మోనికకు వాళ్లిద్దరు వీరాభిమానులా?
- Guest Writer
- Jul 18
- 2 min read

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘కూలీ’ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైంది. లిరికల్ సింగిల్స్ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఇటీవలే పూజాహెగ్డేపై చిత్రీకరించిన ‘‘మోనిక’’ అంటూ సాగే ఐటం పాటను రిలీజ్ చేసారు. మాస్ నెంబర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో అందాల భామ పూజా స్టెప్ అందుకుంటే? కుర్రాళ్ల గుండెల్లో సలపరం మొదలవుతుంది.
ఈ పాటలో పూజా హెగ్డే ఎనర్జీ మామూలుగా లేదు. గ్లామరస్, రెట్రో-స్టైల్ డ్యాన్స్ మూవ్స్ తో పూజా ఆకట్టు కుంది. పాటలో పూజాహెగ్డే పాత్ర పేరు మోనిక. మరి ఇంతకీ ఎవరీ మోనికా అంటే? మోనికా బెల్లూచికి ఒక ఇటాలీయన్ నటి. మంచి డాన్సర్ కూడా. మోనికా బెల్లూచీకి అనిదరుర్, లోకేష్ కనగరాజ్ లు వీరాభి మానులట. తొలుత ఈపాట మోనికా బెల్లూచీ పూర్తి పేరు మీదే ఉండాలనుకున్నారుట. కానీ తర్వాత పూజా హెగ్డే మోనికగా మార్చినట్లు లోకేష్ తెలిపాడు.
చిన్ననాటి నుంచి ఆమెను ఆరాధించేవాడినని మోనిక నటించిన ‘మాలేనా’ సినిమా అప్పట్లో టీనేజర్స్ అందరికీ హాట్ ఫెవరెట్ గా తెలిపాడు. హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడిదే పేరుతో పూజాహెగ్డే కి లోకేష్ క్యారెక్టర్ రాయడం అంటే లోకేష్ ఆ బ్యూటీకి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అద్దం పడుతుంది. మొత్తానికి లోకేష్ కనగరాజ్ అభిమానించే గ్రేట్ పెర్పార్మర్ కూడా ఒకరున్నారని ఈసందర్భంగా బయట పడిరది. లొకేష్ గొప్ప క్రియేటర్ మాత్రమే కాదు అంతకు మించి మంచి నటీమణుల విషయంలో మంచి అభిరు చిగల దర్శకుడిగానూ ప్రూవ్ అవుతున్నాడు. మాస్ తో పాటు వెస్ట్రన్ బీట్స్ అందిండచడంలో అనిరుద్ దిట్ట. తనదైన మార్క్ మాస్ కు వెస్ట్రన్ జోడిరచాడంటే ఆ పాటకు తిరుగుండదు. మోనిక పాట నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
నువ్వు హీరో కాదు దేవుడివి!!

సెలబ్రిటీలు ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. పేదల కోసం, పిల్లల కోసం తమకు తోచిన సాయం చేస్తూనే ఉంటారు. కొందరు ఉచితంగా వైద్యం అందిస్తుంటే..మరి కొందరు ఉచితంగా విద్య, ఆహారం కూడా అందిస్తుంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ హీరో కొందరు పేదలకు చేసిన సాయం ఇప్పుడు అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అతనెవరో కాదు.. తమిళ నటుడు సూర్య. సూర్య మరోసారి తన మంచిమనసు చాటుకున్నాడు. తాను నటిస్తున్న సినిమా కోసం వేసిన సెట్‌ను పేదలకు ఇచ్చేశాడు. షూటింగ్ కోసం నిర్మించిన ఇళ్లను పేద మత్స్యకారులకు ఉచితంగా అందించాలని సూర్య నిర్ణయం తీసుకున్నారు.
బాల దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం కన్యాకుమారిలో జరుగుతోంది. షూటింగ్ కోసం జాలర్లు నివసించే గుడిసెల తరహాలోనే భారీ ఖర్చుతో ఇళ్లను నిర్మించారు. అయితే అక్కడ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక వాటిని కూల్చివేయకుండా ఇళ్లు లేని నిరుపేద మత్స్యకారులకు ఇవ్వాలని సూర్య నిర్ణయించారు. ఎంతో శ్రమతో ఖర్చుతో నిర్మించిన ఇళ్లను షూటింగ్ అనంతరం కూలచేయకుండా వాటిలో కొన్ని కుటుంబాలకు అయినా నీడ కల్పించాలనే సూర్య అనుకున్నారు. దీంతో సూర్య చేసిన ఈ ఆలోచనను, ఆశయాన్ని ఆయన అభిమానులు, ఆ ప్రాంతంలోని ప్రజలు అభినందిస్తున్నారు. సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవలే సూపర్ హిట్ అయిన సూర్య సినిమా జైభీమ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమా సమయంలో కూడా సూర్య తన గొప్ప మనసు చాటుకున్నాడు. జై భీమ్ సినిమాతో అందరికీ తెలిసిన రియల్ సినతల్లి అమ్మాళ్‌కు సూర్య సాయం చేశాడు. అమ్మాళ్ పేరు హీరో సూర్య రూ.10లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసాడు. అంతే కాకుండా దాని నుంచి వచ్చే నెల వారి వడ్డీని అమ్మాళ్‌కు అందేలా సూర్య చూశాడు. అయితే ఈ అమ్మాళ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా జై భీమ్ అనే సినిమా తెరకెక్కింది.
మరోవైపు మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. పేద విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. మోహన్‌లాల్ 20మంది పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడిరచారు. విశ్వశాంతి ఫౌండేషన్ సహకారంతో అట్టపాడికి చెందిన గిరిజన బాలలను ఎంపిక చేసి 15ఏళ్ల పాటు వారిని చదివించనున్నట్లు మోహన్‌లాల్ తెలిపారు. దీంతో మోహన్‌లాల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments