లోకేష్ కనకరాజ్ పుష్పఎలా ఉంటాడు..?
- Guest Writer
- Jan 5
- 3 min read

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌పై కూలీ సినిమా ఇంపాక్ట్ బాగా పడిరదని తెలిసిందే. కూలీ సినిమాపై కోలీవుడ్ ఆడియన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోగా సినిమా డిజప్పాయింట్ చేసింది. ఐతే లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అసలైతే అమీర్‌ఖాన్‌తో ఒక సినిమా.. రజనీ, కమల్‌తో సినిమా.. కార్తితో ఖైదీ`2 ఇలా చాలా ప్లానింగ్‌తోనే ఉన్న లోకేష్‌కి ఈ 3 సినిమాలు కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్..
డైరెక్టర్‌గా ఖైదీ, విక్రం సినిమాలతో తన మార్క్ చాటిన లోకేష్ కనకరాజ్ లియో, కూలీ సినిమాల విషయంలో ట్రాక్ తప్పాడు. ఐతే నెక్స్ట్ సినిమాతో లోకేష్ మరోసారి తన ఒరిజినాలిటీ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. లోకేష్ డైరెక్షన్‌గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబు బై మాయావిని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఐతే ఈసారి లోకేష్ మన తెలుగు స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. కొన్నాళ్లుగా డిస్కషన్ లో ఉన్నట్టుగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనే లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ తో లోకేష్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే. పుష్ప మేకర్స్ మైత్రి మేకర్స్ ఈ కాంబినేషన్ ని ఫిక్స్ చేశారట. విక్రం రిజల్ట్ చూసే లోకేష్ కి ఫ్యాన్సీ అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మేకర్స్ అల్లు అర్జున్‌తో సినిమాకు లైన్ చేస్తున్నారట.
అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్‌లో సినిమా..
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. లోకేష్ అల్లు అర్జున్ సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. ఐతే ఈసారి లోకేష్ కనకరాజ్ పుష్ప హీరోని ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ కూడా లోకేష్ తో సినిమా విషయంలో మంచి ప్లానింగ్ తో వస్తున్నారట. ఐతే అట్లీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రంతో సినిమా చేస్తాడని వార్తలు రాగా సడెన్ గా లోకేష్ ఎంట్రీ అల్లు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే మైథలజీ సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ లోకేష్ రావడంతో మరోసారి ఆర్డర్ అటు ఇటు అవుతుంది. ఐతే త్రివిక్రమ్ సినిమాకు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది. అందుకే ఈలోగా లోకేష్ సినిమా కూడా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్. మొత్తానికి అట్లీ, లోకేష్, త్రివిక్రమ్ అల్లు అర్జున్ మాస్ లైనప్ ఫ్యాన్స్ కి ఒక క్రేజీ ఫీస్ట్ అందించేలా ఉంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
ఈమె ఎవరో గుర్తు పట్టగలరా?

హీరోలు మహిళా గెటప్ వేయడం అంటే అది సాహసమే. అమ్మాయిగా వేషధారణతో కనిపిస్తే సరిపోదు.. ఆహార్యం మాట తీరు.. బాడీ లాంగ్వేజ్.. ప్రతిదీ సెట్టవ్వాలి. ప్రేమ కలాపాల్లో ఒదిగిపోయి నటించాలి. అయితే ఇలాంటి వేషధారణలతో మెప్పించిన ప్రముఖులలో ఏఎన్నార్, కమల్ హాసన్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ, విశ్వక్ సేన్ లాంటి దిగ్గజ హీరోలు ఉన్నారు.
ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అలాంటి సాహసం చేసారు. అతడు నటించిన 45 చిత్రంలో మహిళా గెటప్ నిజంగా అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషించగా, ఇటీవలే ఘనంగా విడుదలైంది. ఇది రెగ్యులర్ సినిమా కాదు.. సాంప్రదాయ కథనాలకు సవాలు విసిరే ప్రత్యేక కథనంతో అలరిస్తుందని కూడా ప్రచారం సాగించారు. శివరాజ్ కుమార్ కెరీర్ లో ఇది సాహసోపేతమైన ప్రయత్నమని కూడా ప్రచారమైంది.
అయితే ఈ సినిమా ఎలా ఉంది? అనేదాని కంటే ఇందులో అతడు మహిళా గెటప్ తో ఎలా నటించాడు? అన్నదే ఆసక్తిగా మారింది. లుక్ వరకూ అతడు సరిగ్గానే కుదిరాడు. లేడీ గెటప్ లోనే మరింత అందంగా ఉన్నాడు! అంటూ ఫ్యాన్స్ ప్రశంసించారు. ఈ చిత్రం గురించి శివన్న మాట్లాడుతూ.. ‘‘45’’ నా 129వ చిత్రం. నా మొదటి చిత్రం ఆనంద్ చేసేటప్పుడు నాకు ఎలాంటి భయం - భక్తి ఉన్నాయో, ఈ సినిమా చేసేటప్పుడు కూడా అవే ఉన్నాయి. అర్జున్ జన్య నాకు ఈ కథ చెప్పినప్పుడు, నేను చాలా ఆశ్చర్యపోయాను. అతనికి అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో అని నేను ఆశ్చర్యపోయాను. 45 అంటే ఏదైనా కావచ్చు.. ఒక రోజు, ఒక సెకను, ఒక నిమిషం. ఇది ఒక్క వ్యక్తి సినిమా కాదు.. ఇది చూసే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది..కనెక్ట్ చేస్తుంది.. అని అన్నారు. డిసెంబర్ 25న కన్నడలో విడుదలైన తర్వాత, ఈ చిత్రం జనవరి 1, 2026న హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో థియేటర్లలోకి వచ్చింది.
శివరాజ్ కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతడు రజనీకాంత్ జైలర్ 2 లో కూడా పెద్ద పాత్రలో నటిస్తున్నానని ఘనంగా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలు అతడికి గేమ్ ఛేంజర్‌గా మారతాయని ఆశిస్తున్నాడు. శివరాజ్ కుమార్ టాలీవుడ్‌లో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు అత్యంత సన్నిహితుడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఆయన లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments