భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
- Prasad Satyam
- 5 days ago
- 3 min read
చనిపోయినవారి పేరుతో పాస్‌బుక్‌ల సృష్టి
నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న
నకిలీ పత్రాలతో మాయాజాలం
విలువైన స్థలంపై కన్ను
కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తెలుగు సతీష్‌కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం.
మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం.
బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
కోడూరు విజయ్‌కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
కరకవలస వడ్డిబాబు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం.
శ్రీరామ్ సూర్య.. ఇక్కడ కూడా సేమ్..
గడిచిన కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది.. వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నాం మహాప్రభో అని వెంచర్లు వేసే వ్యాపారస్తులు వాపోతుంటే.. ఇంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలా పుట్టుకొస్తున్నారన్న అనుమానం కలుగుతుంది. అలాగే ఎంతోమంది రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్నామని చెబుతుండగా, ఈ ఎనిమిది పేర్లే ఎందుకు ప్రస్తావించారనే డౌట్ కూడా రావచ్చు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు గురువారం స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు వేరేవారి భూమిలో బలవంతంగా చొరబడి, దాన్ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించారన్న కేసులో కోర్టులో ప్రవేశపెట్టారు. ఇది సివిల్ మేటర్‌లా కనిపిస్తున్న క్రిమినల్ చర్య. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సివచ్చింది, వారు కేసు నమోదు చేయాల్సివచ్చింది. అతడు సినిమాలో ఎమ్మార్వో గుండు సుదర్శన్ చెప్పినట్టు ‘ఎకార్డింగ్ టు పేపర్స్ దిస్ పేడీల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ నాయుడు.. యు నో.. అలా కాదని మీకనిపిస్తే.. కోర్టులో తేల్చుకోండి.. అంతేగాని ఇలా దౌర్జన్యం చేస్తారేటి? కోర్టుకెళితే సివిల్ అవుతుంది.. ఇలా గొడవలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది..’ అనడానికి ఇక్కడ స్కోప్ లేకుండాపోయింది. ఎందుకంటే పైన చెప్ప్పుకున్న ఈ రియల్ ఎస్టేట్ బాబులందరూ పరాయివారి భూమికి సంబంధించి డాక్యుమెంట్లు సష్టించడం, దాన్ని వేరేవారికి అమ్మేయడం, ఆ తర్వాత భూమి అసలు హక్కుదారు, మోసపోయి కొనుక్కున్నవారు జుత్తులు పీక్కోవడం, కోర్టులకెక్కడం వీరి వల్ల శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షరా మామూలైపోయింది. అందుకే వీరి గతచరిత్రను గమనించిన పోలీసులు వీరిపై ఫోర్జరీ కేసు, బలవంతంగా పొలంలోకి చొరబడిన కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు. ఇదంతా నిన్నటి వరకు జరిగిన కథ. అయితే ఇప్ప్పుడు ఈ కథనంలో చెబుతున్న అంశం ఈ బ్యాచ్ నుంచి ఎవరైనా ఎదైనా భూమిని కొనుగోలు చేసినా, వారి భూమిని అమ్మమని అడ్వాన్స్‌లిచ్చినా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలులో గేదెల రామారావు, ఆయన భార్య గేదెల లక్ష్మి శ్రీకాకుళం ఎంపీపీలుగా పని చేశారు. ఇప్ప్పుడు వారి తనయుడు గేదెల చెంగళరావు రాగోలు సర్పంచ్‌గా ఉన్నారు. మరో తనయుడు గేదెల పురుషోత్తమరావు వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతకు మించి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. వీరి సమీప బంధువు చిట్టి జనార్ధన ఎంపీపీగా పని చేశారు, జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. ఇంత రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన 96 సెంట్ల భూమిపై దస్తావేజులు సష్టించి, దాన్ని స్వాధీనం చేసుకోడానికి మూడు రోజుల క్రితం పైన చెప్పిన బ్యాచ్ మరికొందర్ని వెంటబెట్టుకొని దిగింది. ఈ స్థలం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వెళ్లే మెయిన్ రోడ్డులో ఉన్న అప్పలరాజు సత్రం ఎదురుగా రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. కోట్లు పలికే ఈ భూమిని మూడు తరాల క్రితమే గేదెల రామారావుకు వారసత్వంగా వచ్చింది. దీనిని ఆయన తన కుమార్తె ధర్మాన పద్మావతికి పసుపు`కుంకుమ కింద ఇచ్చారు. ఆమె భర్త చిన్నా మాస్టర్ అంటే శ్రీకాకుళంలో తెలియని రాజకీయ నాయకుడు ఉండరు. ఇప్ప్పుడు సరిగ్గా వారి భూమికే పత్రాలు సష్టించి, వీరంతా దాన్ని స్వాధీనం చేసుకోడానికి వచ్చారు. అయితే గేదెల కుటుంబానికి నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉండటం, స్థానికంగా ఉన్నవారికి అది రామారావు కుటుంబానికి చెందిన స్థలమని తెలియడంతో పొలం మీదకు వచ్చినవారిని చుట్టుముట్టి రెండు తగిలించి మరీ పోలీసులకు అప్పగించారు. ఇది ఆ తర్వాత కేసు నమోదు కావడం, రిమాండ్‌కు వెళ్లడం ముందే చెప్ప్పుకున్నాం.

