top of page

విద్యుత్‌సంస్థకే షాక్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • ప్రమాదంలో మరణించిన ముగ్గురికి పరిహారం

  • అటువంటి నిబంధన ఉన్నట్లే చాలామందికి తెలియదు

  • కానీ దాన్ని పట్టుకుని తుదికంగా పోరాడిన శ్యాంప్రసాద్‌రెడ్డి

  • అంతే చొరవతో మంజూరు చేసిన ఈపీడీసీఎల్ సీఎండీ

  • బాధితుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

` వారం పది రోజుల క్రితం టెక్కలి ప్రాంతంలో ఒక బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆనుకుని ఉన్న రాడ్‌ను పట్టుకుని విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. కానీ స్థానిక విద్యుత్ అధికారులు దాన్ని ఇంట్లో జరిగిన ప్రమాదంగా రిపోర్టులు రాసి కేసు మూసేశారు. ఫలితంగా ఆ బాలుడిని కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆర్థిక ఉపశమనం లభించలేదు.

` కానీ సుమారు పది నెలల క్రితం కంచిలి మండలం చిల్లపుట్టుగ గ్రామంలో వీధిలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు కరెంటు షాక్ గురి కాగా వారితో పాటు వారిని రక్షించడానికి వెళ్లిన ఒక యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఈపీడీసీసీఎల్ (తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) నుంచి భారీగా నష్టపరిహారం అందింది.

ఇదెలా సాధ్యం. మొదటి ప్రమాదంలో బాధితులకు అందని పరిహారం.. రెండో ఉదంతంలో బాధితులకు ఎలా అందింది అని ప్రశ్నలు వేసుకుంటే పలు కారణాలు చెప్పాల్సి వస్తుంది. వీటిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన కారణం.. ప్రజల్లో విద్యుత్ చట్టాలపై అవగాహన అస్సలు లేకపోవడమే. కాగా ప్రమాదాల గురించి ఉన్నతాధికారులకు సరైన నివేదికలు పంపని స్థానిక విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఈ పరిస్థితికి కారణాలు కాగా కష్టసమయాల్లో ప్రజలకు అండగా నిలిచి గైడ్ చేయాల్సిన నాయకత్వం స్పందించే తీరు బాధితులకు అందే న్యాయాన్ని ప్రభావితం చేస్తుందనడానికి కూడా పై రెండు ఘటనలను తార్కాణంగా పేర్కొనవచ్చు. టెక్కలి ప్రమాదంపై స్థానిక నాయకత్వం స్పందించకపోవడం వల్ల బాధిత కుటుంబం పరిహారానికి నోచుకోలేదు. అదే కంచిలి మండల ఉదంతంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైకాపా కో ఆర్డినేటర్ సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి తుదికంటా బాధితులకు అండగా నిలిచి, వారి తరఫున ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులను కలిసి దాదాపు తొమ్మిది నెలలు వారి వెంటపడి బాధిత కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కల్పించడంలో కతకత్యులయ్యారు. జరిగిందేమిటంటే..

తొలుత తిరస్కరణ

గత ఏడాది మే నెలలో కంచిలి మండలం తలతంపర పంచాయతీ శివారు గ్రామమైన చిల్లపుట్టుగలో సంబరాలు జరిగాయి. ఆ సందర్భంగా గ్రామాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సంబరాలు ముగిసినా రెండు రోజులపాటు విద్యుత్ తోరణాలు తీయలేదు. ఆ సమయంలో గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నపిల్లలు మే 26న ఆడుకుంటూ విద్యుత్ తోరణాలను వేలాడదీయడానికి వాడిని జీఐ వైరును తాకారు. అది ఎక్కడో విద్యుత్ వైరుకు కనెక్ట్ కావడం వల్ల షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించారు. వారిని కాపాడటానికి వెళ్లిన మరో యువకుడు కూడా మత్యువాత పడ్డారు. యథాప్రకారం విద్యుత్ సిబ్బంది దీన్ని పట్టించుకోలేదు. ఈ సమాచారం తెలుసుకున్న ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబాలకు తలో రూ.5వేలు చొప్పున తక్షణ సాయం అందించారు. కానీ అక్కడితో ఆయన ఆగిపోలేదు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళం వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిసి బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే విశాఖలోని ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీఎండీ పధ్వీతేజ్‌ను కలవడానికి ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్స్ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కానీ ఆయనతో సహా అక్కడి విద్యుత్ అధికారులు నిబంధనలు, లాజిక్కులు మాట్లాడారు. సంబరాలకు అనుమతి లేకుండా విద్యుత్ అలంకరణలు చేయడమే తప్పని.. గ్రామస్తుల తప్పు వల్ల మరణించిన వారికి నష్టపరిహారం ఎలా ఇస్తామన్నట్లు మాట్లాడారు.

