top of page

మహేష్‌బాబు రాముడి గెటప్ పై ఫ్యాన్స్ ఆసక్తి..!

  • Guest Writer
  • Apr 8
  • 3 min read

మహేష్ బాబుని రాముడి గా చూడాలన్నది ఆయన అభిమానుల ఆశ. అది ‘వారణాసి’తో తీరబోతోంది. మహేష్ ఈ సినిమాలో రాముడి అవతారంలో కనిపిస్తారని రాజమౌళి సైతం ప్రకటించేశారు. రాముడి గెటప్, అందులోనూ రాజమౌళి సినిమా అంటే.. ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాముడి గెటప్ ని వీలైనంత త్వరగా బయటకు వదిలితే బాగుంటుందన్నది ఆయన అభిమానుల ఆశ. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాముడి అవతారంలో మహేష్ లుక్ బయటకు వదులుతారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే. రాముడి గెటప్‌కి సంబంధించిన ఎపిసోడ్ ఆల్రెడీ షూట్ చేసేశారు. కాబట్టి.. రాజమౌళి దగ్గర కావాల్సినంత ఫుటేజీ ఉంటుంది.

కాకపోతే... రాజమౌళి టీమ్ మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాముడి గెటప్ ని ముందే రివీల్ చేసి, ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేస్తే బాగుంటుందా? లేదంటే దాన్ని వెండి తెరపై చూసేంత వరకూ గోప్యంగా ఉంచాలా? అనే విషయంలోనూ టీమ్ తర్జన భర్జనలు పడుతోంది. ఇది లీకేజీల కాలం. సినిమాని ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, ఏదో ఓ రూపంలో స్టిల్లో, సెట్లో ఫుటేజీనో బయటకు వచ్చేస్తోంది. ఈ లీకేజీల బెడద గురించి అందరి కంటే రాజమౌళికే బాగా తెలుసు. దాన్నుంచి తప్పించుకోవాలంటే ముందే లుక్ రివీల్ చేయడం మంచిదనుకొంటే మాత్రం ఈ మే 31న మహేష్ ని రాముడిగా చూసేయొచ్చు. కానీ రాముడిగా మహేష్‌ని వెండి తెరపై చూసినప్పుడే అసలైన థ్రిల్ అనుకొంటే మాత్రం.. సినిమా విడుదల వరకూ ఆ లుక్ బయటకు రాదు. నిర్ణయం ఏదైనా సరే, పూర్తిగా రాజమౌళి చేతుల్లోనే ఉంది.

కాకపోతే.. రాముడిగా మహేష్ లుక్, ఆ ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ‘రామాయణ’లోంచి రాముడిగా రణబీర్ కపూర్ లుక్ వచ్చింది. దానిపై డివైడ్ టాక్ నడుస్తోంది. మరోవైపు మహేష్ ఫ్యాన్స్ మాత్రం ‘మా రాముడు ఇంత కంటే గొప్పగా ఉంటాడు’ అని రిలాక్సయిపోతున్నారు. వాళ్ల మాట నెగ్గిందో, లేదో తెలియాలంటే లుక్ బయటకు రావాల్సిందే.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...


స్విమ్ సూట్‌లో దేవియాని శర్మ..!

నిత్యం గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిన్నది.. గత కొంతకాలంగా మరింత హాట్ డోస్ పెంచేసి ఊరిస్తున్న విషయం తెలిసిందే.

సామాజిక మాధ్యమాల ఉపయోగం ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిపోయింది. అటు సినీ సెలబ్రిటీలైనా ఇటు సామాన్యులైనా కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో దూరిపోతూ భిన్నమైన కంటెంట్ ఇస్తూ పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలే సినిమాల ద్వారా క్రేజ్ దక్కడం కష్టంగా మారుతున్న వేళ ఇటు సోషల్ మీడియాలో ఈజీగా పాపులారిటీని సంపాదించుకోవచ్చు అనే నెపంతో అందాలు ఆరబోస్తూ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.

గ్లామర్ వలకబోస్తూ ఆడియన్స్ ను అలరించడమే కాకుండా ఇటు నెటిజన్స్ ను ఫాలోవర్స్ గా మార్చుకుంటూ అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీల జాబితాలో చేరిపోతున్నారు. అంతేకాదు ఈ సోషల్ మీడియా వేదికగా ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ అందర్నీ అలరిస్తున్న సెలబ్రిటీలలో సేవ్ ది టైగర్స్ బ్యూటీ దేవియాని శర్మ కూడా ఒకరు.

నిత్యం గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిన్నది.. గత కొంతకాలంగా మరింత హాట్ డోస్ పెంచేసి ఊరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. తాజాగా సముద్రపు ఒడ్డున బండరాళ్ల మధ్యలో ఫోటోలకు ఫోజులిస్తూ ఈమె షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే స్విమ్ సూట్‌లో అందాలు ఆరబోస్తూ దేవియాని శర్మ ఫోటోలు షేర్ చేయడమే కాకుండా..“నీరు నా గాయాలను కడుగుతుంది. సముద్రం నా రంగులను ముద్దాడుతుంది. ప్రేమ అంతులేనిది. స్వేచ్ఛగా అనిపించే చోటు.. సముద్రంలోనే నేను నా నిజస్వరూపాన్ని కనుగొంటాను” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.

ఎప్పటికప్పుడు సముద్ర తీరాన అందాలు ఆరబోస్తూ షేర్ చేసే ఈమె ఇప్పుడు మరొకసారి స్విమ్ సూట్‌లో అందాలు ఆరబోస్తూ తనను తాను మైమరిచిపోయి అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక దేవియాని శర్మ విషయానికి వస్తే.. 1993 మే30న న్యూఢిల్లీలో సునీల్ శర్మ, నీనా శర్మ దంపతులకు జన్మించింది. ఈమెకు సోదరి సోనమ్ శర్మ కూడా ఉంది.టీనేజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ వైపు వెళ్లిన దేవియాని నటనపై ఆసక్తితో కొన్ని నాటకాలలో కూడా నటించింది . ఇక తొలిసారి 2020లో రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం గా వచ్చిన భానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె రొమాంటిక్ అనే చిత్రంలో నటించిన ఈమె.. ఆ తర్వాత అనగనగా, సేవ్ ది టైగర్స్, సైతాన్, నేమ్ ఆఫ్ గాడ్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ఇకపోతే ఈమెకు మాత్రం సేవ్ ద టైగర్స్ వెబ్‌సిరీస్ మంచిపేరును అందించిందని చెప్పవచ్చు. ఇక తన నటన ప్రయాణాన్ని మాత్రం హిందీ చిత్రం లవ్ శుదాలో చిన్న పాత్రతో హిందీ ప్రేక్షకులను పలకరించింది.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page