top of page

బన్నీ... సొంత సైన్యం ఎందుకు?

  • Guest Writer
  • 4 days ago
  • 2 min read
ree

సోషల్‌ మీడియా యుగంలో ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌ నెమ్మదిగా కనుమరుగవుతుంటే ు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాత్రం ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసారు! తాజాగా ఆయన ‘అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’ పేరిట తన సొంత అభిమానుల ఆర్మీని రెడీ చేశాడు. హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఆదివారం బన్నీ స్వయంగా తన అభిమానులను కలుసుకుని, వారితో ఫోటోలు దిగుతూ, ఆత్మీయంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలన్నింటి నుంచి యువ అభిమానులను ఎంపిక చేసి, జిల్లా స్థాయి టీమ్స్‌ని అధికారికంగా ప్రకటించాడు.

ఇక నుంచి ఈ అసోసియేషన్‌ సోషల్‌ మీడియా ప్రమోషన్స్‌, ఈవెంట్‌ కోఆర్డినేషన్‌, ఫ్యాన్స్‌ షోస్‌, క్యాంపెయిన్స్‌ అన్నీ స్వయంగా నిర్వహించనుంది. బన్నీ టీమ్‌ నెలల తరబడి స్క్రీనింగ్‌ చేసి, యువ అభిమానులను ఎంపిక చేసినట్లు సమాచారం. సోషల్‌ మీడియా యుగంలో ‘‘ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’’ అంటే ఏమిటి? ఒకప్పుడు ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌ అంటే పోస్టర్లు, ఫ్లెక్సీలు, రక్తదాన శిబిరాలు, బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో నిండిన భౌతిక సంస్థలు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా యుగంలో, అభిమానుల కమ్యూనిటీ అంటే స్వతంత్ర ఐడెంటిటీ, డిజిటల్‌ మోబిలైజేషన్‌, క్యాంపెయిన్‌ శక్తి. అందుకే ఎక్కువ హీరోలు సోషల్‌ మీడియా టీమ్‌లపై ఆధారపడుతున్నారు. ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌ ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. ఇలాంటి టైంలో అల్లు అర్జున్‌ తిరిగి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ని ప్రారంభించడం అంటే ‘‘ఆఫ్‌లైన్‌ ఫ్యాన్‌ బేస్‌ని తిరిగి యాక్టివేట్‌ చేయడం.’’ ఇది కేవలం అభిమానుల సంఘటితం అవ్వటం మాత్రమే కాదు. ఇది ఒక ఆర్గనైజ్డ్‌ పవర్‌ స్ట్రక్చర్‌. ఇక పెద్ద ట్విస్ట్‌ ఏంటంటే ఇప్పటివరకు బన్నీ అభిమానులు మెగా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ద్వారానే కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ, ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో బన్నీ సినిమాలపై, ఆయనపైనే కొంతమంది మెగాఫ్యాన్స్‌ విమర్శలు చేయడం మొదలయ్యింది. దాంతో బన్నీ అభిమానుల్లో అసంతృప్తి పెరిగి, ‘‘ఇక మనకంటూ సొంత ఐడెంటిటీ కావాలి!’’ అనే డిమాండ్‌ మొదలైందట.

దీంతోనే బన్నీ టీమ్‌ ‘‘అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’’ అనే పేరుతో కొత్త సైన్యాన్ని రెడీ చేసింది. బన్నీ మాటల్లో చెప్పాలంటే, ‘‘ఇది నా గర్వకారణం... నా ఆర్మీ!’’ ‘‘మెగా ఫ్యామిలీ’’ నుంచి వేరు కావాలనే అంతర్గత వాస్తవం? ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ అభిమానులు మెగా ఫ్యాన్స్‌ అసోసియేషన్లో భాగమే. కానీ 2010ల మధ్య నుంచి ఒక సైలెంట్‌ ఫ్రిక్షన్‌ పెరుగుతోంది చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ మొదలైనవారికి మెగా బ్రాండ్‌ అనే కవచం ఉన్నా, బన్నీ మాత్రం తన పర్సనల్‌ బ్రాండ్‌ను కొత్తగా కట్టుకున్నాడు. ‘‘పుష్ప’’ యుగం తర్వాత అది పాన్‌-ఇండియా స్థాయికి చేరింది.

