పక్క రాష్ట్రాల బాట పట్టిన హాట్ బ్యూటీ!
- Guest Writer
- Dec 17, 2025
- 2 min read

సక్సెస్ తర్వాత వెనుదిరగడం అన్నది ఏ నటి విషయంలోనూ పెద్దగా జరగదు. హిట్ ఇచ్చిన కిక్ లో మరో నాలుగు ప్రాజెక్ట్ లకు టపీ టపీ సైన్ చేస్తుంది. అడ్వాన్సులు అందుకుంటుంది. అవిసెట్స్ లో ఉండగానే పరభాషల వైపు ఆసక్తి చూపిస్తుంది. కానీ మెహరీన్ పిర్జాదా విషయంలో మాత్రం అలాంటి సన్నివేశం చోటు చేసుకోలేదు. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’తో వెండి తెరకు పరిచయమైన మెహరీన్ కు తొలి సినిమా తేడా కొట్టినా? కెరీర్‌లో చెప్పుకో దగ్గ సక్సెస్ లు చాలా ఉన్నాయి. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ తో బ్యాక్ టూ బ్యాక్ సక్సస్‌లు అందుకుంది.
200 కోట్ల వసూళ్ల ప్రాంచైజీలో:
మధ్యలో వరుసగా కొన్ని పరాజయాలు ఎదురైనా గత రెండు విజయాలు మళ్లీ ‘ఎఫ్ 2’ లో ఛాన్స్‌కు బీజం వేసాయి. అందులో వరుణ్ తేజ్‌కు జోడీగా నటించి గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇదే ఊపులో ఆరేడు సినిమాలు చేసింది. వాటిలో ‘మంచి రోజులొచ్చాయి’ ఒక్కటే సక్సెస్ అయింది. ఆ వెంటనే ‘ఎఫ్`2’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎఫ్`3’లోనూ ఛాన్స్ అందుకుంది. ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇదీ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ విజయం తర్వాత మెహరీన్ అనూహ్యంగా మాయమైంది.
వైఫల్యంతో కాదు సక్సస్ తో:
ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత సినిమా చేయని నటిగా మిగిలిపోయింది. చాలా మంది వైఫల్యంతో వెను దిరుగుతారు. కానీ మెహరీన్ మాత్రం సక్సెస్ తో వెనుదిరిగింది. మరి అవకాశాలు వచ్చినా తానే నో చెప్పిందా? లేక ఛాన్సులు రాక ప్రత్యామ్నాయం చూసుకుందా? అన్నది తెలియదు. ‘ఎఫ్ 3’ తర్వాత ‘స్పార్క్ లైఫ్’ అనే ఓ చిన్న చిత్రం చేసింది. కానీ అది మెహరీన్ ఇమేజ్ తగ్గ చిత్రం కాదు. ఆ సినిమా గురించి జనాలకు కూడా తెలియదు. ఈ ఏడాది ‘ఇంద్ర’అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
శాండిల్‌వుడ్‌లో ఎంట్రీ:
ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో అమ్మడిప్పుడు కన్నడలో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడిరది. ‘నీ సిగు వెరుగ్’ అనే చిత్రంలో నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమై నెలలు గడుస్తోంది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. కొత్త ఏడాది ఆ సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకొస్తుందేమో చూడాలి. మరి ఇదే ఏడాది మళ్లీ టాలీవుడ్ కంబ్యాక్ ప్రయత్నాలు చేస్తుందా? అన్నది చూడాలి.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
లక్కుంటే చాలు.. ఫ్లాపులతో పనేంటి?

ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లకు. వరుసగా రెండు ఫ్లాపులు తగిలితే చాలు.. వాళ్ల మెడలో ఐరెన్ లెగ్ అనే దండ వేసేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆ ట్యాగ్ భాగశ్రీ బోర్సే దగ్గర ఉంది. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, కాంత సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు సొంతం చేసుకొంది. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. ఆ సినిమా కూడా భాగ్యశ్రీకి తొలి హిట్ అందించలేకపోయింది. అయితే ఆమె అవకాశాలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఏదో ఓ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తూనే ఉంది. స్వప్నదత్ ఇప్పుడు ఓ కొత్త సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంచుకొంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా. కథలో హీరోయిన్‌ది కీలక పాత్ర. అందుకు అభినయం ఉన్న హీరోయిన్ కావాలి. సమంత, రష్మిక లాంటి పలు పేర్లు పరిశీలించి, చివరికి భాగ్యశ్రీకి ఓటేశారు. ఈ చిత్రానికి ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా’ అనే పేరు ఖాయం చేశారు. అధికారిక ప్రకటన రావాల్సివుంది. మద్యపాన నిషేదం చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రీ కూతుర్ల అనుబంధం ఈ కథకు బలం. తండ్రిగా ఓ పేరున్న నటుడు కనిపించే అవకాశం ఉంది.
సాధారణంగా వరుసగా ఫ్లాపులు తింటుంటే.. ఆ హీరోయిన్ జోలికి వెళ్లడానికి దర్శక నిర్మాతలు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. కానీ భాగ్యశ్రీ విషయంలో ఈ ట్రాక్ రికార్డు అస్సలు పట్టించుకోవడం లేదు. గ్లామర్ విషయంలో భాగ్యశ్రీకి తిరుగులేదు. నటన కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో చేస్తుంది. ‘కాంత’ సినిమా ఫ్లాప్ అయినా, అందులో భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అందుకే మళ్లీ మళ్లీ ఆమెకు అవకాశాలు అందుతూనే ఉన్నాయి.
-తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments