top of page

పసిపిల్లలతో ఏంట్రా ఇది... రీల్‌ తగలబెట్టేస్తా...!

  • Guest Writer
  • Jun 18, 2025
  • 3 min read

బాపు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ గారి శ్రీనాథకవిసార్వభౌమ సినిమా షూటింగ్‌ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్న రోజులు.. తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్‌కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య... అదే స్టూడియోలో ఇంకో సెట్లో ఇంద్రజ హీరోయిన్‌గా పరిచయమయిన జంతర్‌ మంతర్‌ షూటింగ్‌ కూడా జరుగుతుంది..

ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్‌ చూడడానికొచ్చిన బాలయ్యకి జంతర్‌ మంతర్‌ షూటింగ్‌ జరుగుతున్న సెట్‌ పక్కగా వెళ్తుండగా ఒక చిన్నకుర్రోడు లైట్‌ పట్టుకుని కనిపించాడు, ఎంతసేప ట్నుంచి పట్టుకుని ఉన్నాడో దాని బరువుమోయలేకనో అలసిపోయి కళ్ళుతిరిగిపడిపోయేలా కనిపించాడు..

షాట్‌ మధ్యలో ఉంది.. వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్‌ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్‌ పట్టుకున్నాడు..

ఇది గమనించిన డైరెక్టర్‌ భరత్‌ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్‌ చేతుల్లోకి తీసుకున్నాడు, షాట్‌ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్‌ ని ‘‘పసిపిల్లలతో ఏంట్రా ఇది.. రీల్‌ తగలబెట్టేస్తా’’ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు...

మామూలుగానే బక్క చిక్కి ఉన్న ఆ పిల్లాడు, పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో నీరసంగా కనిపించాడు, ఆ పిల్లాడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నంపెట్టి వాళ్ళ తల్లితండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు...

ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్‌ తిరిగివచ్చాడు, పక్షవాతంతో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు, వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించమని వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానే భరిస్తానని చెప్పి, ఆ కుర్రోడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్‌ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు...

కష్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు, ఇప్పటికీ జూన్‌ 10 వ తారీకు ఈ భూమిమీద ఎక్కడున్నా దగ్గిర్లోని హాస్పిటల్‌ కి వెళ్ళి రక్తదానం చేస్తుంటాడు...

బాలయ్య గురించి ఇవేవీ రాయరు... ఎందుకంటే ఇవేవీ బాలయ్య ప్రచారంకోసం బాకా కొట్టుకోడు, ఎక్కడా చెప్పుకోడు, పబ్లిసిటీ పిచ్చి లేని పవర్‌ ఫుల్‌ మాన్‌, తనకి తెలిసిన సూత్రం ఒక్కటే గురూజీ ‘‘మానవసేవే మాధవ సేవ’’

టాప్‌ హీరో సినిమా టైం లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది గురూజీ, మొత్తం సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది గుమ్మడి కాయ కొట్టేశారు, ఆ సినిమాలో చేసిన జూనియర్‌ ఆర్టిస్టులందరికీ పట్టు బట్టలు పంపించారు బాలకృష్ణ గారు, ‘‘దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు, పేద కళాకారులకు పట్టు బట్టలు ఇవ్వడం గొప్ప శుభ పరిణామం’’ అని ఒక జర్నలిస్టు ఆ ఘటనను తనదైన శైలిలో సితార పత్రికలో రాశారు...

బాలయ్యకు కల్మషం ఉండదు, మనసులో ఒకటి బయటొకటి అనే మాటే లేదు, బోళా మనిషి, నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం, ముక్కు సూటి మనిషి, తనకు తప్పు అనిపిస్తే స్పాట్‌ జడ్జిమెంట్‌ ఉంటుంది, బాలయ్యంటే బాలయ్యే మరోమాట లేదు, మనిషేమో అగ్నిపర్వతం మనసేమో మంచు పర్వతం, అభిమానుల ముద్దుల బాలయ్య, బంగారుకొండ మా బాలయ్య బాబు...నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి బిలేటెడ్‌గా జన్మదిన శుభాకాంక్షలు..

