top of page

మామితాతో లవ్‌స్టోరీ కావాలి!!

  • Guest Writer
  • Jun 13, 2025
  • 2 min read

ప్రేమలు సినిమాతో యూత్‌ ఆడియన్స్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది మలయాళ భామ మమితా బైజు. అంతకున్ముందు ఐదారేళ్లుగా సినిమాలు చేస్తున్నా కూడా ప్రేమలుతో అమ్మడి టాలెంట్‌ సౌత్‌ ఆడియన్స్‌కి నచ్చేసింది. యూత్‌ ఆడియన్స్‌ అయితే మమితా పేరు వింటే చాలు ఊగిపోతున్నారు. ప్రేమలు తెలుగులో కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. ఐతే ప్రేమలు తర్వాత అమ్మడు కోలీవుడ్‌ లో ఆల్రెడీ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే రెడు సినిమాలు చేసింది మరో రెండు సినిమాలు సైన్‌ చేసింది.

తెలుగులో మైత్రి మేకర్స్‌ చేస్తున్న డ్యూడ్‌లో ప్రదీప్‌ రంగనాథ్‌తో జత కడుతుంది మమితా. ఐతే లేటెస్ట్‌గా సూర్య వెంకీ అట్లూరి సినిమాలో కూడా అమ్మడు అవకాశం దక్కించుకుంది. ఐతే మమితాకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ తెలుసు కాబట్టి ఆమెను యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్స్‌, లవ్‌స్టోరీస్‌లో తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మమితాతో వెరైటీ లవ్‌స్టోరీస్‌ చేస్తే చూడాలని కోరుతున్నారు. అది కాకుండా ఆమె కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తే అంతగా స్కోప్‌ దొరకదని వాళ్ల ఆలోచన.

ఒక విధంగా అది నిజమే అని చెప్పొచ్చు. మమితా లాంటి టాలెంట్‌ క్యూట్‌ హీరోయిన్‌తో డిఫరెంట్‌ డిఫరెంట్‌ లవ్‌ స్టోరీస్‌ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఆమెకు స్టార్‌ సినిమాల్లో కేవలం పాటల వరకు వచ్చి వెళ్లే హీరోయిన్‌లా తీసుకుంటే మాత్రం తప్పకుండా రివర్స్‌లో రిజల్ట్‌ ఉంటుంది. మమితాను ఆడియన్స్‌ ఒక లవ్‌స్టోరీ హీరోయిన్‌గా చూడాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకే అలాంటి కథలకే ఆమెను తీసుకుంటే బెటర్‌ అంటున్నారు. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తే క్రేజ్‌ రాదా అంటే వస్తుంది కానీ అది సరైన పాత్ర పడినప్పుడు మాత్రమే అలా కుదురుతుంది. అలా కాకుండా కేవలం పాటల వరకే హీరోయిన్‌ అనేలా ఉంటే మాత్రం మైతా వల్ల సినిమాకు ప్లస్‌ అవ్వడం అటుంచితే మైనస్‌ అవుతుంది. ఈ విషయంలో మమితా కూడా ఆడియన్స్‌ లో తనకున్న ఫాలోయింగ్‌ గుర్తించి సినిమాలు ఎంపిక చేసుకుంటే బెటర్‌ అని అంటున్నారు. సూర్యతో చేస్తున్న సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో కానీ ప్రదీప్‌తో చేస్తున్న డ్యూడ్‌లో యూత్‌ ఆడియన్స్‌కి మరోసార్‌ కిక్‌ ఇచ్చే రోల్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


గోపీచంద్‌కు కరెక్ట్‌ హిట్‌ పడినట్టే!!

టాలెంట్‌ ఉన్న హీరోల్లో గోపీచంద్‌ ఒకడు. యాక్షన్‌ కథలు బాగా నప్పుతాయి. కథల ఎంపికలో చాలా క్లియర్‌గా ఉంటాడు. కానీ సరైన హిట్లే అందుకోవడం లేదు. గోపీచంద్‌ ఓ సాలీడ్‌ హిట్‌ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు సంకల్ప్‌ తో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ రోజు గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా చిన్న గ్లింప్స్‌ విడుదల చేశారు.

ఈ గ్లింప్స్‌ లో గోపీ లుక్‌ బాగుంది. తనో వారియర్‌గా కనిపించబోతున్నాడన్న విషయం స్పష్టమైంది. తన ఆహార్యానికి సరిపోయే పాత్ర ఇది. గోపీచంద్‌కు చాలా కాలం తరవాత సరైన కథ పడినట్టు అనిపిస్తోంది. ఈ సెటప్‌, గెటప్‌.. ఇవి రెండూ గోపీచంద్‌ కు కొత్తే. సంకల్ప్‌ కొత్త తరహా కథలు రాస్తుంటాడు. ప్రతీసారీ ఓ కొత్త జోనర్‌ టచ్‌ చేస్తుంటాడు. ఈసారి కూడా గోపీచంద్‌ కోసం అలాంటి కథే ట్రై చేస్తున్నాడు. వీఎఫ్‌ఎక్స్‌ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. వార్‌ ఎపిసోడ్స్‌ హైలెట్‌ కాబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఈ తరహా కథలకు మంచి గిరాకీ ఏర్పడిరది. పాన్‌ ఇండియా మార్కెట్‌ ఓపెన్‌ అయ్యింది. అందుకే గోపీచంద్‌ కూడా ఈ బాటలో నడవడానికి ఫిక్సయ్యాడు.

ఇటీవలే షూటింగ్‌ మొదలైంది. కొంత మేర చిత్రీకరణ జరిగింది. అవుట్‌ పుట్‌ పై గోపీచంద్‌ పూర్తి సంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. టైటిల్‌ తోనే గ్లింప్స్‌ వదలాలని చిత్రబృందం భావించింది. కానీ ఈ సినిమా కోసం సరైన టైటిల్‌ ఇప్పటి వరకూ దొరకలేదట. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏమిటన్న విషయంలో చిత్రబృందం ఇంకా గోప్యం పాటిస్తోంది. టీజర్‌, ట్రైలర్‌ ఎలాగూ వస్తాయి కదా, అప్పటి వరకూ ఎదురు చూడాల్సిందే.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..

బులుగు సముద్రంలో బికినీ షో

తెలుగులో ఆకాష్‌ పూరి ‘‘మెహబూబా’’ చిత్రంలో నటించింది నేహా శెట్టి. ఆ తర్వాత టిల్లు స్క్వేర్‌లో తన అల్లరి పాత్రతో మరింత పాపులరైంది. నేహా శెట్టి అందచందాలు, నట ప్రతిభకు యూత్‌ ఫిదా అయిపోయారు. నిజానికి నేహాశెట్టి మంగుళేరు అమ్మాయి. మరోవైపు సోషల్‌ మీడియాలో నేహా శెట్టి నిరంతర పోస్టులు యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. నేహా సముద్ర విహారయాత్రలో ఉన్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌ లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్‌లో నేహా స్టన్నింగ్‌ బికినీ లుక్స్‌ తో మతులు చెడగొడుతోంది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page