top of page

శంకరవరప్రసాద్‌ గారు హిట్టు కొట్టారు!!

  • Guest Writer
  • 5 days ago
  • 3 min read

చిరు, వెంకీ నటించిన ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ ఒక పెద్ద కథ చెప్పే సినిమా కాదు. ఇది చిరంజీవిని సరైన విధంగా ప్రెజెంట్‌ చేసే, లైట్‌గా నవ్విస్తూ ముందుకు వెళ్లే ఫీల్‌-గుడ్‌ ఎంటర్టైనర్‌. కానీ బలమైన డ్రామా, గట్టిగా కదిలించే కాన్ఫ్లిక్ట్‌ మాత్రం లేకపోవడం వల్ల ఇది ‘‘బాగుంది’’ అన్న దగ్గరే ఆగిపోతుంది. మొత్తానికి, ఇది థియేటర్‌లో నవ్వించి సంతోషపెట్టే సినిమా, సంక్రాంతికి ఫెరఫెక్ట్‌ ఎంటర్టైనర్‌. ఇపుడు వివరంగా ఈ చిత్రం గురించి చర్చించుకుందాం

నేషనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ శంకర వరప్రసాద్‌(చిరంజీవి)కి కెరీర్‌ పరంగా హ్యాపీగా ఉన్నా పర్శనల్‌ లైఫ్‌ లో ఓ తీరని వేదన ఉంటుంది. అది తను ప్రేమించి పెళ్లి చేసుకున్న శశిరేఖ(నయనతార)తో విడాకులు తీసుకుని, ఇద్దరు పిల్లలకు దూరమై విడిగా ఉండటం. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి నితిన్‌ శర్మ(శరత్‌ సక్సేనా) సాయంతో శంకర్‌ ప్రసాద్‌ తన పిల్లల్ని కలిసేందుకు డెహ్రూడూన్‌ లోని వారు చదువుకునే స్కూల్‌కి పీఈటీ టీచర్‌గా వెళ్తాడు. అక్కడ వారిని తను వారికి తండ్రి అని చెప్పకుండా ఇంప్రెస్‌ చేయటానికి ప్రయత్నిస్తాడు. మొదట బ్యాడ్‌ అయ్యినా తర్వాత మెల్లిగా పిల్లలు ఇద్దరికీ దగ్గర అవుతాడు.

దాంతో తనకు కూడా టైమ్‌ ఇవ్వకుండా పిల్లలు కొత్తగా వచ్చిన పీఈటీ టీచర్‌తో అంతలా క్లోజ్‌గా ఉండటంతో ఎవరా టీచర్‌ అని డౌట్‌ వచ్చి చూసిన శశిరేఖకు ప్రసాద్‌ కనపడటం, వార్నింగ్‌ ఇవ్వటం వరసగా జరిగిపోతాయి. అదే సమయంలో శశిరేఖ మీద, ఆమె తండ్రి జీవీఆర్‌( సచిన్‌ కేడేకర్‌) మీదా ఎటాక్‌ జరుగుతుంది. ఆ క్రమంలో హై ఎండ్‌ సెక్యూరిటీ కావాలని సెంట్రల్‌ గవర్నమెంట్‌ని రిక్వెస్ట్‌ చేస్తుంది శశిరేఖ. అప్పుడు మళ్లీ శంకర్‌ వరప్రసాద్‌ ఎంట్రీ ఇస్తాడు. ఆయన్ని అపాయింట్‌ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తన మాజీ భార్యకే సెక్యూరిటీగా వచ్చిన ప్రసాద్‌ ఏం చేసాడు... ఆమెకి ఎలా దగ్గరయ్యాడు? అసలు శంకర్‌ప్రసాద్‌, శశిరేఖ ఎందుకు విడిపోయారు.? జీవిఆర్‌పై ఎటాక్‌ చేసింది ఎవరు? ఈ కథలోకి కర్నాటకలో పెద్ద బిజినెస్‌మేన్‌ అయిన వెంకీ గౌడ(వెంకటేష్‌) ఎలా వచ్చాడు?చివరికి శశి, శంకర్‌ కలిసారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలిసిస్‌

అనీల్‌ రావిపూడి సినిమాల్లో కథగా చెప్పుకోవటానికి ఉండదు. ఓ సింపుల్‌ లైన్‌ తీసుకుని అందులో ఫన్‌ని ఫిల్‌ చేసుకుంటూపోతాడు. ఇందులోనూ అదే చేసాడు. అయితే ఇక్కడ మరో ఎలిమెంట్‌ని ప్రత్యేకంగా యాడ్‌ చేసారు. అదే మెగా ఇమేజ్‌.. టైమింగ్‌. కేవలం ఫన్‌ కోసమే కాకుండా చిరంజీవిలోని ఫన్‌ యాంగిల్‌ని ఎలివేట్‌ చేసే విధంగా సీన్స్‌ అల్లుకున్నాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే మన శంకర వర ప్రసాద్‌ గారు పూర్తిగా ‘‘స్టోరీ కంటే స్టార్‌-పర్సెప్షను మీద నిర్మితమైన స్క్రిప్ట్‌. ప్రసాద్‌ అనే పాత్రను అనిల్‌ రావిపూడి ఒక కథ అవసరంగా కాకుండా, చిరంజీవి అనే స్క్రీన్‌-మిథ్‌కు న్యారేటివ్‌ ఫ్రేమ్‌గా డిజైన్‌ చేశాడు. చిరంజీవి వయస్సు, గ్రావిటాస్‌, టైమింగ్‌, మాస్‌ అప్పీల్‌ అన్ని బాలెన్స్‌ అయ్యేలా మలిచాడు. ఇక్కడ ‘ప్రసాద్‌ పాత్రే సినిమా డెస్టినీ ఏంటనేది నిర్ణయిస్తుంది. అంటే కథ ఏమిటన్నది కాదు, చిరంజీవి ఆ పాత్రలో ఎలా కనిపిస్తాడు అన్నదే ప్రేక్షకుడి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. ఇది స్టార్‌-డ్రివన్‌ స్క్రీన్‌ప్లే.. కథ పాత్రను మొయ్యదు, పాత్రే కథను మోస్తుంది.

మొదటి పది నిమిషాలు కొంచెం అనీజీగా అస్థిరంగా అనిపిస్తుంది. స్టోరీ వరల్డ్‌ని సెటప్‌ చేసే విధానం తడబడినట్లే కనిపిస్తుంది. కానీ ఒకసారి టోన్‌ సెట్‌ అయిన తర్వాత, సినిమా ఇంటర్వెల్‌ వరకూ క్లీన్‌ కామెడీ రిథమ్‌లో సాఫీగా నడుస్తుంది. ఇక్కడ స్క్రీన్‌ప్లేని స్టోరీతో కాదు, సిట్యుయేషనల్‌ కామెడీÊస్టార్‌ చార్మ్‌తో ఆడియెన్స్‌ను హుక్‌ చేయడం అన్న యాంగిల్‌లో రాసుకుంటూ వెళ్లారు. కథలో ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ కాదు. ‘‘ఈ సిట్యుయేషన్‌లో చిరంజీవి ఎలా రియాక్ట్‌ అవుతాడు?’’ అన్నట్లుగా సీన్స్‌ ప్లాన్‌ చేశారు. అవే కలిసొచ్చాయి. ఈ స్క్రిప్ట్‌లో నిజమైన డ్రామాటిక్‌ కాన్ఫ్లిక్ట్‌ చాలా తక్కువ. సీన్‌లు ‘‘ఇన్సిడెంట్స్‌లా ఉంటాయి, ‘‘టర్నింగ్‌ పాయింట్స్‌లా కాదు.అందుకే సెకండ్‌ హాఫ్‌ ఎపిసోడ్స్‌తో నడుస్తుంది, కానీ కథతో కలసి నడవదు.

ఈ సినిమా లోపల అతిపెద్ద స్క్రిప్ట్‌ ఇబ్బంది విలన్‌ ట్రాక్‌: అది కేవలం ‘‘ఫార్మల్‌ స్టేకు కోసం పెట్టినట్టు ఉంటుంది. విలన్‌ మరింత స్ట్రాంగ్‌ అయితే కథకు,సీన్స్‌ కు, ఫన్‌ కు అడ్డు వస్తాడని భావించినట్లున్నారు. వాస్తవానికి ఈ సినిమాల్లో ప్రసాద్‌కు నిజమైన కాంప్లిక్ట్‌ విలన్‌ కాదు. అతని జర్నీ: కుటుంబం, పిల్లలు, సంబంధాలు, తన పాత్రలోని మానవత్వం. కాబట్టి విలన్‌ ట్రాక్‌ కథకు విరుద్ధంగా కాకుండా, కథకు పక్కన నిలవటమే మంచిదైనట్లు ఉంది.

వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌:

న్యారేటివ్‌ క్యామియో, డ్రామాటిక్‌ టూల్‌ కాదు అంటే కథలో పెద్ద మార్పులు తీసుకొచ్చే పాత్ర అయితే కాదు. పాత పాటలకు డ్యాన్స్‌, స్కిట్‌లా ఉన్న సీన్స్‌.. ఇవి ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేయాటానికి పనిచేస్తాయి కానీ కథను ఎక్కడికీ మళ్లించవు. ఇక్కడ వెంకటేష్‌ పాత్ర సినిమాకు డెకరేషన్‌ మాత్రమే.

