బాహుబలి 3 టీజర్: బాహు- భళ్లా ‘‘స్పైడర్‌మేన్’’ గేమ్!
- Guest Writer
- Nov 5, 2025
- 2 min read

బాహుబలి - ది బిగినింగ్, బాహుబలి- ది కన్ క్లూజన్ చిత్రాలతో చరిత్ర లిఖించాడు ఎస్.ఎస్.రాజమౌళి. అయితే ‘‘ది కన్ క్లూజన్’’తో ఇక బాహుబలి కథకు ముగింపు పలికినట్టేనని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచించిన నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి కథలను మరిన్ని క్రియేట్ చేయాలని భావించినట్టు తెలిసింది. నిజానికి రాజమౌళి ‘‘బాహుబలి- 3’’ తెరకెక్కించే ఆలోచన లేదని ఇంతకుముందే వెల్లడిరచారు. కానీ ఇప్పుడు బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా వస్తోంది. ఇది పూర్తిగా యానిమేటెడ్ సినిమా. కానీ కథాంశం మాత్రం తొలి రెండు భాగాలను కలుపుతూ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది. బాహుబలి సినిమాటిక్ విశ్వంలో బాహుబలి - ది ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా టీజర్ ఇప్పుడు వైరల్‌గా దూసుకెళుతోంది. ఈ టీజర్‌లో బాహుబలి వర్సెస్ భళ్లాల దేవ వార్ పీక్స్‌లో ఎలివేట్ చేయడం ఆసక్తికరం.
స్టార్ వార్స్- విజన్స్, ది బాండిట్స్ ఆఫ్ గోలక్ చిత్రాలను తెరకెక్కించిన ఇషాన్ శుక్లా ఈ మూడో భాగానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథాంశం గురించి ఎక్స్ ఖాతాలో టీమ్ రివీల్ చేసింది. ‘‘అమరేంద్ర బాహుబలి మరణం అతడి ముగింపు కాదు.. శాశ్వతమైన ప్రారంభం’’ అని ట్యాగ్‌ని జోడిరచారు. ఈ టీజర్‌లో డార్లింగ్ ప్రభాస్‌ని రెండు కోణాల్లో చూపుతుంది. స్పైడర్ మ్యాన్ తరహాలో సాలీడులా గాల్లో విన్యాసాలు చేసే పౌరాణిక కాలంలోని యువకుల మాదిరిగా ప్రభాస్, భళ్లాల దేవ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఇది బాహుబలి ప్రపంచానికి కొనసాగింపు. 2డి వెర్షన్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదల చేసాము.. 3డి యానిమేషన్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు.
యువ ప్రతిభావంతుడు, యానిమేటర్ ఇషాన్ శుక్లా బాహుబలి కథను విస్తరించడంలో పాత్రలను రీక్రియేట్ చేయడంలో చేసిన కృషిని రాజమౌళి అభినందిస్తున్నారు. అవే పాత్రలతో వేరే కోణంలో కథాంశం రన్ అవుతుంది. నాకు ఆ ఆలోచన నిజంగా నచ్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు సినిమా బడ్జెట్ దాదాపు రూ. 120 కోట్లకు చేరుకుందని అంచనా. బాహుబలి ది బిగినింగ్ కి అయినంత బడ్జెట్ దీనికి ఖర్చయిందట. బాహుబలి- ది ఎటర్నల్ వార్ గురించి మునుముందు మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
భార్యా బాధితుల కోసం ఓ సినిమా

గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అనే ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టి.. ప్రీ లుక్ పోస్టర్లతో ఆసక్తిని పెంచింది ‘పురుష:’ చిత్రయూనిట్. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ పాత్రల స్వభావం, వాటి తీరుని ప్రతిబింబించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇక ఈ పోస్టర్ మీద ‘బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది..’ అనే కంటెంట్‌ను చూస్తే ఇదో భార్యాబాధితుల కథలా అనిపిస్తోంది. పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ ఓదెల ‘‘పురుషః’’ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్‌లతో పాటుగా వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ గుర్తుండిపోయే పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా రానున్న ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఆద్యంతం అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments