రెండు హై వోల్టేజ్ సినిమాలు
- Guest Writer
- Aug 4
- 2 min read

ఆగస్టు 14వ తేదీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనున్న విషయం తెలిసిందే. రెండు హై వోల్టేజ్ సినిమాలు ఆ రోజు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. వార్-2, కూలీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రెండు సినిమాలపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ లీడ్ రోల్ లో నటించిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ మూవీ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సహా శ్రుతి హాసన్, సాబిన్ సాహిర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కళానిధి మారన్.. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
రీసెంట్ గా మేకర్స్.. ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించింది. సినీ ప్రియులను అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ట్రైలర్‌ను.. సరైన రీతిలో మేకర్స్ కట్ చేశారనే చెప్పాలి. ఆ తర్వాత ఉన్న హైప్ ను భారీ పెంచారు. దీంతో సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను సాధించడం పక్కా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆ తర్వాత వార్-2 ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. కానీ మోస్తరు స్పందన మాత్రమే వచ్చింది. ఇంతకుముందు వచ్చిన టీజర్ విషయంలో కూడా అదే జరిగింది. దీంతో మేకర్స్ అనుకున్న స్థాయిలో అంచనాలు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు భారీ ప్రమోషనల్ ప్రచారంతోపాటు విడుదలకు ముందు ఒక మంచి గ్లింప్స్ అవసరమనే చెప్పాలి.
అయితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు ఉండటం ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రమోషన్స్ లో మాత్రం స్పీడ్ పెంచి అంచనాలు క్రియేట్ చేయాల్సిందే. అదే సమయంలో ఓవర్సీస్ లో కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అప్పుడే మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరగా వెళ్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ వార్-2 ఇంకా ఊపందుకోలేదు. సినిమాకు తగిన సంఖ్యలో స్క్రీన్లు వచ్చేలా పంపిణీదారుల భారీ ఎత్తుగడలు అవసరం. ముందస్తు అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ.. ఇంకా హైప్ క్రియేట్ చేసిన వాటిని పెంచాలి. దీంతో కూలీ మూవీ వార్-2 కన్నా అన్ని విషయాల్లో ముందు ఉంది. దానితో ఈక్వల్ గా ఉండాలంటే వార్-2 మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...
మాస్ జాతర.. డౌట్ వద్దు

రవితేజ మాస్ జాతర పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ఇది. డైలాగ్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న భాను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఆ సమయానికి వస్తుందా లేదా అనే చిన్న అనుమానం. ఎందుకంటే ప్రస్తుతం కింగ్డమ్‌తోనే ఇంకా బిజీగా ఉన్నారు వంశీ. దీని తర్వాత వార్ 2 ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. మాస్ జాతర పనులు ఎంతవరకు వచ్చాయో ఇంకా ఓ అంచనాకు రాలేదు. పైగా 27 అంటే ఈపాటికి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. అందుకే.. మాస్ జాతర రిలీజ్‌పై చిన్న డౌట్.
అయితే ఇప్పుడా అనుమానం అవసరం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్‌కి శ్రీకారం చుడుతూ ‘ఓలే ఓలే’ అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేయనున్నారు. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ క్లారిటీ ఇచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 27న విడుదల’ అని అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ వినాయక చవితి కానుకగా రావడం ఖాయమైంది. రవితేజ కెరీర్‌లో 75వ సినిమా ఇది. ధమకా తర్వాత మళ్లీ విజయాన్ని అందుకోలేకపోయిన రవితేజకి మాస్ జాతర విజయం చాలా కీలకం.
-తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
Komentar