top of page

పేదరికం లేని సమాజమే నా కోరిక

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 5 days ago
  • 2 min read
  • మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు

  • 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం

  • దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం

  • ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా

  • స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు

(సత్యంన్యూస్, నరసన్నపేట)

పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసరి ఆదాయం పెంచాలనేది తన ప్రధాన లక్ష్యమన్నారు.

సంపద సృష్టించి పేదవాళ్లకు పంచాలని, అప్ప్పుడే ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చిందంటే అది అధికారుల వల్లే సాధ్యమవుతుందని, ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పామని, పిల్లలే సంపద అని ఇవాళ చెబుతున్నానన్నారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే.. ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు.

గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం చూశామని, ప్రజల ఆస్తులన్నీ మార్చేసి గందరగోళం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టామన్నారు. భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నామని, అందుకోసం స్వచ్ఛమైన ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నామని, వ్యర్థాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని, ఒకప్పుడు తన పాదయాత్ర సమయంలో చెత్తే ఎక్కువ కనిపించేదని, ఆ తర్వాత చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశామన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా నేటి నుంచే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప’ ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజూ క్లీన్‌డ్రైవ్‌లు చేపట్టాలని, గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రంలో 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, డేటాసెంటర్లతో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెల్లడం కాదు.. పరిశ్రమలతో ఉత్తరాంధ్రకే వలసలు రావాలనే విధానాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలను అనుసరించడం ద్వారా పంచాయతీలకు జాతీయ అవార్డులు వచ్చాయని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నిర్వహించే శాఖలో జాతీయ స్థాయిలో 8 అవార్డులు వచ్చాయని, ఇకనుంచి మున్సిపాలిటీలకు కూడా స్వచ్ఛత అవార్డులు వస్తాయని ఆకాంక్షిస్తున్నానన్నారు.

జనవరి 2027న మడ్డువలస స్టేజ్`2 ప్రారంభిస్తామని, హిరమండలం ఎత్తిపోతలు అదే ఏడాది ఏప్రిల్‌లోను, వంశధార ఫేజ్ `2, స్టేజ్`2, జంఝావతి ప్రాజెక్టులు 2027 జులై నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నేరడి బ్యారేజ్ వచ్చే మÖడేళ్లలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా మార్చాలని భావిస్తున్నామని, కానీ కొందరు దీన్ని అడ్డుకుంటున్నారన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అంచనాల్లో ఫేక్ న్యూస్ ప్రచారం కేటగిరీలో ఏపీ రెండో స్థానంలో ఉందని, ఇది గత పాలకులు చేసిన విధ్వంశం లాంటిదేనన్నారు. గొడ్డలి పార్టీ ప్రజల ఆస్తుల్ని 22ఎలో పెట్టి అభద్రతను సృష్టిస్తే, తాము రక్షణగా నిలుస్తున్నామన్నారు. పలాసలో మనం ఎయిర్‌పోర్టు నిర్మించాలని ఆలోచిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంపైనో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుచేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. సమాజంలో మార్పు వస్తేనే 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ సాకారమవుతుందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక 17వ సారి స్వర్ణాంధ్ర`స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నానని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా భారత్ మారుతుందని, ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ లక్ష్యం సాధిస్తామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా చెత్తను వేరు చేయడానికి సెగ్రిగేషన్ ప్లాంట్లను ఏర్పాటుచేశామని, దానివల్ల డంపింగ్ యార్డులకు స్వస్తి పలకవచ్చన్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. ఐటీడీఏల ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్ కోటును ముఖ్యమంత్రి కొనుగోలు చేసి ధరించారు. సముద్రతీర ప్రాంతాల్లో పెంచే సీవీడ్ సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం హెల్మెట్ బ్యాంక్‌ను చూసి సీఎం అభినందించారు. హెల్మెట్ ధరించి బుల్లెట్ వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిరోహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, మున్సిపల్ శాఖామంత్రి నారాయణ, ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, ఎమ్మెల్యేలు బగ్గు రమణమÖర్తి, గొండు శంకర్, కూన రవికుమార్, ఎనఈఆర్, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, గౌతు శిరీష, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, మెట్ట సుజాత, జిల్లా పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, చౌదరి బాబ్జీ, ధనలక్ష్మి, మెండ దాసునాయుడు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page