నకిలీ బీమా!
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 3 min read
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి
వారి పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి పాలసీలు
చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు
పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా
ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం
జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లింపులు జరిగాయి.
అదే గ్రామానికి చెందిన బెండి సత్యవతి పేరుతోనూ తొమ్మిది సంస్థల్లో బీమా పాలసీలు తీసుకున్నారు. ఆమె కూడా క్యాన్సర్‌తో మతి చెందడంతో నామినీలు బీమా సంస్థల నుంచి రూ.1.50 కోట్లు క్లైమ్ చేసుకున్నారు.
మురపాక సూర్యనారాయణ కేసు కూడా సేమ్ టు సేమ్. ఆయన మతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు రూ.98 లక్షల క్లెయిమ్ అందుకున్నారు.
వంజంగి గ్రామానికి చెందిన పొన్నాడ డొంకారావు కేన్సర్‌తో మతి చెందినట్టు చూపించారు. ఈయన పేరున పాలసీ కట్టారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత పాలసీ వచ్చింది. వచ్చిన నెల రోజుల్లోనే రూ.60లక్షలు బీమా సంస్థల నుంచి క్లైం చేసి నామినీ పేరుతో జమ చేయించి వారి నుంచి బదలాయించారు.
ఆమదాలవలస మున్సిపాల్టీకి చెందిన మెట్ట అన్నపూర్ణ వయస్సు 70 ఏళ్లు. దీన్ని 55కు తగ్గించి బీమా పాలసీ చేయించారు. ఈమె బెండి పున్నయ్యకు సమీప బంధువు. ఈమె కేన్సర్‌తో మతి చెందినట్టు చూపించి రూ.కోటి బీమా సంస్థల నుంచి క్లైం చేయించుకున్నారు. టెక్కలిలో ఉంటున్న ఆమె కుమార్తె సనపల రేణుక పేరుతో మరో బీమా పాలసీని తీసుకున్నారు. పాలసీ తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఆమె కూడా మతి చెందింది. క్లైం కింద రూ.98 లక్షలు ఇన్సూరెన్స్ సంస్థల నుంచి నామినీల ఖాతాల్లో జమ చేయించి, ఆర్ధిక ప్రయోజనం పొందారు.
..ఇలా పెద్దసంఖ్యలో పాలసీలు తీసుకున్న చాలామంది స్వల్పకాలానికే మతి చెందడం, వారి నామినీలు పెద్ద మొత్తాల్లో బీమా సొమ్ము అందుకోవడం యాదచ్ఛికం కాదు. దీని వెనుక చాలా మతలబు ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరందరి చేత పాలసీలు కట్టించిన ఆమదాలవలస జెట్పీటీసీ బెండి గోవిందరావు, పున్నయ్యలపై రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. బీమా ముసుగులో బీమా సంస్థలకు రూ.5 కోట్ల మేరకు మోసం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురి పేర్లతో వీరే సొంత డబ్బులతో బీమా పాలసీలు చేయించడం, పాలసీదారులు పోయాక వారి కుటుంబ సభ్యులతో క్లెయిమ్ చేయించి, డబ్బు అందాక తణమో ఫణమో వారికి ముట్టజెప్పి.. మిగతా సొమ్ము తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకోవడమే వీరి భాగోతమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ బంధువర్గాల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ మరణానికి చేరువలో ఉన్నవారిని, వద్ధులను ఎంచుకుని మరీ తమ అక్రమాల్లో పావులుగా వాడుకుంటున్నారు.
మంచాన ఉన్నవారే పావులు
ఎస్పీకి అందిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాల్లో వీరిద్దరూ తమ బంధువులతో పదుల సంఖ్యలో బీమా పాలసీలు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరి పాలసీలు చేయించినవారెవరూ అర్హులు కారని, పాలసీ తీసుకున్న ఏడాదిలోపే.. కనీసం రెండో వాయిదా కూడా చెల్లించకుండానే మత్యువాత పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోగాలతో మంచం పట్టిన వారి కుటుంబ సభ్యులను ఒప్పించి పాలసీ మొత్తాన్ని తామే చెల్లించుకుంటామని, పాలసీదారుడు మతి చెందిన తర్వాత నామినీగా ఉన్నవారికి బీమా సొమ్ము అందుతుందని.. దాన్ని తమ ఖాతాల్లోకి బదిలీ చేస్తే కొంత మొత్తం చెల్లిస్తామంటూ ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారన్నది ఫిర్యాదుదారుల ఆరోపణ. ఈ దందాపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో రెండు రోజుల క్రితం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. దానికి ముందే బీమా సంస్థలను పర్యవేక్షించే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ)కు కూడా సదరు ఫాల్స్ క్లెయిములను చెల్లించిన ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ, కో{క్, శ్రీరాం, uజాజ్ అలయెంజ్, యాక్సిస్ మాక్స్, రిలయన్స్ నిప్పన్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, టాటా ఏఐఏ బీమా సంస్థలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్‌కు సైతం ఫిర్యాదు వెళ్లింది. దాంతో అప్రమత్తమైన బీమా సంస్థలు వీటిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కేసు తీవ్రతను గుర్తించిన ఐఆర్‌డీఏఐ దీనిపై దర్యాప్తు సంస్థలతో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పూర్తి వివరాలు అందించాలని ఫిర్యాదుదారులను కోరినట్లు తెలిసింది.
