top of page

ప్రేక్షకులు మూడో కన్ను తెరవకుండా ప్రభాస్‌ కాపాడాడు

  • Guest Writer
  • Jun 28
  • 2 min read
ree

భారీ అంచనాలతో కన్నప్ప విడుదలైంది. మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా. దానికి తోడు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయకుమార్‌ కూడా ఉండటంతో అంచనాలు పెరిగాయి. ఇంతకీ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు హిట్‌ కొట్టాడా?

కన్నప్ప కథ తెలుగు వాళ్లకి తెలిసిందే. ఇతర భాషల వాళ్లకు కొత్తగా అనిపించవచ్చు. కాళహస్తీశ్వర మహత్మ్యం తరువాత 24 ఏళ్లకు కృష్ణంరాజు (1976) భక్త కన్నప్ప తీశారు.

గిరిజనుడైన (చెంచు) కన్నప్ప నాస్తికుడు. బలికోరే అమ్మవారు దేవత ఎలా అవుతుందనే వ్యక్తి. రాయి దేవుడు కాదని వాదించే తత్వం. ఈ కన్నప్ప శివభక్తుడిగా ఎలా మారాడు, కళ్లనే శివయ్య కోసం త్యాగం చేసే మహాభక్తి ఎలా ఆవహించింది? సింపుల్‌ ఇదే కథ. దీనికి సున్నితమైన ప్రేమ కథ, ద్వంద్వ యుద్ధం, దొంగ పీఠాధిపతి మోసం కలిపి బాపు ‘భక్త కన్నప్ప’ తీశారు.

ఇదే కథని ఇంకొంచెం పెంచి ఐదు తెగలుగా మార్చి కన్నప్ప తీశారు.

కథేంటి?

కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు. వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న తెగని మహదేవశాస్త్రి (మోహన్‌బాబు) శాసిస్తుంటారు. ఈ లింగాన్ని తస్కరించడానికి శక్తిమంతమైన సైన్యంతో కాల ముఖుడు అనే విలన్‌ ప్రయత్నిస్తే అక్కడి ఐదు తెగలు ఏకమై ఎదుర్కొంటాయి.

ఇందులో తిన్నడిని (విష్ణు) నాయకుడిగా ఎన్నుకుంటారు. అయితే అతను మారెమ్మ (అమ్మవారు)కు వ్యతిరేకి కావడంతో తండ్రే తిన్నడిని బహిష్కరిస్తాడు.

హీరోయిన్‌ నెమలి (ప్రీతి ముకుందన్‌) కూడా తిన్నడితో పాటు వెళ్లిపోతుంది.

ఇక్కడి వరకూ ప్రేమ, యుద్ధమైతే, మిగతా కథంతా శివయ్య లీలలు, భక్తి భావం. చివరి 40 నిమిషాలు కీలకం, అందరూ ఎదురు చూసే ప్రభాస్‌ వస్తాడు కాబట్టి.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

ఫస్టాఫ్‌ కొంచెం నిదానంగా వుంటుంది.

తెగల యుద్ధం, ప్రేమ కథలో బలమైన సన్నివేశాలు లేవు. కాకపోతే గ్రాఫిక్స్‌, న్యూజిలాండ్‌లో తీయడం వల్ల సినిమాలో ఫ్రెష్‌నెస్‌ కనిపిస్తూ వుంటుంది.

నిడివి 3 గంటలకి పైగా ఉండటం ఇబ్బంది.

ఫైట్‌ సీన్స్‌లో ఫొటోగ్రఫీ, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగున్నాయి. శివయ్య భక్తికి సంబంధించిన డైలాగ్‌లు చమక్కుమనిపించాయి.

బ్రహ్మానందం, సప్తగిరి ఉన్నా కామెడీ ఏమీలేదు. బహుశా పిలక వివాదంతో కట్‌ చేసినట్టున్నారు.

తెగ నాయకుడిగా శరత్‌కుమార్‌ బాగా నటించాడు. కానీ, డైలాగులు తమిళ యాసలోనే చెబుతాడు.

విష్ణు ఎలా నటించాడు?

శివుడిగా అక్షయకుమార్‌, పార్వతీగా కాజల్‌ మెప్పించారు. తెరపై మోహన్‌లాల్‌ కాసేపు, మోహన్‌బాబు కొంచెం ఎక్కువ సేపు కనిపిస్తారు.

