top of page

వైఫల్యమే ఉత్తమ గురువు!

  • Guest Writer
  • 7 days ago
  • 3 min read

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి నటికీ సక్సెస్ అనేది ఓ కల. వైఫల్యాలను స్వీకరించి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది అంతకు మించిన మరో గొప్ప కళ. బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తనకు ఎదురైన ప్రతి పరాజయాన్ని ఒక అపజయంగా కాకుండా తనను తాను మెరుగుప రుచుకునే ఒక ఉత్తమ గురువుగా భావిస్తూ ముందుకు సాగుతోంది. వృత్తిపరమైన ప్రయాణంలో కృతి సనన్ ఎప్పుడూ ఒకే పద్ధతికి పరిమితం కాలేదు. గ్లామర్ పాత్రల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వరకు ఆమె ఎంచుకున్న ప్రతి సినిమా ఒక ప్రయోగమే.

అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయినప్పుడు ఆమె నిరాశకు గురికాకుండా ఆ వైఫల్యాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషించుకుంటుందిట. ఒక నటిగా తనలో ఇంకా ఎలాంటి మార్పులు అవసరమో? తెలుసుకోవడానికి ఈ అనుభవాలే ఆమెకు దిశానిర్దేశం చేస్తాయంది. ప్రస్తుత తరం నటీమణులలో కృతి సనన్ ఎంతో పరిణతితో వ్యవహరిస్తుంది. ఒక సినిమా ప్లాప్ అయితే దాన్ని తన బాధ్యతగా స్వీకరిస్తానంది. తదుపరి ప్రాజెక్టులో తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకుంటానంటోంది. వైఫల్యం కలిగించే బాధను భరిస్తూనే దాని నుంచి వచ్చే పాఠాన్ని తన నటనలో ప్రతిబింబింపజేయడం అమ్మడి ప్రత్యేకతగా చెప్పుకొచ్చింది.

అందుకే `మిమీ` వంటి చిత్రంలో అమ్మడిలో అసలైన నటిని ప్రేక్షకులకు పరిచయం చేసానంది. నటనలోనే కాకుండా కథల ఎంపికలో కూడా కృతి సనన్ వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు కెరీర్ ఎదుగుదలకు ఎంతో దోహదం చేసాయింది . పరాజయాలు ఎదురైనప్పుడు కెరీర్ పట్ల మరింత కఠినంగా నిర్ణయాత్మకంగా వ్యవహరిం చడం కృతి సనన్ శైలిగా చెప్పుకొచ్చింది. తనను తాను నమ్ముకుని ప్రతి వైఫల్యాన్ని ఒక మెట్టుగా మలుచు కుంటానంది. అంతటి ప్రతిభావంతు రాలు కావడంతోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకోగల్గింది.

ఈ విషయంలో కృతి సనన్ ఎంతో మంది సీనియర్లను సైతం వెనక్కి నెట్టి రేసులో నిలిచింది. అమ్మడికి జాతీయ అవార్డు ఎంతో నిజాయితీగా వచ్చింది. ఆ రకంగా కృతి సనన్ నేటి తరం నటీమణులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగని అక్కడికే పరిమితం కాలేదు. ఇతర భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకుంటుంది. మహేష్ హీరోగా నటించిన `వన్` సినిమాతో టాలీవుడ్‌లోనూ లాంచ్ అయింది. అటుపై మరో రెండు.. మూడు తెలుగు సినిమాలు చేసింది. కానీ ఇక్కడ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. దీంతో తిరిగి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడే నిలదొక్కుకుంది.

కృతికి ఖచ్చితంగా హిట్ పడాల్సిందే!

కృతి శెట్టి టాలీవుడ్ ..కోలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, ట్యాలెంట్ ఉన్నా టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో కోలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడా అదే పరిస్థితి. కాకపోతే తెలుగు కంటే తమిళ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. సినిమా ప్లాప్ అయినా మరో ఛాన్స్ అందుకోగల్గుతుంది. అక్కడైనా ఇలా ఎంత కాలం. దీంతో అమ్మడి కెరీర్ హిట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి ఆశలన్నీ తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పైనే ఉన్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పడింది. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా గెస్ట్ రోల్ పోషించడం సినిమాకు కీలకంగా మారింది. ప్రత్యేకించి కృతి శెట్టికి తమిళంలో పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని ఎంతో ధీమాతో ఉంది. ఈ విషయంలో మేకర్స్ కూడా అంతే కాన్పిడెంట్‌గా ఉన్నారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సూపర్ హిట్ అయితే కృతి గ్రాఫ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. సినిమా గనుక ఆశించిన స్థాయిలో ఆడకపోతే? కృతిశెట్టి కెరీర్ మరిన్ని ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.

ఇప్పటికే కొత్త కథానాయికల నుంచి పోటీ పెరగడం, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో, పాత ఫామ్‌ను అందుకోవడం అమ్మడికి సవాలుగా మారింది. తమిళంలో విజయం సాధిస్తేనే తెలుగు మేకర్స్ ఆమె వైపు మళ్లీ చూసే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కృతిశెట్టి మాత్రం తనలో స్కిల్స్ ను మెరుగు పరుచుకుంటుంది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది.

ఈ నేపథ్యంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విజయం ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశీస్తుంది. తమిళ తంబీలు అమ్మడిని ఆదరిస్తే ఆ వేడి టాలీవుడ్‌కు తాకుతుందనడంలో సందేహం లేదు. చివరిగా ఈ సినిమా కృతి శెట్టికి మేక్ ఆర్ బ్రేక్ లాంటిదిగా చెప్పొచ్చు. సక్సెస్ అయితేనే ఆమెకు ఇండస్ట్రీలో మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. మరి బేబమ్మ టైమ్ ఎలా ఉందో చూడాలి. అలాగే కోలీవుడ్ లో ‘జెన్నీ’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. కానీ ఈ సినిమా మొదలై నెలలు గడుస్తున్నా మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా ఉందా? రద్దయిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 - తుపాకి.కామ్ సౌజన్యంతో...

లెనిన్’.... మంచి నిర్ణయం

వేసవి సినిమాల రిలీజ్ డేట్లు కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. ముందు అనుకొన్న సమయానికి సినిమాలు రావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? అనే విషయంలో అభిమానులకు కాస్త కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నిర్మాణ సంస్థలకు ఉంది. అఖిల్ సినిమా ‘లెనిన’ రిలీజ్ డేట్ కూడా డైలామాలో ఉన్న సంగతి తెలిసిందే. మే1న ఈ సినిమాని విడుదల చేస్తామని అప్పట్లో నిర్మాత నాగవంశీ ప్రకటించారు. అయితే ఆ తరవాత అలికిడి లేదు. ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ అవుతోంది. మరోవైపు ‘లెనిన’ కి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీ మొదలవ్వలేదు. దాంతో ‘లెనిన్’ వస్తుందా, రాదా? అనే డౌటు ఉంది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. లెనిన్ సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి, కొత్త రిలీజ్ డేట్ గా జూన్ 26న ఫిక్స్ చేసింది. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయిన నేపథ్యంలో `లెనిన్` తప్పుకోవడం మంచి నిర్ణయమే.

పైగా ‘లెనిన్’ ని హడావుడిగా విడుదల చేస్తే కుదరదు. అఖిల్ కెరీర్‌లో చాలా కీలకమైన సినిమా ఇది. గట్టి పోటీలో విడుదల చేసి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. జూన్ 26 ఓరకంగా సేఫ్ డేట్. అప్పటికి సమ్మర్ సినిమాల హడావుడి తగ్గిపోతుంది. మరోవైపు ఐపీఎల్ గోల కూడా ఉండదు. ప్రచారానికి తగినంత సమయం ఉంది. ఈలోగా రిపేర్లు ఉంటే చేసుకోవొచ్చు. వాయిదా విషయం ముందే ప్రకటించడం వల్ల అభిమానులకు, బయ్యర్లకు ఓ క్లారిటీ వస్తుంది. జూన్ 26 ముందే లాక్ చేయడం వల్ల మిగిలిన సినిమాలేమైనా ఈ డేట్ కి రావాలనుకొంటే మరో డేట్ చూసుకొనే వెసులుబాటు ఉంటుంది. వాయిదా వేయడం తప్పదు అనుకొన్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా ప్రకటించి, క్లారిటీ ఇవ్వడం చాలా అవసరం. నాగవంశీ ఇప్పుడు అదే చేశారు.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page