top of page

సంక్రాంతి బడ్జెట్‌: రూ.15 వేలు జేబులో ఉన్నాయా?

  • Guest Writer
  • 6 hours ago
  • 1 min read

ree

తమ నెలవారీ బడ్జెట్‌ లో సినిమాలకూ చోటు ఇవ్వడం తెలుగువాళ్లకు అలవాటు. వారం వారం ఒక్క సినిమా అయినా చూడాల్సిందే. నెలకోసారి కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లాల్సిందే. పండగ వస్తే, సినిమా బడ్జెట్‌ కాస్త పెరుగుతుంది. సంక్రాంతి వస్తే మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు రాబోతున్నాయి. సినిమా ప్రేమికులకు ఈసారి బడ్జెట్‌ తడిసిమోపెడు కాబోతోంది.

ప్రతీసారి సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి కనిపించడం మామూలే. కనీసం నాలుగు సినిమాలైనా పలకరిస్తాయి. అందులో స్టార్‌ హీరోల సినిమాలే అధికం. ఈసారి అయితే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు రాబోతున్నాయి. రాజాసాబ్‌, మన శంకర ప్రసాద్‌ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, పరాశక్తి, జననాయగన్‌ సంక్రాంతికి వస్తున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలు ప్రీమియర్ల నుంచే హడావుడి మొదలెట్టేస్తాయి. ఒక్కొక్క సినిమాకూ కనీసం 600 రూపాయలు టికెట్‌ ధర అనుకొంటే చిరు, ప్రభాస్‌, రవితేజ సినిమాలకే దాదాపు 1800 ఖర్చవుతాయి. మిగిలిన సినిమాల టికెట్‌ ఒకొక్కటీ 300 రూపాయలు అనుకొన్నా 1200 అవుతాయి. అంటే.. 3వేల రూపాయలు అన్నమాట. అదే.. ఫ్యామిలీతో పాటు సినిమాలకు వెళ్తే నలుగురికీ 12 వేలు. పాప్‌ కార్న్‌, సమోసా, కూల్‌ డ్రిరక్‌ కలుపుకొంటే దాదాపుగా 15 వేలు అవుతుంది. ఇదీ సంక్రాంతి సినిమాల బడ్జెట్‌. మరి ఇదంతా ఓ సామాన్య మధ్యతరగతి ప్రేక్షకుడు భరించగలడా? ఇన్ని సినిమాల్ని మోయగలడా? అనేదే ప్రధానమైన ప్రశ్న.

సంక్రాంతి గొప్ప సీజన్‌. ఇందులో తిరుగులేదు. అలాగని.. మరీ ఏడు సినిమాల్ని దించేయడం మాత్రం భావ్యం కాదేమో అనిపిస్తోంది. సంక్రాంతికి కచ్చితంగా 4 సినిమాలకు చోటుంది. మరో సినిమాని ఎడ్జిస్ట్‌ చేయొచ్చు. తెలుగులో 5 సినిమాలే లెక్క. కానీ రెండు డబ్బింగ్‌ సినిమాలు వచ్చి పడిపోతున్నాయి. ఆ రెండిరటినీ తెలుగు ప్రేక్షకులు లైట్‌ తీసుకొనే అవకాశం ఉంది. తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇచ్చి, అప్పుడు డబ్బింగ్‌ సినిమాలవైపు దృష్టి పెట్టొచ్చు. ప్రభాస్‌, చిరు, రవితేజ సినిమాలకు ఎలాగూ ఓపెనింగ్స్‌ ఉంటాయి. మిగిలిన సినిమాలు సంక్రాంతి సీజన్‌ని క్యాష్‌ చేసుకోవాలనుకొంటున్నాయి. కాకపోతే.. ఈ ఓవర్‌ బడ్జెట్‌ ని సామాన్యుడు ఎలా సర్దుబాటు చేసుకొంటాడు, తన దృష్టి ఏయే సినిమాలపై ఉంది అనేదే ఆసక్తికరం. ఆ లెక్కలు తేలాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page