వాళ్లంతా మనోడి శిష్యులేనోయ్!
- NVS PRASAD

- 5 days ago
- 2 min read
అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో ఏడుగురికి బదిలీ
మళ్లీ ఇక్కడికి రావడానికి పైరవీ
ఈలోగా సమగ్రశిక్షను కంపు చేసేందుకు మాస్టారి పన్నాగం
కొత్తగా ఎవరూ చేరకుండా బెదిరింపులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆమధ్య శ్రీకాకుళం సమగ్రశిక్షలో ఒరిజినల్ పోస్ట్ ఫీల్డ్ ఇంజినీర్‌గాను, తెచ్చిపెట్టుకున్న హÃదా డీఈగాను పని చేస్తున్న కొందర్ని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు బదిలీ చేశారు. ఈ ఏడుగురూ ఇక్కడి నుంచి బదిలీ అయిపోయినా, అక్కడ మాత్రం విధులు నిర్వహిస్తున్నట్లు కనిపించడంలేదు. ఎందుకంటే.. మళ్లీ ఇక్కడికి రావడానికి ప్రయత్నంలో భాగంగా ఇక్కడే కనిపిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వీరిని స్వయంగా రాష్ట్ర డైరెక్టరే బదిలీ చేస్తే, మళ్లీ ఇక్కడికి వస్తామని తొడగొడుతున్న వెనుక ధైర్యం ఎవరంటే.. మన మాస్టారే. ఆమధ్య కాలం వరకు సమగ్రశిక్షలో ఏపీసీగా పని చేసి, ఇటువంటి వారిని వెనకేసుకొచ్చిన ఈయన ఇప్ప్పుడు ఒక ఎమ్మెల్సీని పట్టుకొని మళ్లీ శ్రీకాకుళం తీసుకొస్తానని అభయమివ్వడంతోనే వీరంతా ఈ రెండు జిల్లాల్లో పని చేయకుండా శ్రీకాకుళంలో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. బదిలీ అయిన ఈ ఏడుగుర్ని ఇక్కడికి తీసుకురావడం వెనుక ఈ లెక్చరర్‌కు ఉన్న ఇంట్రస్ట్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన లక్ష్యం ఎసఎసఏకు మళ్లీ ఏపీసీగా రావడమే. కానీ ఇప్ప్పుడా పోస్టు ఖాళీగా లేదు. అది ఖాళీ అయితేనే ఈయన్ను అక్కడ కూర్చోబెడతామని బహుశా ఎవరో అభయమిచ్చుంటారు. అందుకే ఈలోగా ఇక్కడ సమగ్రశిక్షను వీలైనంత కంపు చేసి, ఇక్కడి ఏపీసీని అనిశ్చితిలో పెట్టి, ఆయన మీద ఫిర్యాదులు వండి నెమ్మదిగా సాగనంపితే అక్కడికి రావాలని చూస్తున్నారు. అందుకు ఈ ఏడుగుర్నీ ఇక్కడికి తెస్తామని హామీ ఇచ్చి, ఈలోగా ఇక్కడ సమగ్రశిక్షలో పని చేస్తున్న వారిపై బురద జల్లించడానికి ఇందులో కొందర్ని మన గురువుగారు పావుగా వాడుకుంటున్నారట. అసలు ఈ ఏడుగుర్నీ ఎందుకు బదిలీ చేశారో మన లెక్చరర్‌కు తెలియదు. ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నవారు, జెన్యూన్‌గా చదివినవారు అందరూ ఉన్నారు. ఆ విషయం మరోసారి చర్చించుకుందాం. కొన్నాళ్ల క్రితం స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమావేశం నిర్వహించారు. దీనికి ఈ ఏడుగురూ హాజరుకాలేదు. వీరు చేపట్టిన పనులకు సంబంధించి ఎటువంటి రిపోర్టూ చేయలేదు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎస్‌పీడీ మెమో ఇచ్చినా కూడా వీరు కనీసం స్పందించలేదు. ఒక స్టేట్ హెడ్ అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోవడం కాండక్ట్ రూల్స్ మేరకు నేరం. అందుకే వీరిని ఈ ఏడాది జనవరి 21న బదిలీ చేయాలంటూ కలెక్టర్‌కు ఎస్‌పీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీన్ని ఆపించుకోవాలని వీరప్రయత్నాలు చేశారు. కానీ జనవరి 29న వీరిని ఇక్కడి నుంచి రిలీవ్ చేసి, రెండు జిల్లాలకు ఎటాచ్ చేశారు. కానీ వీరు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అక్కడ చేరారు. ఈలోగా మన లెక్చరర్ ఈ ఆదేశాలు ఆపడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో వీరు అక్కడ చేరారు. అయితే ఈ ఏడుగురిలో చాలామంది శ్రీకాకుళంలోనే రోజూ కనిపిస్తున్నారు. ముఖ ఆధారిత హాజరు వేయాల్సి ఉన్నా, వీరు శ్రీకాకుళంలో కనిపిస్తుండటం వెనుక మర్మమేమిటని ఆరా తీస్తే, ఈ రెండు మన్యం జిల్లాలకు డీఈగా ఒకే అధికారి పని చేస్తున్నారు. అంటే ఈ ఏడుగురికీ బాస్ ఒకరే. తమ జీతంలో సగం అక్కడిచ్చేసి హాజరు మేనేజ్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీ అయిన ఈ ఏడుగురి స్థానంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లను తేవడానికి ప్రయత్నిస్తుంటే.. దాన్ని వీరు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారట. అయినా ఇద్దరు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఇక్కడ చేరారు. వారిని బెదిరిస్తున్నారని కూడా చెప్ప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఏడుగురిలో మెజారిటీ ఉద్యోగులు తాము ఇక్కడ చేయించిన పనులకు తాము వచ్చాక బిల్లులు వస్తాయని, ఈలోగా కొత్తవారు రాకుండా అడ్డుకోవాలని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉంటే మంత్రి పేషీతోను, వైకాపా అధికారంలో ఉన్నప్ప్పుడు ధర్మాన కష్ణదాస్ పేషీలోను మకాం వేసి పనులు చేయించుకునే ఒక ఫీల్డ్ ఇంజినీర్ ప్రస్తుతం పాత ఏపీసీతో చేతులు కలిపి జిల్లాలో సమగ్రశిక్షను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదని తెలుస్తుంది. నిమ్మాడ, మబగాంల మధ్య తన సర్వీసంతా గడిపేసిన ఈ ఉద్యోగి ఇప్ప్పుడు బదిలీ కావడంతో రాజకీయంగా జిల్లాలో సునామీ వస్తుందన్నంత రీతిలో కలరింగ్ ఇస్తున్నారు. రిటైరైన ఒక డీఈని ఇక్కడ ఎఫఏసీ ఈఈగా నియమించారు. ఇప్ప్పుడు ఆయన్ను లేపేయడానికి ఈ రాజకీయ ఉద్యోగి చేయని ప్రయత్నమంటూ లేదట. నిత్యం ఎవరో ఒకరి మీద బురద చల్లడం, ఫేక్ కంప్లైంట్లు వండి వార్చడం, దాన్ని పట్టుకొని మంత్రుల పేషీల చుట్టూ తిరిగి చర్యలు తీసుకునేలా చూడటం, తద్వారా ఎసఎసఏ మీద ఏపీసీ కంటే, ఎస్‌పీడీ కంటే తనకే పట్టుందని నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో రాజకీయ నాయకులను గట్టిగా వాడేయడంతో విసుగుచెంది విరక్తిలోకి వెళ్లిపోయారు ఎసఎసఏ ఉద్యోగులు. ఎప్ప్పుడైతే ఈ ఏడుగురి బదిలీలో ఈయన కూడా ఉన్నారో జిల్లా ఎసఎసఏ కార్యాలయం ఊపిరి పీల్చుకుంది. తాము లేకపోతే ఎసఎసఏ లేదనుకునేవారు ఇప్ప్పుడు అనేక ఫేక్ వ్యవహారాలకు తెర లేపుతున్నారు. ఎంతైనా కాలేజీలో పాఠాలు చెప్పకుండా ఆయన, ఎసఎసఏలో పనులు పర్యవేక్షించకుండా వీరు ఒకే బోటులో పయనిస్తున్నారు.






Comments