top of page

విభజన నుంచి మత విధ్వంసం వరకు..!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

ఒకప్పుడు అఖండంగా విలసిల్లిన విశాల భారతదేశం స్వాతంత్య్ర సంగ్రామ చివరి రోజులోలనే కొందరి కుటిల పన్నాగాల కారణంగా విభజనకు గురైంది. ఆ విధంగా పాకిస్తాన్ దేశం అవతరించింది. అనంతరం 1971లో తూర్పు పాకిస్తాన్‌లో రేగిన స్వేచ్ఛా పిపాస బంగ్లాదేశ్ విముక్తి పోరాటంగా రూపాంతరం చెంది పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ పేరుతో మరో కొత్త దేశంగా ఆవిర్భవించింది. అఖండ భారతాన్ని ముక్కలు చేసిన ఈ విభజనలు తద్వారా ఏర్పడిన మÖడు దేశాల్లోనూ కలిసిమెలసి ఉన్న ప్రజలను మతాలవారీగా మెజారిటీ, మైనార్టీ వర్గాలుగా మార్చేశాయి. భారతదేశంలో మైనార్టీ వర్గాలుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్, తదితర మతస్తులకు మన రాజ్యాంగం, చట్టాలపరంగా పూర్తి రక్షణ కల్పిస్తూ.. ఆ మతాల జనాభా వృద్ధికి, వికాసానికి దోహదం చేస్తుంటే కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మత విధ్వంసం జరుగుతున్నది. ఆ రెండు దేశాల్లో మైనార్టీ మతస్తులుగా ఉన్న హిందువులు తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. ఇదేవో ఊరికే చేస్తున్న ఆరోపణ కాదు. జనాభా గణాంకాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. హిందూ మెజారిటీ దేశమైన భారత్‌లో ముస్లిం జనాభా వృద్ధి శాతం అంతకంతకూ పెరుగుతుంటే.. పాక్, బంగ్లాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల జనాభా క్రమంగా క్షీణిస్తున్నది. ముఖ్యంగా మన దేశం సహకారంతోనే పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ పొంది స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్‌లో హిందూ మత హననం తీవ్రంగా జరుగుతున్నది. పాకిస్తాన్‌లో భాగంగా తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నప్పుడు అక్కడ 1951లో 22 శాతంగా ఉన్న హిందువుల సంఖ్య 1961లో 18.5 శాతానికి.. అనంతరం బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన తర్వాత కూడా 1974లో 13.5 శాతానికి, 1981లో 12.1 శాతానికి, 1991లో 10.5 శాతానికి, 2001లో 9.2 శాతానికి, 2011లో 8.5 శాతానికి, 2022లో 7.95 శాతానికి పడిపోవడం అక్కడ రాజ్యమేలుతున్న పరమత అసహనానికి తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తున్నది. ఈ మత విధ్వంసానికి పాకిస్తాన్‌లో భాగంగా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తున్న విధానాలు, చట్టాలే కారణమయ్యాయి. స్వాతంత్య్ర సమయంలో పాకిస్తాన్‌లో 27 శాతం, అందులో భాగంగా ఉన్న ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతంలో హిందూ జనాభా సుమారు 33 శాతం. కానీ అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం హిందువుల జనాభా పాకిస్తాన్‌లో 1.6 శాతానికి, బంగ్లాదేశ్‌లో 7.9 శాతానికి పతనమైంది. ఈ భారీ పతనం సహజసిద్ధంగా జరిగింది కాదన్నది వాస్తవం. దశాబ్దాలుగా ఆ దేశాల్లో అమలు చేస్తున్న విధానాలతోపాటు తీవ్ర వివక్ష, మతపరమైన వేధింపులు, ఆస్తుల అపహరణలు, బలవంతపు మతమార్పిడులు హిందూ జనాభాను పతనావస్థకు చేర్చాయి. అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయని పాకిస్తాన్ ఏర్పడిన తొలినాళ్లలో ప్రకటించినప్పటికీ 1949లో ఆమోదించిన అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ద్వారా పాక్ పాలకులు దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించడంతో మత విధ్వంసానికి పునాది పడింది. ఇక జనరల్ జియా ఉల్ హక్కు సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత 1970 దశకం చివరిలో పాక్‌లో ఇస్లామికీకరణ జోరందుకుంది. సామాజిక, రాజకీయ వ్యవస్థలను మార్చేసింది. సైనిక ప్రభుత్వం చేసిన చట్టాలు దేశంలోని ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన ఆయుధాలుగా మారాయి. చిత్రీకరిస్తూ పాఠ్యపుస్తకాల్లో హిందువుల జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించడం, మదర్సాల విస్తరణ వంటి చర్యలు మైనార్టీల మనుగడను క్లిష్టతరం చేశాయి. లాహ ర్, కరాచీ వంటి పురాతన చారిత్రక నగరాల జనాభాలో ఒకప్పుడు దాదాపు సగం వరకు ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు జీరోకు చేరుకుంది. ఇక 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో పాక్ సైన్యం జరిపిన అమానుష హత్యాకాండ, అలాగే ఆపరేషన్ సెర్చ్‌లైట్‌లో లక్షలాది హిందువులు ప్రాణాలు కోల్పోగా, కోటిమందికి పైగా శరణార్థులుగా భారత్‌కు వలస వచ్చేశారు. ఇక బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత 1975 నుంచి జరిగిన రాజ్యాంగ సవరణలతో బంగ్లాదేశ్ లౌకిక స్వభావాన్ని కోల్పోయి, ఇస్లాంను అధికారిక మతంగా స్వీకరించడం దేశంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని మరింత పెంచింది. భారత్‌తో సహా అంతర్జాతీయ సమాజం మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలను చాలా ఏళ్లుగా వ్యతిరేకిస్తున్నా.. ఇప్పటికీ ఆ దేశాల్లో హక్కుల హననం జరుగుతూనే ఉంది. పాకిస్తాన్‌లోని సింధ్ వంటి ప్రాంతాల్లో ఏటా వందలాది మైనారిటీ యువతులను అపహరించి, బలవంతంగా మతమార్పిడి చేయించి, ముస్లిం పురుషులతో వివాహాలు జరిపిస్తున్న దారుణ ఘట్టాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పురాతన హిందూ ఆలయాల విధ్వంసం, మతదూషణ ఆరోపణలతో న్యాయస్థానాల్లో విచారణలతో సంబంధం లేకుండానే మైనారిటీ హిందువులపై సామÖహిక దాడులు జరిపి చంపడం , వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అమానవీయ ఘటనలు పాక్, బంగ్లాల్లో తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో 2024లో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత హిందువులపై దాడులు ఇంకా పెరిగాయి. హిందూ దేవాలయాలు, ఆ మతస్తుల ఇళ్లు, ఇతర ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న నేతల అరెస్టులు, ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థల నిషేధానికి డిమాండ్లు వంటి పరిణామాలు బంగ్లాదేశ్‌లో హిందువుల జీవనం ఎంత ప్రమాదంలో పడిపోయిందో వెల్లడిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగంతోపాటు అమెరికా, బ్రిటన్ పార్లమెంటుల్లోనూ పలు సందర్భాల్లో పాక్, బంగ్లా సహా పశ్చిమాసియా దేశాల్లో హిందువులు, ఇతర మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ దేశాల్లో మైనారిటీలు సురక్షితంగా జీవించాలంటే సామాజిక మార్పులు అవసరమని, వివాదాస్పద చట్టాలను సవరించాలని సామాజికవేత్తలు, మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page