top of page

బేబమ్మ.. లుక్స్ అదుర్స్!

  • Guest Writer
  • 2 hours ago
  • 3 min read

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను ఉపయోగిస్తూ తమ అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే.. మరొకవైపు అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువలో ఉండడానికి గ్లామర్ వలకబోస్తూ ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తూ మరీ.. వాటిని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న బేబమ్మ అలియాస్ కృతి శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన కృతి శెట్టి.. తెలుగులో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా తొలి ప్రయత్నంలో చేసిన ‘ఉప్పెన’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో తన పాత్రలో లీనం అయిపోయి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించారు. పైగా దర్శకుడికి, ఈ నటీనటులు ఇద్దరికీ కూడా ఈ సినిమా మొదటి సినిమా కావడం గమనార్హం . మొదటి సినిమానే అయినా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. వంద కోట్ల క్లబ్లో చేరి మెప్పించారు. పైగా ఈ చిత్రానికి బోలెడు అవార్డులు కూడా లభించాయి.

ఈ సినిమా ఇచ్చిన ఫలితం ఈమెకు వరుసగా అవకాశాలు అందించింది. అలా నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య, నాగార్జున కలయికలో వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే, అన్నగారు వస్తారు ఇలా పలు చిత్రాలు చేసింది. కానీ ఏవి కూడా మంచి విజయాన్ని అందించలేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్లో బిజీ అయిపోయిన ఈమె.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి మీడియాలో బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బేబీ పింక్ కలర్‌లో లెహంగా ధరించి.. తన అందాలతో మెస్మరైజ్ చేసింది. భిన్నమైన ఫోటోషూట్ తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం పింక్ కలర్ లెహంగాలో తన మేని ఛాయను మిళితం చేస్తూ.. షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కృతిశెట్టి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..ప్రదీప్ రంగనాథన్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటించిన ఈమె.. జయంరవి ప్రధాన పాత్రలో నటిస్తున్న జీనీ అనే భారీ బడ్జెట్లో భాగమైంది. అలాగే టోవినో థామస్ సరసన మలయాళ చిత్రం ఏ ఆర్ ఎం లో కూడా నటిస్తోంది. అంతేకాదు మరికొన్ని తమిళ , తెలుగు చిత్రాలు లైన్లో పెట్టినట్లు సమాచారం.

-తుపాకి.కామ్ సౌజన్యంతో...

కొత్త కాంట్రవర్సీ.. సరస్వతీ పుత్ర

అనంత శ్రీరామ్ పేరు ఈమధ్య వివాదాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నామధ్య ‘కల్కి’ సినిమాపై కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల కోసం పురాణాల్ని, పురాణ పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారని మండి పడ్డారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అనంత శ్రీరామ్ పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు ‘సరస్వతీ పుత్ర’పై కొత్త కాంట్రవర్సీ లేవనెత్తారు.

తెలుగు360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో `సరస్వతి పుత్ర` అని సంబోధించినప్పుడు ‘నేను సరస్వతీ పుత్రుడ్ని కాదు.. పావనీ పుత్రుడ్ని’ అని ఉటంకించారు. సరస్వతీ పుత్ర అని పిలిపించుకోవడం అంత సులభం కాదని, సరస్వతిని మించిన ప్రతిభాపాటవాలు ఉండాలని, శ్రీశ్రీ లాంటి ఒకరో ఇద్దరో ఇలాంటి పిలుపుకి అర్హులని పేర్కొన్నారు. దాంతో సరస్వతీ పుత్ర అనే బిరుదు పై చర్చ మొదలైంది.

టాలీవుడ్ లో రామజోగయ్య శాస్త్రిని ‘సరస్వతీ పుత్ర’ అని పిలుచుకొంటుంటారు. సినిమాల్లో టైటిల్ కార్డ్ వేసినప్పుడు కూడా సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అనే పేరు కనిపిస్తుంది. ఇప్పుడు అనంత శ్రీరామ్ కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ, ఇలా వ్యాఖ్యానించారన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. రామజోగయ్య తల్లి పేరు సరస్వతమ్మ. అందుకే ఆయన సరస్వతీ పుత్ర అని టైటిల్ కార్డు వేసుకొంటారు. ఈ విషయంలో అనంత శ్రీరామ్ అభ్యంతరాలు ఏమిటో అర్థం కావడం లేదు. భాషపై పట్టు, మమకారం, సాధికారికత ఉన్నవాళ్లని సరస్వతి పుత్రుడు అని పిలుచుకొంటారు. ఆ లెక్కన చూసినా రామజోగయ్య అర్హుడే అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...

రూ.600 కోట్ల సినిమా.. ఆ రేంజ్ కనిపిస్తుందా?

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా అట్లీ సినిమాకు సంబంధించి ఓ టీజర్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ఆ రోజునే అధికారికంగా ప్రకటిస్తారు.

నిజానికి ఏప్రిల్ 8న కేవలం ఫస్ట్ లుక్ తో టైటిల్ రివీల్ చేద్దామనుకొన్నారు. కానీ.. అభిమానులకు ఇంకాస్త జోష్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు టీజర్ కట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ టీజర్ కూడా సినిమా స్థాయిని, కాన్సెప్ట్ ని, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఉండబోతోందని సమాచారం. దాదాపు రూ.600 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ రేంజ్, క్వాలిటీ ఈ టీజర్ లో కనిపించేలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న సినిమా ఇది. అన్ని భాషల్లోనూ టీజర్ కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగానే ఉండబోతోందని టాక్. టీజర్ లో డైలాగులు ఏం ఉండకపోవొచ్చు. కాకపోతే ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉండబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈమధ్య పెద్ద సినిమాలన్నీ లీకుల బారీన పడ్డాయి. చిత్రబృందం రివీల్ చేయకముందే.. టైటిల్, హీరో క్యారెక్టరైజేషన్, కథాంశం.. వీటికి సంబంధించిన అంశాలన్నీ ముందే లీక్ అయిపోతున్నాయి. రాజమౌళి సినిమాకే లీకుల గోల తప్పలేదు. కానీ బన్నీ సినిమాకు సంబంధించి ఒక్క విషయం కూడా లీక్ అవ్వలేదు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకొంటోంది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ అంతా ముంబైలో జరుగుతోంది. అందుకే ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. టైటిల్ ఏమిటి అనే విషయంలోనూ ఎవరికీ ఎలాంటి క్లూ లేదు. ఏప్రిల్ 8 వరకూ ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఆరోజు విడుదలైన టీజర్ ని బట్టి, అందులోని విజువల్స్ ని బట్టి ఈ సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page