కన్నప్పలో అందరూ అనుకున్నది విష్ణు ఈ పాత్రని మోయలేడని, ఎమోషన్‌ పలికించలేడని, సినిమాకి సాయంగా వచ్చిన ప్రభాస్‌ కూడా రక్షించలేడని. అయితే ఎమోషన్స్‌ సీన్స్‌లో విష్ణు బాగా నటించాడు, కన్నీళ్లు పెట్టించాడు. ప్రభాస్‌ గెస్ట్‌లా కాకుండా సినిమాకి ఆయువు పట్టులా నిలిచాడు. ప్రభాస్‌ ఎంట్రీ తర్వాతే ప్రేక్షకుల మూడ్‌ మారిపోతుంది. క్లైమాక్స్‌ , ప్రీ క్లైమాక్స్‌ సినిమాని నిలబెట్టాయి.

సొసైటీలో భక్తి పెరిగినప్పటికీ, భక్తి సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్లకి రప్పించడం కష్టం. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ విపరీతంగా పెంచుకోవడమే దీనికి మార్గం. కారణం ఏమంటే రాజమౌళి బాహుబలి తీసిన తర్వాత వ్యయం, తెలుగు స్టామినా పెరిగిపోయాయి. ఆ రేంజ్‌లో వుంటే తప్ప సంతృప్తి పడటంలేదు.

కన్నప్పలో గ్రాఫిక్స్‌ అక్కడక్కడ తేలిపోయినా, ఖర్చు తెరమీద కనిపించింది. విష్ణు ఓ మంచి సినిమాను అందివ్వాలనే ప్రయత్నం అయితే చేశాడు. కానీ, ఈ జనరేషన్‌ ప్రేక్షకులకి ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.

(బీబీసీ కోసం జీఆర్‌ మహర్షి)


సన్నని నడుములో శ్రియా లెహంగా హొయలు
ree

సినిమా రంగంలో తన నటనతో ఎంతగానో మెప్పించిన శ్రియా శరణ్‌... ఇప్పుడు ఫ్యాషన్‌ రంగంలోనూ అదరగొడుతోంది. ఇటీవల ప్రముఖ డిజైనర్‌ లేబుల్‌ కోసం ఆమె చేసిన ఫోటోషూట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మాలిబులో గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌ కలెక్షన్‌కి చెందిన ప్యాస్టెల్‌ బ్లూ కలర్‌ లెహంగా లుక్‌లో ఆమె ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా గ్లామర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చింది. మృదువైన రంగులు, ఆకర్షించే డిజైన్‌, శ్రియా నడుమున మెరిసే ఆ హావభావాలు... అన్నీ కలగలిపి ఈ లుక్‌ను అద్భుతంగా మార్చేశాయి.

ఈ లుక్‌లో కనిపించిన శ్రియా లెహంగా లైట్‌ బ్లూ షేడ్స్‌తో నాజూకుగా ఉంది. మెరుస్తున్న బ్లౌజు డిజైన్‌, మ్యాచ్‌ అయిన స్కర్ట్‌పై ఉన్న నాజూకు పువ్వుల ఎంబ్రాయిడరీ... ఆమెను ఒక ఫెయిరీటేల్‌ ప్రిన్సెస్‌లా చూపించింది. ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న జుమ్కాలు, మృదువైన హెయిర్‌స్టైల్‌ మరింత అందాన్ని జోడిరచాయి. సోషల్‌ మీడియాలో ఈ లుక్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. శ్రియా శరణ్‌ కెరీర్‌ విషయానికి వస్తే, ఆమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాదు, బాలీవుడ్‌లోను తన ప్రత్యేకతను చాటుకుంది. ‘శివాజీ’లో రజనీకాంత్‌కు జోడిగా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ సరసన, అలాగే హిందీలో ‘దృశ్యం’ సిరీస్‌లో అజయ్‌ దేవగన్‌కి భార్యగా ఆకట్టుకున్నారు. ఇటీవలి కాలంలోనూ ఆమె ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి పాన్‌ఇండియా ప్రాజెక్టుల్లోనూ కనిపిస్తూ, స్టార్డమ్‌ను కొనసాగిస్తూ వస్తోంది.

తన కెరీర్‌కి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నా కూడా, శ్రియా సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండి... ప్రతి లుక్‌తోనూ ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది. ఆమె గ్లామర్‌ను చూస్తే వయస్సు కేవలం ఒక నెంబర్‌ అనిపిస్తుంది. ఈ ఫోటోషూట్‌లోనూ ఆమె కామ్‌బినేషన్‌ ఫియర్‌లెస్‌ ఫ్యాషన్‌ను స్పష్టంగా చూపించింది. ప్రస్తుతం శ్రియా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు యాడ్స్‌, ఫ్యాషన్‌ ఫోటోషూట్‌లతోనూ బిజీగా ఉంది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page