ఇక సోషల్‌ మీడియాలో కూడా బన్నీ సినిమాలపై, అతని అభిమానులపై మెగా ఫ్యాన్స్‌తో ఘర్షణలు, ట్రోల్స్‌, కౌంటర్స్‌ ఎక్కువయ్యాయి. దాంతో అభిమానుల్లో ఒక భావన ఏర్పడిరది. ‘‘ఇక మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. మన హీరొకి మన సైన్యం ఉండాలి.’’ అల్లు అర్జున్‌ ఈ భావనను గుర్తించి, దాన్ని ఆర్గనైజేషన్‌గా మారుస్తూ, ‘‘అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’’ ని ప్రారంభించాడని విశ్లేషకులు అంటున్నారు. ఇది కేవలం ఫ్యాన్స్‌ మద్దతు కాదు. ఇది బన్నీ బ్రాండ్‌ స్వతంత్రత ప్రకటన.

‘‘అల్లు అర్జున్‌ ఆర్మీ’’ పాన్‌ ఇండియా ఆలోచన వెనుక వ్యూహం ఏమిటి?

బన్నీ ‘‘పుష్ప’’ తర్వాత హిందీ మార్కెట్లో పటిష్ట స్థానం సంపాదించాడు. తర్వాతి ప్రాజెక్ట్‌ కూడా అట్లీ దర్శకత్వంలో అంటే పాన్‌ ఇండియా లెవెల్‌లో ఒక సీరియస్‌ గేమ్‌ ప్లాన్‌ ఉంది. ఇలాంటి స్థితిలో ఒక స్ట్రక్చర్డ్‌ ఫ్యాన్‌ ఆర్గనైజేషన్‌ అంటే కేవలం తెలుగులో కాదు.. డిజిటల్‌, గ్రౌండ్‌ లెవెల్‌, నార్త్‌ మార్కెట్‌లలో కూడా ఫ్యాన్‌ యూనిట్లతో నెట్‌వర్క్‌ క్రియేట్‌ చేయడం. ఇది మహేష్‌ బాబు, ప్రభాస్‌ తరహాలో కాకుండా, చిరంజీవి లెగసీని రీడిఫైన్‌ చేయడం.

స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ అల్లు అర్జున్‌ సినిమాల మార్కెటింగ్‌లో ఎప్పుడూ ‘‘నేరేటివ్‌ కంట్రోల్‌’’ ఉంటుంది. ‘పుష్ప’లో ఆయన ‘‘టాగ్‌లైన్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్‌.. అన్నీ ఒక సోషల్‌ ఐకానిక్‌ ఇమేజ్‌గా మారాయి. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ కూడా అదే మానర్‌లో పనిచేస్తుంది. ప్రతి ఫ్యాన్‌ ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారే విధంగా. ఇక నుంచి ప్రతి బర్త్‌డే, ప్రతి మూవీ రిలీజ్‌, ప్రతి సోషల్‌ క్యాంపెయిన్‌ సెంట్రలైజ్డ్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా జరుగుతుంది. ఇది ఫ్యాన్స్‌కి కేవలం గౌరవం కాదు, బన్నీకి ఒక కంట్రోల్‌ సిస్టమ్‌ కూడా అయ్యే అవకాసం ఉంది.

ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ డెవలప్మెంట్‌ పెద్ద చర్చగా మారింది. ‘‘మెగా క్యాంప్‌ నుంచి దూరంగా బన్నీ స్వంత సైన్యం ఎందుకు?’’ ‘‘ఇది రాబోయే పాలిటికల్‌ స్టెప్స్‌కు సంకేతమా?’’ అనే ప్రశ్నలు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదైమైనా.. ‘‘అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’’ అంటే కేవలం అభిమాన సంఘం కాదు. ఇది ఒక బ్రాండ్‌ స్వాతంత్య్ర ప్రకటన, ఒక పాన్‌ ఇండియా కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌, ఒక సైలెంట్‌ పాలిటికల్‌ సిగ్నల్‌ కూడా కావచ్చు. ఇండస్ట్రీలో చాలా మందికి ఇది సింపుల్‌ ఫ్యాన్‌ మువ్‌గా కనిపించినా లోపల ఇది ఒక బ్రాండ్‌ పవర్‌ రీస్ట్రక్చరింగ్‌. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా 2027లో విడుదల కానుంది కానీ, అప్పటినాటికి ఆయన ఫ్యాన్స్‌ ఆర్మీ ఫుల్‌ ఫోర్స్‌లో ఉంటుందనేది క్లియర్‌!

- జోశ్యుల సూర్యప్రకాష్‌ ..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page