నయా రాయ్‌పూర్ అలా.. అమరావతి ఎలా?
- DV RAMANA

- Apr 8
- 2 min read

విభజనకు గురై రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో పుష్కరకాలం గడిచినా భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు సమసిపోవడంలేదు. రాజధానిగా అమరావతిని గత టీడీపీ, ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించి అంతర్జాతీయ నగరంగా నిర్మిస్తామంటున్నది. అందుకోసం లక్ష ఎకరాలు, వాటిలో కనీస వసతుల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబు సహా పాలకపక్షీయులు చెబుతున్నారు. పైగా 2028 నాటికే అమరావతిని అందుబాటులోకి తెచ్చేస్తామంటున్నారు. కానీ ప్రతిపక్ష వైకాపా మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నది. మౌలిక వసతులకే రెండు లక్షల కోట్లు ఎక్కడినుంచి తెస్తారని, అలాగే నిర్మాణాలు, నిధుల లభ్యతను దష్టిలో ఉంచుకుంటే నగర నిర్మాణం ఇప్పట్లో పూర్తి అయ్యేదికాదని అంటూ మొదట మూడు రాజధానుల ప్రతిపాదనను, తాజాగా మావిగన్ మోడల్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మూడింటిలో ఏది మంచిదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త నగరంగా రూపుదిద్దుకుంటున్న నయా రాయ్‌పూర్ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. ఏబీ వాజ్‌పేయి ప్రధాని ఉన్నప్పుడు దేశంలో ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఛత్తీస్‌ఘడ్‌కు రాజధానిగా రాjáYTపూర్‌ను ఖరారు చేశారు. అయితే ఆ పట్టణంలో రాజధాని స్థాయికి తగిన వసతులు లేకపోవడంతో దానికి ఆనుకునే నయా రాjáYTపూర్ పేరుతో కొత్త నగర నిర్మాణాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నగరం పేరు కొన్నాళ్లకే నయా రాయ్‌పూర్ అటల్‌నగర్‌గా పేరు మార్చుకున్నప్పటికీ రెండు దశాబ్దాలు గడిచినా నిర్మాణం మాత్రం కొలిక్కి రావడంలేదు. దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా చెబుతున్న ఈ నగరంలో ఆధునిక హంగులు కల్పిస్తున్నా ప్రజలు మాత్రం అటువైపు మొగ్గుచూపడం లేదు. ఫలితంగా కొత్త నగరం వెలవెలబోతున్నది. సెలవు రోజులైతే పూర్తి నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. 2006లో నయా రాయ్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎనఆర్‌డీఏ) ఏర్పాటు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. రెండు దశాబ్దాల తర్వాత చూస్తే నిర్మాణం కనీసం ఓ సాధారణ పట్టణస్థాయికి కూడా చేరలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం 70 వేల జనాభా కూడా అక్కడ నివసించడం లేదు. ఇక రాష్ట్రస్థాయి కార్యాలయాల సిబ్బంది, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వంతో అవసరం ఉన్న వారంతా రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పాత రాయ్‌పూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో కొత్త నగరంలో ఎవరూ నివాసం ఉండటం లేదు. ఫలితంగా ఆఫీసు సమయాలు ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో నయా రాయ్‌పూర్‌లో మనుషుల జాడ కనిపించడం గగనమే. దీని నిర్మాణానికి 41 గ్రామాలకు చెందిన ఐదువేల మంది రైతుల నుంచి భూసేకరణ చేశారు. ప్రస్తుతం విశాలమైన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, రాజప్రాసాదాన్ని తలపించే సచివాలయం నిర్మించారు. సమీపంలోనే నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని గత ఏడాదే ప్రారంభించారు. దాంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడి నుంచే పనిచేయడం ప్రారంభించాయి. అయితే ఆయా సంస్థలు, శాఖల సిబ్బంది నిత్యం వచ్చి, పోవడమే తప్ప నవరాయ్‌పూర్‌లో నివసించడానికి మొగ్గు చూపడం లేదు. సుమారు 19,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్‌ఫీల్డ్ సిటీలో అత్యంత ఖరీదైన విల్లాలున్నాయి. సీఎం, మంత్రులకు విశాలమైన నివాసాలు కట్టారు. ఇక ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందికి తగ్గట్టుగా భవనాలు నిర్మించారు. అయితే అవన్నీ ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొద్దిమంది మినహా ఎవరూ కనిపించరు. చివరకు సీఎం కూడా అతిధిలా వచ్చిపోతుంటారు. మంత్రులు సైతం అరుదుగా కనిపిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారుల భవనాలు కూడా అంతే. చివరికి నవ్‌రాయ్‌పూర్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫ్యాకల్టీల్లో అత్యధికులు సైతం పాతరాయ్‌పూర్ నుంచి వచ్చి పోతుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐఐఎం, ట్రిఫుల్ ఐటీ, కళింగ యూనివర్సిటీ, దిల్లీ పబ్లిక్ స్కూల్ సహా పలు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదివే విద్యార్థులు కూడా పాత రాయ్‌పూర్ నుంచే ఎక్కువగా వస్తున్నారు. నయా రాయ్‌పూర్ ప్రస్తుత జనాభా 70 వేలుంటుందని భావిస్తే.. వారిలో అత్యధికులు నగర నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాలవారే. రాజధాని కోసం భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు అసంతప్తితో ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు వలసలు పోయారు. నగర నిర్మాణానికి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ. 9 వేల కోట్లు వెచ్చించిందని అంచనా. పెద్దగా అప్పులు తీసుకురాలేదు.. హంగులు, ఆర్భాటాలకు పోలేదు. చేసిన సుమారు రూ.1700 కోట్ల అప్పులను కూడా 2025లోనే ప్రభుత్వం తీర్చేసింది. పాత రాయ్‌పూర్ జనాభా శివారు ప్రాంతాలతో కలిపి 20లక్షలకు చేరుకుని ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నా కూడా జనం ఇక్కడి నుంచి కదలడంలేదు. రాష్ట్ర రాజధానిలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7100 మంది. అన్ని శాఖలను అక్కడికి తరలించినా రాజధాని కళ సంతరించుకోవడం కష్టమే. దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే నయారాయ్‌పూర్‌లో ఉపాధి అవకాశాలు లేకపోవడమే. పాత రాయ్‌పూర్ దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉంటున్నది. వ్యాపార, వాణిజ్య వర్గాలకు, వాటిపై ఆధారపడి ఉపాధి పొందేవారికి ఆదరువుగా నిలుస్తున్నది. అటువంటి అవకాశాలు నయారాయ్‌పూర్‌లో మగ్యం. అందువల్ల కొత్త నగరానికి వెళ్లడానికి రాjáYTపూర్ వాసులు ఇష్టపడటం లేదు. ఇప్పుడు అమరావతిని చేపట్టి పష్కర కాలమవుతోంది. రైతులను భారీగా వ్యవసాయ భూములు తీసుకున్నారు. నయా రాయ్‌పూర్ మాదిరిగా ఇది కూడా గుంటూ, విజయవాడల మధ్యలో వాటికి చేరువగా ఉంది. పైగా దీని నిర్మాణాలు ఎప్పటికి పూర్తి అవుతాయో.. కొత్త రాజధాని ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్నది చెప్పలేని పరిస్థితి.






Comments