పూరీ అంటేనే పడి లేచే కెరటం!!
- Guest Writer
- May 21
- 3 min read

ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ కావడానికి వెనుక ఎంతో కృషి ఉంటుందో అదేస్థాయిలో కష్టాలు, కన్నీళ్లు కూడా ఉంటాయి.. తాను వెళ్లే బాటలో పూలు ఉంటాయి.. ముళ్లు ఉంటాయి.. అనుకున్నవి జరగవు.. అనుకోని అవరోధాలు ఎదురవుతాయి.. కుంగిపోకూడదు.. జీవితం ఎప్పుడూ మనిషికి మరో ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది.. దానిని కనిపెట్టడంలోనే మనిషి ఎదుగుదల ఉంటుంది. అది నిత్య జీవితానికైనా.. సినీ జీవితానికైనా ఒకటే.. ఇప్పుడు మనకు తెలిసిన పూరీ జగన్నాధ్ ఈ స్థాయిలో ఉండడానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డారో.. ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో తెలుసా... తాను మొదట దర్శకత్వం వహించాల్సిన సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లి మరీ ఆగిపోయిందని మీకు తెలుసా.. ఆ తరువాత ఆయన ఎంత మధనపడ్డారో కదా.. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక సినీనటి పూరీకి తన మాటలతో ఎంతటి ధైర్యం నూరిపోశారో మీకు తెలుసా.. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన పూరీ ఎలా సక్సెస్ అయ్యారో తెలుసా.. తన జీవితంలో సక్సెస్‌లు రావచ్చు. ఫెయిల్యూర్స్ రావచ్చు.. కానీ పూరీ అంటేనే ఎప్పటికీ పడి లేచిన కెరటం!!
కృష్ణానగర్ లోని ఆర్టిస్ట్ పొట్టి వీరయ్య గారి ఎస్టీడీ బూత్‌కి ఫోన్ వచ్చింది, అక్కడ పూరీ జగన్నాథ్ అనే అబ్బాయి ఉన్నాడా అండి అని అవతలి వ్యక్తి అడిగాడు, ఆ ఎస్టీడీ బూత్ ఎదురుగా ఉన్న ఇంటిపైన బ్యాచిలర్స్ రూంలో పూరీ అనే కొత్త కుర్రాడొచ్చి నెలన్నర అయ్యింది
కొత్త కొత్త యాక్టర్లకు డైరెక్టర్లకు అడ్డా అప్పట్లో.. ఈ ఎస్టీడీ బూత్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గురూజీ ఆ ఫోన్ చేసింది నిర్మాత ఐబీకే మోహన్. వైజాగ్‌కు చెందిన ఈ ఐబీకే మోహన్ అనే ప్రొడ్యూసర్‌కు పూరీ జగన్నాథ్ కథ చెప్పి నాలుగు నెలలైంది. కథ ఓకే అయ్యింది. టైటిల్ రిజిస్టర్ చేయించడం కోసం ఆయన పూరీ జగన్నాథ్ ఇచ్చిన ఈ ఎస్టీడీ బూత్ నెంబర్‌కు ఫోన్ చేశాడు.
మేడపైన రూంలో ఉన్న పూరీకి ఫోన్ వచ్చిందన్న కబురు అందింది, పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడే ముత్తు సినిమా వచ్చి పెద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అందులో థిల్లాన థిల్లాన నా కసి కళ్ళ కూన పాట వైరల్ అయిపోయింది. మరోమాట లేకుండా మన టైటిల్ ‘‘థిల్లాన’’ అనేశాడు.
వెరైటీ టైటిల్స్ పెట్టడం అప్పట్నుంచే మొదలైందో ఏమోగానీ ఆ తరువాత పూరి టైటిల్స్ అన్నీ చాలా క్యాచీగా, డిఫరెంట్ గా ఉన్నాయి, థిల్లాన అనే ఒక టైటిల్‌తో సినిమా ఉందని చాలామందికి తెలియదు.
రౌడీ అన్నయ్య, నెంబర్ వన్, అమ్మ దొంగా, తెలుగు వీర లేవరా లాంటి సినిమాలతో దూసుకుపోతున్నారు సూపర్‌స్టార్ కృష్ణ, సెకండ్ ఇన్నింగ్స్ అనాలో కొత్త హీరో వచ్చాడనాలో సంప్రదాయం సినిమా హిట్టు యమలీలలో స్పెషల్ సాంగ్, వారసుడు, రాముడొచ్చాడులో స్పెషల్ క్యారెక్టర్లు కృష్ణ గారి శకం మళ్ళీ మొదలైన టైం అది...