ఇషాగుప్తా బికినీ బీచ్‌లుక్‌

బాలీవుడ్‌ అందాల భామ ఇషా గుప్తా బాలీవుడ్‌ అందాల భామ ఇషా గుప్తా వరుసగా సీక్వెల్‌ మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంది. మర్డర్‌ 4, వెల్‌ కం 3, హేరా ఫేరి 3 లాంటి క్రేజీ సీక్వెల్స్‌ లో నటిస్తోంది. వీటితో పాటు ‘‘దేశీ మ్యాజిక్‌’’ అనే మరో ఇంట్రెస్టింగ్‌ రొమాంటిక్‌ మూవీకి సంతకం చేసింది. ఇటీవల గ్యాప్‌ ని ఫిల్‌ చేస్తూ, ఈ భామ భారీ పునరాగమనానికి సిద్ధమవుతోంది. ఇంతలోనే బికినీ బీచ్‌ లో ఇషాజీ అగ్గి రాజేసింది. తాజాగా షేర్‌ చేసిన ఫోటోగ్రాఫ్‌ లో టోన్డ్‌ బాడీని ప్రెజెంట్‌ చేసింది ఇషా. ఫ్లోరల్‌ డిజైన్‌ స్విమ్‌సూట్‌ లో ఇషా టూ హాలి గా కనిపిస్తోంది. తన సోగ కళ్లకు అందమైన గాగుల్స్‌ ని కూడా ధరించింది. నేపథ్యంలో దూరంగా బులుగు సముద్రం, అందులో బోటింగ్‌ కూడా హైలైట్‌ గా కనిపిస్తోంది.

సముద్ర గాలుల్ని ఆస్వాధిస్తూ ఈ లేటెస్ట్‌ ఫోటోషూట్‌లో పాల్గొంది టాప్‌ మోడల్‌ కం నటి ఇషా. ఇక ఇదే బీచ్‌ వెకేషన్‌ లో ఇషా ఇంతకుముందు బ్లాక్‌ కలర్‌ డిజైనర్‌ బికినీలోను దర్శనమిచ్చింది. ఒక ప్రశాంతమైన క్షణం ఈషా పడవ డెక్‌పై విశ్రాంతి తీసుకుంటూ బికినీలో ఫోజులిచ్చిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఇషాజీ ఫోటోషూట్‌ ఇంటర్నెట్‌ ని మరిగిస్తోంది. వరుస చిత్రాలతో దూకుడు పెంచేస్తున్న ఈ భామ, కొంత గ్యాప్‌ తర్వాత గ్రేట్‌ కంబ్యాక్‌ ని ఆశిస్తోంది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

రాజా సాబ్‌’ మూడున్నర గంటలా?

రాజాసాబ్‌ టీజర్‌ వచ్చింది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ప్రభాస్‌ చూడ్డానికి బాగున్నాడు. విజువల్స్‌ కూడా అదిరాయి. ఈ టీజర్‌ తో ఈ సినిమాపై నమ్మకాలు, అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ టీజర్‌ వేడుకలో రాజాసాబ్‌ లెంగ్త్‌ గురించి దర్శకుడు మారుతి నోరు జారాడు. ‘సినిమా మూడున్నర గంటలు’ అంటూ చెప్పేశాడు. ఆ తరవాత.. ‘మూడు గంటలే’ అని సర్దాడు. ఈ సినిమాకు సంబంధించి చాలా కంటెంట్‌ తీశాడు మారుతి. ఇప్పటికే మూడు గంటల సినిమా తయారైంది. తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. పాటలు బాలెన్స్‌. అవన్నీ కలిపితే మూడున్నర గంటలు గ్యారెంటీ. దాన్ని ఎంత ట్రిమ్‌ చేసినా మూడు గంటల లెక్క తేలుతుంది. ఓ దశలో ఫుటేజ్‌ చూసిన నిర్మాత ఈ సినిమాని రెండు భాగాలుగా మారిస్తే ఎలా ఉంటుంది? అనే ఐడియా ఇచ్చార్ట. కానీ మారుతి ఒప్పుకోలేదు. ఎందుకంటే రాజాసాబ్‌ 2 కి సంబంధించిన ఐడియా మారుతి దగ్గర రెడీగా వుంది. పార్ట్‌ 2కి చాలా డిఫరెంట్‌ గా ట్రై చేయబోతున్నాడని తెలుస్తోంది. అందుకే మారుతి ఒప్పుకోలేదు. ఒక్కటి మాత్రం నిజం. లెంగ్త్‌ పరంగా రాజాసాబ్‌ పెద్దదే. పార్ట్‌ 2 కూడా ఉంటుంది. పార్ట్‌ 2 హాలీవుడ్‌ రేంజ్‌లో తీస్తామని ఇప్పటికే నిర్మాత విశ్వ ప్రసాద్‌ ప్రకటించేశారు.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page