియేటర్‌ తో పోలిస్తే ఓటీటీలో లెంగ్తీగా ఉంటాయి. థియేటర్‌ లో చూడని కొత్త సీన్లు.. ఓటీటీలో కనిపించాయి. దాంతో వాటికి ఓటీటీలోనూ మంచి మైలేజీ వచ్చింది. ‘కింగ్‌ డమ్‌’ కూడా నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థనే చేజిక్కించుకొంది. అందుకే ఈసారి ఓటీటీ వెర్షన్‌లో పాట ఉంటుందని భావించారు. కానీ దాన్ని తొలగించేసరికి భాగ్యశ్రీ ఫ్యాన్స్‌ మళ్లీ ఫీలయ్యారు. పాట ఉన్నా, లేకున్నా వ్యూవర్‌ షిప్‌లో పెద్దగా తేడా ఉండదని ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ భావించి ఉంటుంది. అందుకే దాన్ని ఈసారి కూడా లైట్‌ తీసుకొన్నారేమో?

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page