మాస్టర్‌ రేవంత్‌ క్యారెక్టర్‌:

రిపిటేషన్‌కు బదులు రీఇన్వెన్షన్‌ ఇది అనిల్‌ రావిపూడి స్క్రీన్‌రైటింగ్‌ మేచ్యూరిటీకి మంచి ఉదాహరణ. సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు తరహా క్యారెక్టర్‌ని కాపీ చేయడం సులువు. కానీ ఇక్కడ అదే నటుడు కొత్త క్యారెక్టర్‌...కొత్త బిహేవియర్‌ ప్యాటర్న్‌. చిరంజీవితో మాస్టర్‌ రేవంత్‌ ఉన్న రెండు సీన్స్‌ నిజమైన పర్ఫార్మెన్స్‌-డ్రివన్‌ కామెడీ. రొమాంటిక్‌ ట్రాక్‌ ఉన్నంతలో మేచ్యూర్‌ ఎమోషన్‌ ఉంది. న్యారేటివ్‌ టూల్‌గా పాటలుని వాడటం బాగుంది.

ఆ మూడు సినిమాలనే...

ఈ సినిమా ఓ రకంగా చెప్పాలంటే డాడీ కథనే అటు ఇటు తిప్పారనిపిస్తుంది. ఇలాంటి కథతోనే వెంకటేష్‌ తులసి చేశాడు, అజిత్‌ విశ్వాసం కూడా చేశాడు. ఈ మూడు సినిమాలు కలిపితే మన శంకర వరప్రసాద్‌ గారు అనిపించవచ్చు.

స్క్రిప్ట్‌లో అతిపెద్ద మిస్‌:

శశిరేఖ డైవోర్స్‌కు ఎమోషనల్‌ జస్టిఫికేషన్‌ లేకపోవడం. లైట్‌గా టచ్‌ చేసుకుంటూ వెళ్లారు. మానసిక సంఘర్షణ లేదు. ‘‘ఎందుకు విడిపోయారు?’’ అనే ప్రశ్నకు స్క్రీన్‌ప్లే సరైన ఎమోషనల్‌ ఆన్సర్‌ ఇవ్వదు. ఇది చాలా కీలకం ఎందుకంటే..ఇదే సినిమా భావోద్వేగ కోర్‌ కావాలి. దాంతో ఆ సీన్స్‌ తో మనం ‘‘వాళ్లు విడిపోయారు’’ అని తెలుసుకుంటాం, కానీ ‘‘అది వాళ్లకు ఎంత బాధ కలిగించింది?’’ అన్న అనుభూతిని అనుభవించం. ఆడియన్స్‌ పాత్రలతో ఎమోషనల్‌గా పూర్తిగా కనెక్ట్‌ కాకుండా, సన్నివేశాలను కేవలం ‘‘చూడటం’’ వరకు పరిమితం అవుతుంది.

టెక్నికల్‌ గా...

దర్శకుడుగా అనిల్‌ రావిపూడి ఈ సినిమాలో చేసిన ముఖ్యమైన పని: రిస్క్‌ తీసుకోవడం కాదు. టార్గెట్‌ ఆడియన్స్‌ సైకాలజీని మేనేజ్‌ చేయడం. లేడీస్‌ ఎపిసోడ్‌. జరీనా వాహబ్‌ -- నయనతార కాన్ఫ్రంటేషన్‌. చిరంజీవి -- పిల్లల సీన్స్‌. ఇవి అన్నీ ఆడియన్స్‌కు ఎమోషనల్‌ యాంకర్స్‌ గా పనికొచ్చాయి.

సమీర్‌రెడ్డి కెమెరా వర్క్‌ చాలా బాగుంది. భీమ్స్‌ పాటలు రిలీజ్‌కు ముందే మీసాల పిల్ల వంటివి మంచి హిట్‌ అయ్యాయి. అవే సినిమాకి ప్రధాన బలం. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ జస్ట్‌ ఓకే. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణంలో ఎక్కడా లోటు కనిపించదు.

నటీనటులు విషయానికి వస్తే..

చిరు లుక్స్‌ ఈ మధ్యకాలంలో చాలా బాగున్నది ఈ సినిమాలోనే. నయనతార విశ్వాసం, తులసి సినిమాలో చేసిన పాత్రనే ఈ సినిమాలో కంటిన్యూ చేసినట్లు అనిపిస్తుంది. సచిన్‌ కేడేకర్‌ ఎప్పటిలాగే పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. వెంకీ కేమియో జస్ట్‌ ఓకే. కేథరిన్‌, హర్షవర్ధన్‌, అభినవ్‌ గోమఠం వంటి ఆర్టిస్ట్‌ లు కామెడీ బాగానే పండిరది.

  • జోశ్యుల సూర్యప్రకాశ్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page