నకిలీ ఆధార్‌ల సృష్టి
సాధారణంగా బీమా పాలసీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. నిర్ధిష్ట వయసు మీరినవారు, వ్యాధులతో బాధపడుతున్నవారు పాలసీలు తీసుకోవడానికి అనర్హులు. కానీ వయసు తక్కువే అన్నట్లు నకిలీ పత్రాలు పుట్టించి, వ్యాధులు లేవని చెప్పి పాలసీలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందరావు తన తల్లి పేరిట కూడా ఈ విధంగానే పాలసీ తీసుకున్నారని తెలిసింది. ఆమె 1940లో పుట్టారు. వయసు 86 ఏళ్లు కాగా ఆధార్‌లో 56 ఏళ్లుగా చూపించి పాలసీ కట్టించారు. కొన్నాళ్లకే ఆమె మతి చెందగా, చనిపోయేనాటికి ఆమె వయసు 75 ఏళ్లుగా పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. వద్ధాప్య పింఛను రికార్డుల్లో 78 సంవత్సరాలు, ఓటరు జాబితాలో 79గా నమోదు చేశారు. ఆధార్‌ను మార్చిన తర్వాత ఓటరు చేర్పుల జాబితాలో 55గా నమోదు చేశారు. ఆధార్‌ను ఆమదాలవలస మండలం అక్కులపేటలో, ఆరోగ్య పరీక్షలను శ్రీకాకుళంలో ఫారెస్టు కార్యాలయం వద్ద ఉన్న ఒక మెడికల్ సెంటర్‌లో చేయించి సర్టిఫికెట్ తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకే ఆమె మతి చెందడంతో ఆమె తర్వాత నామినీగా ఉన్న గోవిందరావుకు తొమ్మిది బీమా సంస్థల నుంచి సుమారు రూ.1.40 కోట్ల బీమా సొమ్ము అందింది. ఇక గోవిందరావు భార్య సత్యవతి కూడా క్యాన్సర్‌తో మతి చెందింది. ఈమెకు ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖలోని ఎంజీఏ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈమెకు క్యాన్సర్ చివరి దశలో ఉందని వైద్యులు చెప్పిన తర్వాతే తొమ్మిది సంస్థల్లో పాలసీలు చేయించినట్లు తెలిసింది. ఆమె మతి చెందిన తర్వాత బీమా పరిహారానికి దరఖాస్తు చేసి రూ.1.50 కోట్లు అప్పనంగా అందుకున్నారు. అదే గ్రామంలో మురపాక సూర్యనారాయణ అనే వ్యక్తి 2021 ఏప్రిల్ 24న మతి చెందాడు. కాగా మతుడి బంధువునే సూర్యనారాయణగా చూపించి మళ్లీ అవే తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకున్నారు. నాలుగు నెలల తర్వాత 2021 ఆగస్టు 18న సూర్యనారాయణ మతి చెందినట్లు పంచాయతీ కార్యదర్శిని మేనేజ్ చేసి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. దాని ఆధారంగా బీమా క్లెయిమ్ చేసి రూ.98 లక్షలు జమ చేయించారు. అందులో రూ.3 లక్షలు వారికి ఇచ్చి మిగతా మొత్తాన్ని తన ఖాతాలోకి బదలాయించుకున్నారు.
ఎవరి వాటాలు వారికి..
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివారు పదుల సంఖ్యలో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నకిలీ దందాలో గోవిందరావు, పున్నయ్యలకు ఆయా బీమా సంస్థల సిబ్బంది సహకరించినట్లు తెలిసింది. వారి సహకారంతోనే పాలసీలు కట్టించడం, క్లెయిమ్ చేయడం. ఆ మొత్తన్ని వాటాలుగా తీసుకోవడం వంటి తతంగాలు జరుగుతున్నాయంటున్నారు. వీరితో పాటు వయసులు తగ్గించి, చిరునామాలు మార్చి తప్పుడు ఆధార్ కార్డులు అందిస్తున్న అక్కులపేట ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడిని కూడా ప్రధాన పాత్రధారిగా భావిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలోనూ ఇదే గోల్‌మాల్ జరిగింది. దీనికోసం ఒక సర్టిఫికెట్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేసేవారని విశ్వసనీయ సమాచారం. దీనిపై పోలీసులు, బీమా సంస్థలు పూర్తిస్థాయి దర్యాప్తు జరిపితే మరిన్ని విస్మయకర అంశాలు వెలుగుచూసే అవకాశం ఉంది.










Comments