top of page

బాలయ్య దేశం మొత్తం గర్జించబోతాడా?

  • Guest Writer
  • 12 hours ago
  • 2 min read

ree

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్‌ మాస్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ చుట్టూ అఖండ స్థాయిలో హైప్‌ నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బజ్‌ ఆకాశాన్ని తాకుతుంటే, ఇప్పుడు బోయపాటి-బాలయ్య టీమ్‌ కళ్ళు హిందీ బెల్ట్‌ మార్కెట్‌పై పడ్డాయి! మామూలుగానే బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటేనే మాస్‌ ఆడియెన్స్‌కు ఫైర్‌స్టార్ట్‌. అయితే ఈసారి క్రేజ్‌ అంతా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు. నార్త్‌ ఇండియా వరకూ విస్తరించి అఖండ స్థాయిలో పేలుతోంది!

నార్త్‌ ఆడియెన్స్‌లో ‘డివోషనల్‌ యాక్షన్‌’ ఫీవర్‌ ఈ మధ్యన నార్త్‌లో హిందీ బెల్ట్‌లో ఒక స్పష్టమైన ట్రెండ్‌ కనిపిస్తోంది: ఆధ్యాత్మిక థీమ్‌ G ఆకర్షణీయమైన మాస్‌ యాక్షన్‌ R భారీ కలెక్షన్స్‌. కార్తికేయ 2 కాంతారా హనుమాన్‌ అఖండ మిరాయ్‌ ఈ చిత్రాల్లో కామన్‌గా కనిపించిన విషయం భక్తి, శివశక్తి, పురాణ/ఆధ్యాత్మిక ఎలిమెంట్లు. ఇవి నార్త్‌ ఆడియెన్స్‌ని మామూలుగాకాదు.. ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాయి. ‘అఖండ’ మొదటి భాగం కూడా ఇదే డివైన్‌ - మాస్‌ టెంప్లేట్‌ను ఫాలో అయ్యింది. అందుకే హిందీలో డబ్బింగ్‌ వెర్షన్‌ దుమ్ము రేపింది. ఈ నేపధ్యంలో ‘అఖండ 2’ పాన్‌ ఇండియా మార్కెట్‌లో భారీగా పేలడానికి ఇప్పుడే సరైన టైమ్‌ గా భావిస్తోంది టీమ్‌!

దాంతో ఈసారి ‘అఖండ 2’ను పాన్‌-ఇండియా రేంజ్‌లో బిగ్‌ హిట్టు చేయాలన్న టార్గెట్‌తో టీమ్‌ ముందుకు వెళ్తోంది. ప్రత్యేకంగా నార్త్‌ ఇండియా మార్కెట్‌ (హిందీ బెల్ట్‌)లో ఈ సినిమా భారీగా కలెక్ట్‌ చేస్తుందన్న నమ్మకంతో ప్రొడ్యూసర్లు సూపర్‌ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌లో దైవికపరమైన యాక్షన్‌ డ్రామాకి కొత్త డైమెన్షన్‌ ఇవ్వబోతున్నాడు. ఇలాంటి ‘‘ఆధ్యాత్మిక పవర్‌Gమాస్‌ యాక్షన్‌’’ కాంబినేషన్స్‌కి హిందీ ఆడియెన్స్‌ ఎప్పటినుంచో బాగా కనెక్ట్‌ అవుతుంటారు. దీంతో ఈసారి బాలయ్య ‘‘దక్షిణం నుంచి ఉత్తరం’’ వరకు తన తాండవం చూపించబోతున్నాడు అని ట్రేడ్‌ సర్కిల్స్‌ టాక్‌!

హిందీ మార్కెట్‌పై ఫుల్‌ ఫోకస్‌` ఇదే గేమ్‌ ఛేంజర్‌!

ఫస్ట్‌ సింగిల్‌లాంచ్‌ ముంబైలో, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ వారణాసిలో, మాస్‌ ప్రెస్‌మీట్స్‌ Ê ప్రోమో ఈవెంట్స్‌ కర్ణాటక Ê తమిళనాడులో భారీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్స్‌ - తెలంగాణ Ê ఆంధ్రలో! హిందీ ఆడియెన్స్‌కు స్పష్టమైన సిగ్నల్‌: ‘‘ఇది ఆధ్యాత్మిక యాక్షన్‌ చిత్రం.. మీ కోసం కూడా తయారు చేశాం.’’ ఇంత స్పీడుగా పాన్‌-ఇండియా లెవెల్‌ ప్రమోషన్స్‌ సిద్ధం చేస్తున్నందుకు, ట్రేడ్‌ వర్గాలు ‘‘బోయపాటి-బాలయ్య కాంబో ఇప్పుడు నేషనల్‌ స్టేజ్‌కి రెడీ అవుతోంది’’ అని చెబుతున్నాయి.

పాన్‌ ఇండియా రిలీజ్‌ వల్ల ‘అఖండ 2’కి కలిసొచ్చే విషయాలు: నార్త్‌మార్కెట్‌ నుండి అదనపు 25-40కోట్లు రెవెన్యూ అవకాశాలు. సింగిల్‌ స్క్రీన్‌ డామినేషన్‌ ఉండే ప్రాంతాల్లో (యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌) బాలయ్య మాస్‌స్క్రీనర్‌గా పెద్దసంఖ్యలో ఆకర్షించవచ్చు. బ్రాండ్‌ ‘‘అఖండ’’ దేశవ్యాప్తంగా పాపులర్‌ అవుతుంది. హిందీలో డబ్బింగ్‌ వెర్షన్‌ ఇప్పటికే వైరల్‌, సీక్వెల్‌ థియేటర్స్‌లో వస్తే రేంజ్‌ మారిపోతుంది. బోయపాటి శ్రీను పాన్‌-ఇండియా డైరెక్టర్‌గా స్థిరపడే అవకాశం. ఆయన స్టైల్‌ హిందీ సాలిడ్‌ యాక్షన్‌ అభిమానులకు బాగా దగ్గరవుతుంది. బాలయ్యకి కొత్త నేషనల్‌ మార్కెట్‌ ఓపెనింగ్‌ సౌత్‌లో ఉన్న మాస్‌ స్టేటస్‌, ఉత్తరాన్నీ కలిపితే ఓ రేంజి స్థాయి హైప్‌. ఓటీటీ G శాటిలైట్‌లో బిగ్‌ లెవెల్‌ బిడ్డింగ్‌ నార్త్‌ మార్కెట్‌ రికగ్నిషన్‌ వల్ల తదుపరి డిజిటల్‌ మరియు డబ్బింగ్‌ డీల్స్‌ మరింత భారీగా మారుతాయి. ఇది కేవలం రిలీజ్‌ కాదు.. ఇది బాలయ్యను దేశం మొత్తం ముందుంచే పాన్‌ ఇండియా మాస్‌ మిషన్‌! బాలయ్య శివతాండవం ఈసారి ఉత్తరాన్నీ, దక్షిణాన్నీ ఒక్కసారిగా కంపింపజేస్తుందా?

- జోశ్యుల సూర్యప్రకాశ్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page