పెళ్లి తర్వాత మరింత స్పెషల్‌గా
- Guest Writer
- 2 days ago
- 2 min read

‘‘నేను కష్టపడి పనిచేస్తాను.. ఆడిషన్ చేస్తాను.. ఆపై నన్ను ఒక పాత్ర వరిస్తుంది. నాకు ఎప్పుడూ ఆ నమ్మకం ఉండేది’’ అని తెలిపింది రకుల్ ప్రీత్‌సింగ్. కానీ కాస్టింగ్ ఏజెంట్లకు 100సార్లు కాల్ చేయాల్సి వచ్చేదని కూడా వెల్లడిరచింది. ప్రారంభ దశలో ముంబైకి వచ్చాక ఏమీ తెలియని అమాయకురాలిని. ఇప్పటికీ నేను కొంచెం అలానే ఉన్నానని అనుకుంటాను. పరిశ్రమ గురించి, ఇక్కడ అవకాశాల గురించి అస్సలు ఏమీ తెలీదు. ఎలా ఉండాలో మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేరు. నేను చాలా సింపుల్ గా ఆలోచించేదానిని... కానీ తద్వారా ఏదీ జరగదు అని తెలుసుకున్నానని రకుల్ అంది.
ఒక కొత్త వ్యక్తిగా నా అతిపెద్ద బలం నా పట్టుదల. నేను కాస్టింగ్ డైరెక్టర్లకు పదే పదే కాల్ చేసేదానిని.. ఒక్కోసారి వంద సార్లు కాల్ చేసిన సందర్భాలున్నాయి. నా కాల్ డిస్ కనెక్ట్ అయ్యేవరకూ చేస్తూనే ఉండేదానిని... వాళ్లకు అప్పటికి నేను పెద్దగా తెలీదు కాబట్టి నేను సిగ్గుపడలేదు. కాస్టింగ్ ఏజెంట్లు నన్ను గుర్తించడానికి పది రెట్లు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నాకు కావలసింది ఒకే ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఆడిషన్ చేయించండి అని కోరుకున్నట్టు తెలిపింది.
ఇటీవేల రకుల్ -అజయ్ దేవగన్ జోడీ నటించిన దేదే ప్యార్ దే 2 ఆశించిన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పతి పత్ని ఔర్ వో 2 చిత్రీకరణలో బిజీగా ఉంది రకుల్. ఈ సినిమాలో మరో రిఫ్రెషింగ్ నటనను ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినీపరిశ్రమ గురించి పరిమిత జ్ఞానం మాత్రమే ఉన్నా కానీ, తనపై అచంచలమైన నమ్మకంతో ముంబైకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంది. నేను ముంబైకి వెళ్ళినప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడిని. నేను ఇప్పటికీ కొంచెం అమాయకురాలిని అని నేను అనుకుంటున్నాను.
నిరంతర ఫోటోషూట్లు:
రకుల్ ఇటీవల తన భర్తతో కలిసి స్టోర్ లాంచింగ్ కార్యక్రమాలకు రెగ్యులర్ గా అటెండవుతోంది. భారతదేశంలో అత్యుత్తమ ఆదర్శవంతమైన ఫిట్టెస్ట్ కపుల్‌గా పాపులరైన ఈ జోడీ సైడ్ ఇన్ కమ్ అసాధారణంగా పెరిగిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ బ్యాక్ లెస్ ఫోజ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. మిర్రర్‌లో ఎంతో అందంగా ఒద్దికగా కుదిరింది ఈ లుక్. రకుల్ పెళ్లి తర్వాత మరింత గ్లామరస్‌గా మారుతోందని యువతరం కామెంట్లు చేస్తున్నారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
అఖండ 2.. దిష్టంతా పోయేలా ఓ టీజర్

ఎన్నో అడ్డంకుల్ని, ఆటుపోట్లని తట్టుకొని అఖండ 2 విడుదలకు సిద్ధమైంది. 12న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. 11 రాత్రి నుంచి ప్రీమియర్ల హడావుడి మొదలైపోతోంది. నైజాంలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ బజ్‌ని మరింత పెంచేలా%ౌ% అఖండ నుంచి కొత్త టీజర్ వచ్చింది. ఈసారి ఇంకాస్త క్రేజీ స్టఫ్ తో. ఇప్పటికే ఓ టీజర్, రెండు ట్రైలర్లు విడుదల చేసింది చిత్రబృందం. ఇది రెండో టీజర్ అన్నమాట. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల్లో బయటకు వచ్చిన ఈ కొత్త టీజర్ అఖండ బజ్‌ని మరింత పెంచేలా వుంది.
బోయపాటి సినిమాలు హై ఓల్టేజ్ యాక్షన్ ని పరిచయం చేసేలా వుంటాయి. ఈ కొత్త టీజర్‌లోని ప్రతీ ఫ్రేములోనూ అదే కనిపించింది. ముఖ్యంగా అఘోరా అవతారంలో బాలయ్య దిష్టి తీసే షాట్ అయితే మాత్రం థియేటర్లో పూనకాలు తెప్పించేలా వుంది. అఖండ 2పై ఉన్న దిష్టంతా తీసినట్టు ఈ సీన్ సింబాలిక్‌గా అనుకోవొచ్చు. అఘోరా పాత్ర పైనే ఈ టీజర్ ఫోకస్ చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ జెట్ స్పీడులో సాగిపోయింది. విజువల్స్, కుంభమేళా షాట్స్, మంచు కొండల్లో తీసిన యాక్షన్ ఘట్టాలకు ఈ టీజర్‌లో పెద్ద పీట వేశారు. తమన్ సంగీతం ఎప్పటిలానే.. యాక్షన్ డోసు పెంచడానికి ఉపయోగపడిరది. మొత్తానికి ఈ కొత్త టీజర్‌తో అఖండ 2 హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments