వెండి తెరపై దువ్వాడ జంట
- Guest Writer
- 4 days ago
- 2 min read

సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తీసుకొచ్చిన వైబ్ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. కొంత కాలం వీళ్ల హవా సాగింది. షార్ట్స్, మీమ్స్, రీల్స్.. ఎక్కడ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెరపై కూడా ప్రత్యక్ష్యం కాబోతోంది ఈ జంట. ఈనెల 21న విడుదల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంటని చూడొచ్చు. ఇద్దరిదీ అతిథి పాత్రే. కాసేపే తెరపై ఉంటారు. కాకపోతే ఆ ఎంట్రీ మాత్రం సర్‌ప్రైజింగ్ గా ఉండబోతోందని టాక్.
నిజానికి ఇటీవల విడుదలైన ఓ సినిమాలో దువ్వాడ జంటకు ఇలాంటి ఆఫరే వచ్చింది. కానీ వాళ్లిద్దరూ ఎందుకో ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం ఓకే చేసేశారు. శ్రీనివాస్ సంగతేమో గానీ, మాధురికి మాత్రం సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని ఆశ. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది కూడా అందుకే. బిగ్ బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ వస్తుందని ఆశించింది. ఇప్పుడు అదే నిజమైంది కూడా. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన సినిమా ఇది. ఇందులో సుమ కనకాల ఓ కీలక పాత్ర పోషించారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిలతో పాటు ఈ సినిమాలో ఇంకొన్ని సర్‌ప్రైజులు కూడా ఉండబోతున్నాయట. అవేంటో సినిమా విడుదల అయితేనే తెలుస్తుంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
ఎంఎస్‌జీ కోసం మెగా మాస్ బీట్..?

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. షైన్‌స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు భీమ్స్. ఆ సెంటిమెంట్‌తోనే మెగా సినిమాకు ఆయన్ను కంటిన్యూ చేస్తున్నారు. ఐతే భీమ్స్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అతను అదరగొట్టేస్తున్నాడు.
ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మీసాల పిల్ల సాంగ్.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల అంటూ వచ్చింది. ఆ సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి ఈ ఏజ్ లో కూడా గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో అలరిస్తున్నారు. ఐతే ఈ సాంగ్ సినిమాలోని సూపర్ హిట్ మెలోడీగా ఉండబోతుంది. ఐతే మెగా ఫ్యాన్స్ కోసం భీంస్ సినిమాలో ఒక మెగా మాస్ బీట్ రెడీ చేశాడట. చిరంజీవి సినిమాలో ఒక మాస్ బీట్ సాంగ్ ఉండాల్సిందే. అదే ఫుట్ ట్యాపింగ్ గా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.
భీమ్స్ ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. చిరంజీవి మాస్ సాంగ్స్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ ని కంపోజ్ చేశాడట భీమ్స్. అందులో అనిల్ కూడా సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉంటే వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేసినట్టు అవుతుందని భీమ్స్‌తో డిస్కస్ చేసి మరీ అలా సెట్ చేశారట. సో మన శంకర వరప్రసాద్ గారు సాంగ్స్ పరంగా అదే మెగా మాస్ బీట్ తో మెగాస్టార్ డ్యాన్స్‌తో కూడా ఫీస్ట్ ఇస్తాడని టాక్.
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటూనే మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలన్నీ పెడుతున్నాడట. సంక్రాంతికి అనిల్ సినిమా పక్కా సూపర్ హిట్ కానీ ఈసారి చిరుతో చేస్తున్న ఈ అటెంప్ట్ డబల్ ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఈ సినిమా అవుట్ పుట్ మీద కూడా చిరంజీవి సూపర్ హ్యాపీగా ఉన్నాడని తెలుస్తుంది. మరి సంక్రాంతికి ఈ సినిమా ఏ రేంజ్ మెగా ఫీస్ట్ అందిస్తుంది అన్నది చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మాత్రమే కాదు నెక్స్ట్ విశ్వంభర సినిమా కూడా లైన్ లో ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తైనా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ జరుపుకుంటుంది. సినిమాను నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఐతే విశ్వంభర సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసినా సరే ఆ సినిమాకు ఎందుకో ఆశించిన రేంజ్ లో బజ్ అయితే రావట్లేదు. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఆ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments