top of page

ప్రియా వారియర్‌.. దేవకన్యలా హై గ్లామర్‌ ట్రీట్‌

  • Writer: ADMIN
    ADMIN
  • Aug 27, 2024
  • 1 min read

ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. సోషల్‌ మీడియాలో ఎంతగా క్రేజ్‌ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఒరు ఆధార్‌ లవ్‌’ అనే చిన్న మలయాళ చిత్రం నుండి సోషల్‌ మీడియాలో స్టార్‌ అయిపోయిన ఈ బ్యూటీకి అప్పటి నుండి మంచి క్రేజ్‌ అందుతోంది. ఓ సింపుల్‌ వింక్‌ తో కుర్రకారుని ఆకట్టుకుని ఒక్క స్మైల్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియా, ఇప్పటివరకు అదే క్యూట్‌ అండ్‌ గ్లామర్‌ లుక్‌ని కొనసాగిస్తూ ట్రెండిరగ్‌ లో ఉంది.

అదే కోవలో భాగంగా, ప్రియా పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఫోటోషూట్‌ లతో కనిపించే గ్లామర్‌ కే ఎక్కువగా క్రేజ్‌ అందుతోంది. లేటెస్ట్‌ గా ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసిన ఫోటో సైతం నెట్టింట్లో వైరల్‌ గా మారింది. ఈ గ్రీన్‌ కలర్‌ లెహంగా-చోళి డ్రెస్‌ లో ఆమె ఇచ్చిన స్టిల్‌ సూపర్బ్‌ అనేలా ఉంది. ఆ లుక్‌లో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఒక విధంగా స్వర్గం నుండి దిగిన దేవతలా కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె ఇచ్చిన పొజెస్‌ కళ్లను కట్టిపడేస్తున్నాయి.

పూర్తిగా కళాత్మకంగా అద్భుతమైన విజువల్స్‌ తో ఆమె ఫోటో స్టైలింగ్‌ ప్రత్యేక గుర్తింపుని తెచ్చాయి. ఈ ఫోటోకి కేవలం కొన్ని గంటల్లోనే లక్షలలో లైకులు మరియు వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ప్రియా మాత్రమే కాదు, ప్రస్తుతం సోషల్‌ మీడియా మాధ్యమాలు కూడా ఇలాంటి స్టార్లకు ఎంతో సహాయపడుతున్నాయి. మలయాళ, తెలుగు, హిందీ మరియు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ ను కొనసాగిస్తున్న ప్రియా, ఆ మధ్య ‘బ్రో’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ మరియు సాయి తేజ్‌ లతో కలిసి నటించింది. ఆశించినంత గుర్తింపు రాకపోయినా, సోషల్‌ మీడియా వేదికగా తన గ్లామర్‌ మరియు ఫ్యాషన్‌ స్టైల్‌ తో అభిమానులను అలరిస్తూనే ఉంది. ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ తో పాటు, ఫోటోషూట్స్‌ లో కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page