చట్టం ఏం చెబుతోంది?

అధికారులు ఒక పట్టాన అంగీకరించకపోవడంతో శ్యాంప్రసాద్‌రెడ్డి చట్ట నిబంధనల్లోకి వెళ్లారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) 2017లో అమల్లోకి తెచ్చిన రూల్స్‌లోని రెండో నిబంధన ప్రకారం విద్యుత్ ప్రమాదాల్లో డిపార్ట్‌మెంటు బయటి వ్యక్తులు మరణిస్తే వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లÅ£ాలు, 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తిస్తే రూ.2 లక్షల పరిహారం. 40 నుంచి 60 శాతం వైకల్యం ఉంటే రూ.60 వేలు చెల్లించాలని స్పష్టంగా ఉంది. ఈ నిబంధనలనే ఉపయోగించి శ్యాంప్రసాద్‌రెడ్డి ఈపీడీసీఎల్ అధికారులతో పోరాడారు. ఒక దశలో వాళ్లు అంగీకరించకపోతే మానవహక్కుల కమిషన్‌కు, చైల్డ్ రైట్స్ కమిషన్‌కు వెళ్తామని స్పష్టం చేయడంతో అధికారులు దిగివచ్చారు. అంతేకాకుండా విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా ఆయన గట్టిగా ప్రస్తావించారు. ముందస్తు అనుమతుల్లేకుండా సంబరాలకు విద్యుత్ వాడటం తప్పే. కానీ దాన్ని అడ్డుకోవాల్సిన స్థానిక విద్యుత్ సిబ్బంది ఉపేక్షించడం, సంబరాలు ముగిసిన తర్వాత కూడా విద్యుత్ వైర్లు తొలగించకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యలను అధికారుల ముందు పెట్టి ఈ నిర్లక్ష్యాలకు అమాయక పిల్లలు బలికావడానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించడంతో అధికారులు దిగిరాక తప్పలేదు.

సీఎండీ స్థాయిలో సహకారం

దానికితోడు ఈపీడీసీఎల్ సీఎండీ పధ్వీతేజ్ కూడా సానుకూల దక్పథంతో వ్యవహరించి ఎప్పటికప్పుడు కిందిస్థాయి నుంచి అవసరమైన డాక్యుమెంట్లు తెప్పించుకుని పరిహారం ఫైలు క్లియర్ అయ్యేలా చొరవ తీసుకున్నారు. ఆయన చొరవ ఫలితంగానే ఈ నెల మొదటివారంలో ముగ్గురు మతులకు చెరో రూ.5 లక్షల పరిహారం మంజూరు చేస్తూ ఈపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత బ్యాంకు అకౌంట్ నెంబర్లు, మరికొన్ని వివరాలు తీసుకుని మొత్తం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఫలితంగా బుధవారం రాత్రి బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం జమ అయ్యింది. చట్టాల పట్ల అవగాహన, స్పందించే సహాయపడే నాయకులు, అంతే చొరవతో పనిచేసే అధికారులు ఉంటే బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందనడానికి ఈ ఉదంతమే పెద్ద ఉదాహరణ. ఇందుకు కషి చేసిన వారిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇటువంటి కేసులో నష్టపరిహారం అందడం బహుశా ఇదే తొలి సందర్భమేమో!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page