top of page

షూటింగ్స్‌ బంద్‌ : ఇంకెంత కాలం ?

  • Guest Writer
  • Aug 14
  • 2 min read
ree

టాలీవుడ్‌లో షూటింగులు నిలిచిపోయాయి. వేతనాలు పెంచాలని గత కొద్దిరోజులుగా ఫెడరేషన్‌ సమ్మెకు దిగింది. ఫెడరేషన్‌, నిర్మాతల మధ్య చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా ఈ అంశంపై నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారు. ఈ రోజు సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం కొన్ని అప్‌డేట్స్‌ ఇచ్చారు. వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నాం. అయితే కొన్ని షరతులు ఉన్నాయని చెప్పారు.

’’2018, 2022లో జరిగిన అగ్రిమెంట్స్‌లో ఉన్న రెండు షరతులను వాళ్లు అమలు చేయడం లేదు. ముందు వాటిని ఒప్పుకోవాలి. వీటితో పాటు మరో రెండు షరతులు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఛాంబర్‌ ద్వారా వాళ్ల దృష్టికి తీసుకొచ్చాం. వాటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే, వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమే’’ అన్నారు.

ప్రస్తుతం సానుకూల ధోరణిలో చర్చలు జరుగుతున్నాయని దిల్‌ రాజు చెప్పినప్పటికీ, సమ్మె విరమణ అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరో రెండు, మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉందని దిల్‌ రాజు చెబుతున్నారు. తమ విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంపు అన్నట్లుగా స్పష్టం చేశారు దిల్‌ రాజు. అయితే మొదటి నుంచి ఈ పాయింట్‌ దగ్గరే ఫెడరేషన్‌, నిర్మాతల మధ్య సంధి కుదరడం లేదు. మరి ఈ సమ్మె ఇంకెంత కాలం కొనసాగుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకం.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...



ప్రతి సినిమాకు భయం వేస్తుంది - అమీర్‌ ఖాన్‌!
ree

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. అటు బాలీవుడ్‌ లో సినిమాలు చేస్తూనే.. ఇటు సౌత్‌ హీరోలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి పేరు అందుకున్నారు. ముఖ్యంగా సౌత్‌ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ ఇటు సౌత్‌ ఆడియన్స్‌ ని కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఆయన రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాలో 15 నిమిషాల క్యామియో పాత్ర పోషించారు. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఒకవైపు సౌత్‌ సినిమాలలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్న అమీర్‌ ఖాన్‌.. మరొకవైపు బాలీవుడ్లో నటించిన చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’. అటు ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా ఈ సినిమాని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురాకుండా యూట్యూబ్లో రెంటల్‌ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు అమీర్‌ ఖాన్‌. ఈ సినిమాతో ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రతి సినిమాకి భయపడతాను అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమీర్‌ ఖాన్‌.

తాజాగా జవాన్లతో కలిసి సితారే జమీన్‌ పర్‌ సినిమా చూసిన అమీర్‌ ఖాన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’’ నేను ప్రతి సినిమాకు భయపడతాను. రిస్క్‌ ఉన్న సినిమాలను అంగీకరించడం అలవాటైపోయింది. అందుకే ప్రతి ప్రాజెక్టుకి కూడా భయం ఉంటుంది.. ఆ భయమే నన్ను మరింత కష్టపడేలా చేస్తోంది’’ అంటూ తెలిపారు అమీర్‌ ఖాన్‌. ప్రస్తుతం అమీర్‌ ఖాన్‌ చేసిన ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి. ఏదేమైనా ప్రేక్షకుడిని మెప్పించి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకోవాలి అంటే హీరోలు ఈ మాత్రం కష్టపడాల్సిందే అని నెటజన్స్‌ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇక సితారే జమీన్‌ పర్‌ మూవీ విషయానికి వస్తే.. ఏడాది జూన్‌ 20వ తేదీన విడుదలైన స్పోర్ట్స్‌ కామెడీ డ్రామా మూవీగా నిలిచింది ఈ చిత్రం. 2018లో విడుదలైన స్పానిష్‌ సినిమా ఛాంపియన్స్‌ ఆధారంగా అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై అమీర్‌ ఖాన్‌, అపర్ణ పురోహిత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌ హీరోగా.. జెనీలియా హీరోయిన్‌ గా నటించింది. దాదాపు రూ.65 -95 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ మూడవ చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. అలాగే ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో నాలుగవ భారతీయ చిత్రంగా కూడా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాని ఆగస్టు ఒకటి నుండి హిందీ తో పాటు తెలుగులో 100 రూపాయల రెంటల్‌ పద్ధతిలో ‘అమీర్‌ ఖాన్‌ టాకీస్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page