top of page

బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 ఫైనల్‌ గెస్ట్‌ ఎవరు..?

  • Guest Writer
  • Dec 18, 2025
  • 2 min read

బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 ఫైనల్‌ ఎపిసోడ్‌ వచ్చే ఆదివారం అంటే డిసెంబర్‌ 21న జరుగుతుంది. దాదాపు 105 రోజుల పాటు హౌస్‌ లో ఉన్న కంటెస్టెంట్స్‌ తమ స్థానాలు తెలుసుకునే ఛాన్స్‌ ఉంటుంది. టాప్‌ 5లో ఎవరు ముందు ఎవరు వెనుక అనే సమీకరణాలు ఇప్పటికే చాలా వినిపిస్తున్నాయి. విజేతగా ఎవరు ప్రేక్షకుల చేత గెలిపించబడతారో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఐతే బిగ్‌ బాస్‌ సీజన్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌కి హోస్ట్‌ నాగార్జునతోపాటు మరో చీఫ్‌గెస్ట్‌ కూడా వస్తుంటారు. గత రెండు సీజన్లుగా కింగ్‌ నాగార్జునే విజేతని అనౌన్స్‌ చేస్తున్నారు.

ఐతే ఈసారి అలా కాకుండా ఒక స్టార్‌ హీరోని బిగ్‌బాస్‌ సీజన్‌`9 ఫైనల్‌కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగు సంక్రాంతికి భారీ సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి. వాటి ప్రమోషన్స్‌కి తగినట్టుగానే ఇలా ఆ మూవీ ప్రమోషన్‌ తో పాటు ఆ స్టార్‌ బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ గెస్ట్‌గా వస్తారని టాక్‌. ఐతే సంక్రాంతి సినిమా రిలీజ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌ ఉంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాజా సాబ్‌ ఉంది.

ఈ రెండిటిలో రాజాసాబ్‌ పాన్‌ ఇండియా రిలీజ్‌ కాబట్టి ప్రభాస్‌ని గెస్ట్‌గా పిలిస్తే పాన్‌ ఇండియా లెవెల్‌లో బిగ్‌బాస్‌ సీజన్‌`9 ఫైనల్‌ ఎపిసోడ్‌ క్రేజ్‌ తెచ్చుకుంటుందని బిగ్‌బాస్‌ టీం ఆలోచిస్తుందట. ప్రభాస్‌ అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. చిరంజీవి ఆల్రెడీ బిగ్‌బాస్‌ సీజన్‌`4 ఫైనల్‌ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు. మరోసారి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక సర్‌ ప్రైజ్‌ అతిథి.. బిగ్‌బాస్‌ సీజన్‌`9లో ఫైనల్‌ గెస్ట్‌ ఎవరన్నది డిస్కషన్‌ సోషల్‌ మీడియాలో జరుగుతుంది. గెస్ట్‌లు ఎవరు లేకుండా నాగార్జున సింగిల్‌ హ్యాండ్‌తో అయినా చేస్తారు. కానీ ఎవరో ఒక సర్‌ప్రైజ్‌ అతిథి ఉంటే ఆడియన్స్‌కి మరింత ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుందని అంటున్నారు. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌`9లో విన్నింగ్‌ రేసులో ఇద్దరు కంటెస్టెంట్స్‌ దూసుకెళ్తున్నారు. ఐతే అనూహ్యంగా ఈ వారం డీమాన్‌ పవన్‌ ఓటింగ్‌ ఒక రేంజ్‌లో పెరిగింది. మొన్నటిదాకా టాప్‌`4లో ఉన్న అతను ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేలా ఉన్నాడు. కళ్యాణ్‌, తనూజ మధ్య టైటిల్‌ ఫైట్‌ రసవత్తరంగా నడుస్తుంది. దాదాపు ఈ ఇద్దరిలోనే ఒకరు ఈ సీజన్‌ విన్నర్‌ ఉండొచ్చని చెబుతున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌`9 ఫైనల్‌ ఎపిసోడ్‌ కోసం భారీ ప్లాన్స్‌ చేస్తున్నారు బిగ్‌ బాస్‌ టీం. దానితో పాటు ఫైనల్‌ ఎపిసోడ్స్‌ లో చాలామంది గెస్ట్‌ లు సర్‌ ప్రైజ్‌ చేస్తారని తెలుస్తుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

ఏఐ వైపరిత్యం.. శ్రీలీల ఆవేదన


ఏఐ టెక్నాలజీని సోషల్‌ మీడియాలో కొందరు అశ్లీలతకు, అవమానానికి, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడానికి వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలని టార్గెట్‌ చేస్తున్నారు. ఫేక్‌ ఫోటోలు, వీడియో కంటెంట్‌ లతో ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా శ్రీలీల ఏఐ ఫేక్‌ కంటెంట్‌ బారిన పడిరది. ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని సోషల్‌మీడియా వినియోగిస్తున్న వారందరినీ అభ్యర్థించారు. ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది.

సోషల్‌మీడియా యూజర్స్‌ కి చేతులు జోడిరచి అభ్యర్థిస్తున్నా. ఏఐతో స ృష్టించే చెత్తకు సపోర్ట్‌ చేయొద్దు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించండి. ప్రతి వారికి రక్షణతో కూడిన వాతావరణం ఉందన్న నమ్మకాన్ని ఇవ్వాలి. నాకున్న బిజీ షెడ్యూల్స్‌ కారణంగా ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నా. అలాంటి కొన్నింటిని నా శ్రేయోభిలాషులు నా ద ృష్టికి తీసుకొచ్చారు. చాలా విషయాలను పెద్దగా పట్టించుకోను. నా ద ృష్టికి వచ్చిన ఈ విషయం మాత్రం నన్ను బాధించింది. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం చూస్తున్నా. మాకు అండగా నిలబడమని అభ్యర్థిస్తున్నా. ఇక్కడి నుంచి అధికారులు తగిన యాక్షన్‌ తీసుకుంటారు’అని పోస్ట్‌ చేసింది.

నిజానికి ఇది ఒక్క శ్రీలీల సమస్యగా కాదు.. వ్యక్తిగత హక్కులు, గౌరవం, డిజిటల్‌ భద్రతకు సంబంధించిన సమాజపు బాధ్యతగా మారాల్సిన అంశం. టెక్నాలజీ మనల్ని ముందుకు నడిపించాలి గానీ మనుషుల్ని కించపరచడానికి కాదు. ఏఐ, సోషల్‌ మీడియాతో అదుÄతాేలు చేయొచ్చు. కానీ కొందరు మాత్రం ఇలాంటి చెత్తపనులకు వాడుకొని ఎదుటివారిని హర్ట్‌ చేయడం బాధాకరం.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page