ఒక పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వారసత్వంగా వచ్చిన భూమినే తప్ప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకోవాలని చూస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన ఈ వ్యవహారం బయటపడిన దగ్గర్నుంచి వ్యక్తమవుతుంది. ఆమదాలవలస రోడ్డు 80 అడుగుల మేర విస్తరించడం, గూడెంలో జెమ్స్ వైద్యకళాశాల ఉండటం, దానికి ఆనుకొనే ప్రతిష్టాత్మకమైన సావిత్రమ్మపురం అనే గేటెడ్ కమ్యూనిటీ తయారవుతుండటంతో రోడ్డు పాయింట్‌లో ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని భావించారు. విచిత్రమేమిటంటే.. పోలీసులు కోర్టుకిచ్చిన రిపోర్టు ప్రకారం ఎ`6గా ఉన్న అర్జి అప్పలరాజుది స్వయాన గేదెల కుటుంబం ఉంటున్న రాగోలుకు ఆనుకొని ఉన్న గూడెం. అలాగే ఇందులో భాగస్వాములుగా ఉన్న మిగిలినవారికి అంతో ఇంతో, లేదా నేరుగానో ఈ సామాజికవర్గంతో సంబంధాలున్నాయి. అందరికీ ఇది గేదెల కుటుంబీకులకు చెందినదన్న విషయం తెలుసు. రాగోలులో వైకాపా నేతý చుట్టూ తిరిగి చిన్నాచితకా పనులుంటే చేయించుకునే అర్జి అప్పలరాజు నేరుగా అదే పార్టీకి చెందిన నేతలకు ఎసరుపెట్టారు.
అయితే.. ఇది పొరపాటునో, తెలియకో జరిగిన వ్యవహారం కాదు. ఈ భూమి ధర్మాన పద్మావతి పేరుతో ఉంది. ఇది తెలిసే నిందితులు టెక్కలికి చెందిన గేదెల షన్ముఖరావు తల్లి పేరుతో నకిలీ పత్రాలు సష్టించారు. విచిత్రమేమిటంటే.. ఇప్ప్పుడు ఆ గేదెల షన్ముఖరావు గాని, ఆయన తల్లి గాని ఈ భూమి మీద లేరు. రాగోలుకే చెందిన తెలుగు సతీష్‌కుమార్, బలగ మెట్టుకు చెందిన మామిడి జగన్నాధరావులు కలిసి పద్మావతి పేరిట ఉన్న పొలానికి పత్రాలు సష్టించారు. అంటే.. రాగోలులో ఉంటున్న సతీష్‌కు ఆ భూమి గేదెల కుటుంబానిదని తెలుసు. అయినా పత్రాలు తయారయ్యాయంటే.. కేవలం ఇది ఓ పథకం ప్రకారం జరిగిన కుట్రే. ఇందులో అర్జి అప్పలరాజుతో కలిసి వీరంతా సిండికేట్‌గా పని చేస్తుంటారు.

ప్రస్తుతం ఏ గేదెల కుటుంబానికి చెందిన భూమిలో చొరబడాలని చూశారో 2018-19 మధ్య ఇదే రోడ్డులో వేసిన ఓ లేఅవుట్‌లో స్థలాన్ని నకిలీ పత్రాలతో వేరే వారికి విక్రయించేశారు. ఆ తర్వాత అసలు ఓనరు, బాధితుడు కలిసి గొడవపడటంతో చేసేదిలేక నకిలీ పత్రాలతో కొనుగోలు చేసిన వ్యక్తి వేరేవారికి దీన్ని ఇచ్చేసి, ఆ గొడవను సరిచేసుకొని ఎంత మిగిలితే తనకు ఇవ్వాలంటూ దండం పెట్టి వెళ్లిపోయారు. అలాగే శ్రీకూర్మంలో దివంగత బరాటం రామశేషు తండ్రి కూడా తన స్థలాన్ని అర్జి ముఠాకే డెవలప్ చేయమని ఇచ్చారు. అక్కడ కూడా డబ్బుల విషయంలో జంఝాటం జరుగుతున్నట్టు భోగట్టా. ఎక్కడ విలువైన స్థలాలుంటే.. అక్కడ గొడవలు సష్టించే విధంగా వ్యవహరించడం వీరికి పరిపాటి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారమని చెప్ప్పుకుంటున్నా వీరంతా దళారులే. కాబట్టి వీరి దగ్గర భూములు కొనుగోలు చేసినవారు ఒక్కసారి పత్రాలు సరిచూసుకోవడం మేలు. వీరు డాక్యుమెంట్లు సష్టించారని అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే గేదెల షన్ముఖరావు తమకు ఈ ఆస్తికి సేల్ అగ్రిమెంట్ రాశారంటూ విశాఖకు చెందిన బొత్స గోవిందరాజు, డాక్టర్ గోపాలకష్ణ, సారవకోటకు చెందిన కుదురు విజయకుమార్ మరో నకిలీ అగ్రిమెంట్ పత్రాలు సష్టించారు. ఇందులో రాగోలుకు చెందిన సతీష్‌కుమార్ పేరిట ఉన్న సేల్ అగ్రిమెంట్‌ను గోవిందరాజులు పేరిట మార్చడానికి మరికొన్ని తప్ప్పుడు పత్రాలు సష్టించారు. అక్కడితే ఆగకుండా తమ భూమిని వేరేవారికి మ్యుటేషన్ చేసేశారంటూ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎమ్మార్వోపై ఫిర్యాదు చేశారు. వాస్తవానికి మ్యుటేషన్ చేసింది అసలు యజమాని ధర్మాన పద్మావతికే. కానీ నిందితులు పెట్టుకున్న దరఖాస్తు మేరకు సర్వేకు రావడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది.










Comments