‘పెద్ది’, ‘ప్యారడైజ్’.. ఒకరు డిసైడ్ అయినట్లేనా?
- Guest Writer
- 4 days ago
- 2 min read

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు చరణ్ పెద్ది మూవీని కంప్లీట్ చేస్తుండగా.. ఇటు నాని ప్యారడైజ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. రెండిరటిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ మూవీ రిలీజ్ కు ముందు రోజు ప్యారడైజ్ ను మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది.
అయితే రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకరోజు తేడాతో రిలీజైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్లాష్ వస్తుందో తెలిసిన విషయమే. రిజల్ట్ పక్కన పెడితే.. కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి చరణ్.. నానిలో ఎవరో ఒకరు డ్రాప్ అవ్వడం బెటర్ అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి రెండు సినిమాలు అప్పుడే రిలీజ్ అవుతున్నాయా.. లేదో ఒక చిత్రం వాయిదా పడుతుందా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో కాకుండా.. పెద్దితో పోటీ పడకుండా.. సమ్మర్ లో రిలీజ్ చేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ పై ఫోకస్ పెట్టి.. త్వరలోనే మ్యాసివ్ అప్డేట్ తో ప్యారడైజ్ మేకర్స్ ప్రకటన ఇవ్వనున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే ప్యారడైజ్ మూవీనే పోస్ట్ పోన్ అవుతుందని కొన్ని రోజులుగా సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ ను ఇంకా మేకర్స్ స్టార్ట్ చేయలేదు. కంటిన్యూగా అప్డేట్స్ ఇవ్వడం లేదు. కానీ పెద్ది మేకర్స్ మాత్రం.. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన చికిరి చికిరి సాంగ్.. ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ గా డిసెంబర్ 31వ తేదీన మరో అప్డేట్ రానుంది. సంక్రాంతికి ఇంకో అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం. దీంతో ఓవైపు షూటింగ్ పూర్తి చేస్తూ.. మరోవైపు సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. మొత్తానికి చరణ్ తో పోటీ విషయంలో నాని వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు!
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
డైలాగ్ లేని పాత్ర లో కృష్ణ

మనలో చాలా మంది ‘ తేనె మనసులు ‘ కృష్ణ గారి తొలి చిత్రం అనుకుంటారు. అయితే పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. చిన్నా చితకా పాత్రలు కూడా పోషించారు. అలాంటిదే ఈ స్టిల్. 1962లో కొంగర జగ్గయ్య గారు హీరోగా నటించిన ‘పదండి ముందుకు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధులలో ఒకనిగా కనిపించారు. ఈ చిత్రం అవుట్‌డోర్ షూటింగు కొంత భాగం తెనాలిలో తీశారు. అందులో ఓ వాలంటీర్ పాత్ర అవసరం అయింది. ఆరా తీస్తే బుర్రిపాలెంలో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు అన్నారు. ఆయనే కృష్ణ.
అప్పటికే ఎల్వీ ప్రసాద్ గారు కొడుకులు-కోడళ్ళు సినిమాలో వేషం వుంది మద్రాస్ రమ్మని కబురు పంపారు. తీరా వెళ్తే, నలుగురు హీరోల్లో ఒకడు. అయినా నెల రోజులలో రిహార్సల్స్ ఉన్నాయి తర్వాత రమ్మన్నారు. పోన్లే ఏదో ఒక వేషం అని సరిపెట్టుకుని ఇంటికి వచ్చారు. ఈ లోపు ఈ వేషం ఇచ్చారు. అలాగే కులగోత్రాలు, మురళీ కృష్ణ వంటి చిత్రాల్లో చిన్న వేషాలు చేశారు. తేనె మనసులు చిత్రంలో హీరోగా నటించిన తర్వాత ఆయన దశ తిరిగింది.
(పాత్రికేయుడు వినాయకరావు రచించిన దేవుడు లాంటి మనిషి పుస్తకం నుంచి సేకరణ)
బాపు, రమణల రెండో చిత్రం బంగారు పిచ్చిక. రోడ్ మూవీ. చంద్రమోహన్, విజయనిర్మల జంట. చంద్రమోహన్‌ను వెతుక్కుంటూ బయల్దేరిన తల్లి శాంతకుమారి మీద బొలారం రైల్వే స్టేషనులో సీను తీస్తున్నప్పటి చిత్రం.
ఈ సినిమాను పెళ్లికొడుకు పేరుతో మళ్లీ తీశారు. నరేష్, దివ్యవాణి నటించారు.
ఈ రెండు సినిమాలూ పోయాయి. దీని మీద జంధ్యాలగారి జోకు... బంగారు పిచ్చిక తీయాల్సిన టైమ్ కన్నా ముందే తీసేశారు. పెళ్లికొడుకు బాగా లేటుగా తీశారు. ఫైనల్ గా ఒకే సినిమా రెండు సార్లు ఫ్లాపయ్యింది. అదీ కథ. ఈ సినిమాలో చంద్రమోహన్ పాత్రకు బాలసుబ్రహ్మణ్యం అనుకున్నారట బాపు రమణలు. తను చేయననడంతో చంద్రమోహన్‌తో కానిచ్చేశారు. నిజానికి యద్దనపూడి సులోచనారాణిని హీరోయిన్ చేయాలనే ఆలోచన కూడా రమణగారి మనస్సులో ఉందట. కోతికొమ్మచ్చి చదివే వరకు నాకూ తెలియదు.
- రంగవర్జుల భరద్వాజ్










Comments