కృష్ణ గారి గురించి గొప్పగా చెప్పడం అని కాదుగానీ ఆ టైంలో ఏ పెద్ద హీరోకు ఈ కథ చెప్పినా అనుభవం లేని కారణంగా రిజెక్ట్ చేసేవారు కానీ అసలు ఏమాత్రం అనుభవం లేని కొత్త దర్శకులకు కూడా పిలిచి మరీ అవకాశం ఇచ్చే రికార్డు ఉంది కృష్ణ గారికి, పూరీ చెప్పిన కథ ఆయనకు నచ్చింది.
పూరీ సంతోషానికి హద్దుల్లేవు, డైరెక్టర్ అవ్వాలన్న తన కల ఇంత తొందరగా నిజం అవుతుందని అనుకోలేదు, అయితే ఆ ఆనందం ఎక్కువరోజులు లేదు.
1996లో క్లాప్ కొట్టి, మూడు రోజుల ఫస్ట్ షెడ్యూల్ తరువాత సినిమా ఆగిపోయింది. దానికి కారణం అంతకుముందు సంవత్సరంలో ఐబీకే మోహన్ శోభన్‌బాబు గారితో దొరబాబు సినిమా తీశాడు, అది ఫ్లాప్ అవ్వడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వల్ల సినిమా ఆగిపోయింది.
దొరబాబు సినిమా ప్రసన్నాంజనేయ ఫిలింస్ బ్యానర్ మీద తీశారు, థిల్లాన వీరాంజనేయ ఫిలింస్ బ్యానర్ అని పేరు మార్చారు, దొరబాబు సినిమా బాగుంటుంది కానీ సరిగా ఆడలేదు, అందులో ప్రియారామన్ హీరోయిన్.
సినిమా ఆగిపోయిందని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. నాని జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ గుర్తుందా.. గురూజీ అలా ఫిలింనగర్ నుంచి కృష్ణానగర్ వరకూ ఎక్కడా ఒక్కచోట కూడా ఆగకుండా నడుచుకుంటూ వచ్చాడు. ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్నాడో ఏమో టీ తాగి ఆ గాజు గ్లాసులోంచి కృష్ణానగర్ మొత్తం స్కాన్ చేశాడు. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
అటువైపుగా సినిమా వెహికల్ ఒకటి వచ్చి ఆగింది, ‘‘కృష్ణ గారితో సినిమా ఆగిపోతే ఏంటి, నువ్వు కృష్ణ కొడుకుతో ఇండస్ట్రీ హిట్ కొడతావేమో ఎవరికి తెలుసు, బాధపడుతూ కూర్చుంటే పనులవ్వవు ఇక్కడ’’ ఈ మాట చెప్పింది. అప్పటికే పూరీ జగన్నాథ్‌కు పరిచయం ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ గారు.
ఏదో ఒక పాజిటివ్ మాట నోటినుంచి వచ్చిందంతే, ఆమె ఇలా జరుగుతుంది అని ఊహించి చెప్పలేదు కానీ మామూలుగానే కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్ పూరీ, అసలు పూరీ అంటేనే పడి లేచే కెరటం. కొన్ని వందల సినిమాల్లో నటించిన రమాప్రభ గారు ఆ మాట అనేసరికి పూరీ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయాడు.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి ప్రయత్నంగా కృష్ణ గారితో మొదలుపెట్టి ఆగిపోయిన థిల్లాన కథనే కాస్త మార్పులు చేర్పులు చేసి మోడ్రన్‌లుక్‌తో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీసిన బద్రి, అంటే బద్రి పవన్ కళ్యాణ్ గారు చేయకపోయి ఉంటే అది కృష్ణ గారి సినిమా అయ్యేది గురూజీ...
గమనించారో లేదో రమాప్రభ గారు చాలా క్యాజువల్‌గా అన్న మాటలు నిజం అయ్యాయి. ఆమె ఆ మాట అన్నప్పుడు ఇంకా రాజకుమారుడు సినిమానే రాలేదు. ఇది మరి డెస్టినీనో లేదంటే పూరీ కష్టమో తెలీదుగానీ కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతాయి గురూజీ...
తనను ఇంతవాడ్ని చేసిన కృష్ణానగర్‌ను పూరీ గారు మర్చిపోలేదు గురూజీ.. నేనింతే సినిమాలో కృష్ణానగర్ మీద ఒక పాట పెట్టాడు. సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే కృష్ణానగర్ మీద ఎంత ప్రేముంటే ఆ పాట పెడతాడు కదా.. కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమాలే లైఫ్ రా మామా లైఫ్ అంతా సినిమా మామా...!
మీరు కూడా ప్రయత్నించండి.. మీలోని దర్శకుడిని బయటకు తీయండి
విశ్వ టాకీస్
Commentaires