మళ్లీ లాక్ డౌన్ వస్తే అతనితో కలిసి ఉంటా
- Guest Writer
- Jul 4
- 3 min read

నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ అలనాటి తార సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి ఏకంగా నేషనల్ అవార్డునే సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కీర్తి మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకున్నారు. రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ సినిమాతో ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం ఉప్పు కప్పురంబు అనే సినిమాలో నటించారు.
శశి దర్శకత్వంలో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిరచారు కీర్తి సురేష్.
ఇంటర్వ్యూలో కీర్తిని ఒక వేళ మళ్లీ లాక్ డౌన్ వస్తే ఏ హీరోతో ఉండటానికి ఇష్టపడతారని సుమ అడగ్గా, దానికి కీర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాని పేరు చెప్పేశారు. నాని, తన వైఫ్ అంజు, నాని కొడుకు అర్జున్ తో కలిసి ఉండటానికి ఇష్టపడతానని కీర్తి చెప్పారు. కీర్తి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, కీర్తి సురేష్- నాని మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నేను లోకల్, దసరా లాంటి సినిమాల్లో నటించగా, ఆ షూటింగ్ టైమ్ లో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిరది. కేవలం నానితోనే కాకుండా నాని ఫ్యామిలీతో కూడా కీర్తి చాలా సన్నిహితంగా ఉంటారు. రీసెంట్ గా ఉప్పు కప్పురంబు సినిమా ట్రైలర్ చూశాక దాన్ని షేర్ చేస్తూ నాని కీర్తిని ప్రశంసిస్తూ చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
సెప్టెంబరు 25.. క్లాష్ తప్పదు

‘ఓజీ’, ‘అఖండ 2’... 2025 ద్వితీయార్థంలో రాబోతున్న పెద్ద సినిమాల్లో ఇవి రెండూ ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై అభిమానులతో పాటు చిత్రసీమ కూడా ఆశలు పెట్టుకొంది. అయితే ఈ రెండూ.. ఒకేసారి విడుదల కాబోతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సెప్టెంబరు 25న ఓజీని విడుదల చేస్తున్నామని ఇది వరకే నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. నిన్నటికి నిన్న మరోసారి గట్టిగా కన్‌ఫామ్ చేశారు. సెప్టెంబరు 25న ఓజీ రావడం ఖాయమని అభిమానులకు తీపి కబురు అందించారు. ‘అఖండ 2’ కూడా ముందు నుంచీ సెప్టెంబరు 25పైనే గురి పెట్టింది. ‘ఓజీ’ రిలీజ్ డేట్ పై చిత్రబృందం అంత గ్యారెంటీగా ఉందంటే, అఖండ 2 రాదేమో అనుకొన్నారంతా.
కానీ ఇప్పుడు ‘అఖండ 2’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. అందులో విడుదల తేదీ మరోసారి స్పష్టం చేసింది చిత్రబృందం. సెప్టెంబరు 25నే విడుదల అంటూ వాళ్లూ క్లారిటీగానే ఉన్నారు. దాంతో పవన్ - బాలయ్య క్లాష్ ఎలా ఉండబోతోంది? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది చిత్రసీమ.
సంక్రాంతికి రెండు మూడు సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కానీ అప్పుడు కూడా ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం అభిమానుల పరంగా ఆసక్తి ఉన్నా, సినిమాకు మంచిది కాదు. ఓపెనింగ్ డే ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది. థియేటర్లు పంచుకోవాల్సివస్తుంది. దాంతో పాటు కలక్షన్లు కూడా. అయినా సరే, రెండు సినిమాలూ పోటీకి సిద్ధమయ్యాయి అంటే.. ఆలోచించుకోవాల్సిందే.
నిజానికి ‘విశ్వంభర’ కోసం కూడా ఇదే డేట్ పరిగణించారు. ‘ఓజీ’ రాకుండా ‘విశ్వంభర’ వచ్చేదే. కానీ ‘ఓజీ’ ఫిక్సయ్యింది. దాంతో పాటు ‘అఖండ 2’ కూడా. దాంతో విశ్వంభర మరో డేట్ చూసుకోక తప్పదు.
` తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
తల్లి ముందే స్మోక్ చేసిన హీరోయిన్

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించగా, ఆ ముగ్గురు హీరోయిన్లూ తమ్ముడు సినిమా కోసం ఒక్కో ప్రత్యేక టాలెంట్‌ను కొత్తగా నేర్చుకున్నారు. తమ్ముడు సినిమా కోసం వర్ష బొల్లమ్మ కిక్ బాక్సింగ్ నేర్చుకోగా, మరో హీరోయిన్ సప్తిమిగౌడ తన క్యారెక్టర్ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. కానీ మరో కీలక పాత్రలో నటించిన స్వసిక విజయ్ మాత్రం తమ్ముడు సినిమా కోసం ఓ స్పెషల్ సవాల్ ను స్వీకరించారు. తమ్ముడు సినిమాలోని తన పాత్ర కోసం ఆమె స్మోకింగ్ ను అలవాటు చేసుకున్నారట. తన క్యారెక్టర్ ప్రిపరేషన్ లో భాగంగా తాను స్మోక్ చేయడం నేర్చుకోవాలని డైరెక్టర్ శ్రీరామ్ వేణు తనకు చెప్పారని స్వసిక వెల్లడిరచారు.
దాని కోసం తాను ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేశానని, ఆఖరికి తన తల్లి ముందు కూడా తాను స్మోక్ చేశానని, ఇదంతా తన జాబ్ లో భాగమని తన తల్లికి చెప్పానని స్వసిక తెలిపారు. సినిమాలో మీరు చూసేది నిజమైన సిగార్లేనని, సినిమా మొత్తమ్మీద ఓ ఐదు సీన్లు మినహాయించి ప్రతీ సీన్ లోనూ తాను స్మోక్ చేస్తూనే కనిపిస్తానని, ఆ వాసనకు వాంతులు, తలనొప్పి కూడా వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి తమ్ముడు సినిమా కోసం శ్రీరామ్ వేణు ప్రతీ హీరోయిన్ కీ ఓ స్పెషల్ మ్యానరిజంను ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కు అక్కగా లయ నటిస్తుండగా, ఆమె కూడా సినిమాలో చెప్పుల్లేకుండా నటించాల్సి వచ్చిందని వెల్లడిరచిన సంగతి తెలిసిందే.
` తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments