రణబీర్ ‘రామ’ లుక్ చూస్తే గూస్‌బంప్స్!!
- Guest Writer
- 5 days ago
- 2 min read

భారతీయ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నితేష్ తివారీ ‘రామాయణ’ స్పెషల్ రామ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ విజువల్ వండర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్ అని కాకుండా, శ్రీరాముడి పాత్రను పరిచయం చేస్తూ ఒక ట్రైలర్ స్థాయిలో దీన్ని రూపొందించారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని విజువల్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించబోయే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతోంది.
టీజర్ ప్రారంభం నుంచే మనల్ని ఒక పురాణకాలంలోకి తీసుకెళ్లడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఒక భారీ యుద్ధం చేస్తున్న సన్నివేశాలు, దాని వెనుకే వచ్చే భారీ ఏనుగులు సినిమా స్కేల్ ఏంటో చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రలో రణబీర్‌కపూర్ ఎంట్రీ ఇచ్చిన విధానం పక్కాగా కుదిరింది. విల్లు పట్టుకుని నిలబడిన తీరు, ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత ‘మర్యాద పురుషోత్తముడి’ రూపాన్ని పక్కాగా ఆవిష్కరించాయి.
అసలు విషయానికి వస్తే, ఈ టీజర్‌లో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన స్క్రీనింగ్‌లో వచ్చిన టాక్ నిజమేనని నిరూపిస్తూ, గ్రాఫిక్స్ అత్యంత నాణ్యతతో ఉన్నాయి. ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేయడం వల్ల ప్రతి ఫ్రేమ్ చాలా క్లారిటీగా, భారీగా కనిపిస్తోంది. ముఖ్యంగా రణబీర్‌కపూర్ శ్రీరాముడిగా నడుచుకుంటూ వచ్చే సీన్, రాతి విగ్రహాల మధ్యలో ఆయన నిలబడిన షాట్స్ ఒక విజువల్ ట్రీట్ లా ఉన్నాయి. హాలీవుడ్ సంస్థ ‘డిఎనఈజీ’ ఈ సినిమా కోసం గట్టిగానే వర్క్ చేసినట్లు అర్ధమవుతుంది.
కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, సంగీతం కూడా ఈ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. రాముడి వీరత్వాన్ని, ప్రశాంతతను ప్రతిబింబించేలా ఉన్న సౌండ్ డిజైన్ టీజర్‌కు మెయిన్ హైలైట్. “రామ.. అవర్ ట్రూత్, అవర్ హిస్టరీ” అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రానుంది.
నటీనటుల విషయానికి వస్తే, సాయి పల్లవిని సీతగా.. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడి గెటప్ లో పవర్‌ఫుల్ గా నటిస్తున్నారు. వారి లుక్స్‌ని ఇంకా రివిల్ చేయలేదు. అలాగే యశ్ ‘రావణ’ లుక్‌ను పూర్తిగా రివీల్ చేయకపోయినా, ఆయన కనిపించే ఆ ఒక్క ఫ్రేమ్ లో ఉన్న ఇంటెన్సిటీ అదిరిపోయింది. శ్రీరాముడు అరణ్యాల్లో విల్లు పట్టుకుని వెళ్తున్న విజువల్స్ అన్నీ కథలోని ఎమోషన్‌కు ప్రాణం పోశాయి.
ఇక ‘రామాయణ’ పార్ట్`1 దీపావళి 2026లో రాబోతోంది. రెండో భాగం 2027 దీపావళికి వస్తుందని టీజర్ చివర్లో స్పష్టం చేశారు. ఐమాక్స్ తో పాటు 4డీఎక్స్ ఫార్మాట్‌లో కూడా ఈ సినిమా రావడం దాదాపు ఖాయం అని టీజర్ మేకింగ్ క్వాలిటీని బట్టి అర్థమవుతోంది. భారతీయ ఇతిహాసాన్ని ఇంత గ్రాండ్‌గా చూపించడం ఇదే మొదటిసారి కావొచ్చు. ఈ టీజర్ సృష్టించిన హైప్‌తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల లెక్కలు మారడం ఖాయంగా కనిపిస్తోంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
ఏప్రిల్ 30: ప్లాన్ బి ఉందా, లేదా?

టాలీవుడ్ దృష్టంతా ఏప్రిల్ 30పైనే ఉంది. ‘పెద్ది’ కోసం అట్టిపెట్టుకొన్న డేట్ ఇది. ఆ రోజున ‘పెద్ది’ వస్తుందని నిర్మాతలు బల్ల గుద్ది చెబుతున్నారు. కానీ రెండు రోజుల నుంచీ ఓ వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 30న `పెద్ది` రావట్టేదని, ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని, మేలో గానీ, జూన్ లోగానీ వస్తుందన్నది ఆ వార్తల సారాంశం.
పెద్ది సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అది నిర్మాతల ఇష్టం. కాకపోతే.. ముందే ఓ క్లారిటీ ఇస్తే, మిగిలిన సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది. ‘పెద్ది’ రాకపై నమ్మకం లేకే... దిల్ రాజు ‘గాయపడ్డ సింహం’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తున్నారు. ‘లెనిన’ సినిమా కూడా మే 1నే రావాలి. కానీ ‘పెద్ది’ కోసం వాయిదా వేశారు. ఒక వేళ `పెద్ది` రాకపోతే... ఆ సమయానికి `లెనిన్`ని తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ‘స్వయంభూ’ చిత్రాన్నీ ఏప్రిల్ 30న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ‘పెద్ది` నిర్మాతల నుంచి ఓ స్పష్టమైన ప్రకటన రావాలి. చివరి నిమిషం వరకూ దాగుడు మూతలు ఆడి, అప్పుడు వాయిదా వేస్తే, మిగిలిన సినిమాల ప్రిపరేషన్‌కు టైమ్ ఉండదు.
మార్చి 26న ‘పెద్ది’ రావాల్సివుంది. కానీ వాయిదా వేశారు. రెండోసారి కూడా వాయిదా అంటే అభిమానులు ఎలా తీసుకొంటారో అనే భయం నిర్మాతల్లో ఉండి ఉండొచ్చు. మరోవైపు ఓటీటీ నుంచి కూడా ఒత్తిడి ఉండి ఉండొచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30న తీసుకురావాలన్న కృత నిశ్చయంతో చిత్రబృందం పని చేస్తోంది. కానీ ఏప్రిల్ 30న రావడం కష్టమే అని తేలిపోతే మాత్రం ఆ నిర్ణయం ముందే ప్రకటిస్తే మిగిలిన సినిమాలకు వెసులుబాటుగా ఉంటుంది. లేదంటే.. ఓ మంచి డేట్ మిస్ అయినట్టే.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...






Comments